సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీలు కేంద్రం ఇంకా నెరవేర్చలేదని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏపీ కూడా భారతదేశంలో అంతర్భాగమేనన్నారు. పోలవరం నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
చదవండి: ఉద్యోగులకు చంద్రబాబు ఏం ఉద్ధరించారు?: మంత్రి బొత్స
‘‘ప్రత్యేక హోదా రాష్ట్రాలు స్వర్గం అయిపోయాయా? అని చెప్పి చంద్రబాబు ప్రత్యేక హోదాను పలుచన చేశారు. కమీషన్లకు కక్కుర్తిపడి కేంద్రం నిర్మించాల్సిన పోలవరాన్ని తానే నిర్మిస్తానని సమస్యలు తెచ్చి పెట్టారు. సొంత స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారు. సీఎం వైఎస్ జగన్ వల్లే ప్రత్యేక హోదా డిమాండ్ సజీవంగా ఉంది. రాష్ట్రానికి వస్తున్న నిధులను టీడీపీ అడ్డుకుంటుంది. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే రాష్ట్రానికి నిధులు వస్తాయా?. కేంద్ర ప్రభుత్వంతో సామరస్యపూర్వకంగా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాం. సీఎం లేవనెత్తిన అంశాలపై కార్యదర్శిల కమిటీ వేసి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ కమిటీ ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నామని’’ ఎంపీ మార్గాని భరత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment