ఎస్ఐ రాతపరీక్షకు సెట్ జి ప్రశ్నాపత్రం ఎంపిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరుతున్న సబ్ఇన్స్పెక్టర్ రాతపరీక్షకు సెట్ జి ప్రశ్నపత్రాన్ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎంపికచేసిందని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 321 పరీక్ష కేంద్రాల్లో సబ్ఇన్స్పెక్టర్ రాత పరీక్ష జరుగనుంది. 568 ఎస్ఐ పోస్టులకుగాను రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సివిల్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ కమ్యూనికేషన్ పరీక్ష నిర్వహిస్తారు.
ఎస్ఐ పరీక్షల్లో తొలిసారిగా బయోమెట్రిక్ విధానం అమలుచేస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాయడానికి అనుమతించేదిలేదని అధికారులు తెలిపారు. పరీక్షల కోసం హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అర్టీసీ అధికారులు తెలిపారు.