29 నుంచి ‘థలసేమియా’ సేవలు ప్రారంభం
అనంతపురం మెడికల్ : అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఈనెల 29వ తేదీ నుంచి థలసేమియా బాధితులకు పూర్తి స్థాయి వైద్య సేవలు ప్రారంభించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ తెలిపారు. బుధవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందజేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రసవానంతం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు అందరికీ అందిస్తామని తెలిపారు. ఎవరూ ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ వాహన సేవలు అందుబాటులోకి తెచ్చిందని, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఆర్ఎంఓ డాక్టర్ వైవీ రావు, వైద్యులు శ్రీనివాసులు, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.