Settipalli
-
శెట్టిపల్లి భూముల జోలికి రావొద్దు: పవన్
సాక్షి, తిరుపతి/అమరావతి: తిరుపతి సమీపంలోని శెట్టిపల్లిలో గ్రామస్తులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూముల జోలికి రావొద్దంటూ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హెచ్చరించారు. బుధవారం ఆయన శెట్టిపల్లిలో రైతులు, గ్రామస్తులతో సమావేశమై భూముల వివరాలడిగి తెలుసుకున్నారు. రైతులెవరూ తమ భూములను ఇవ్వొద్దని, బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వేలకోట్ల దోచుకుంటూ, పేదల భూములనూ లాక్కుంటారా? అని ప్రశ్నించారు. పట్టాలిస్తామని గ్రామదేవతపై ప్రమాణం చేసి ఇప్పుడు ఆర్థికనగరం పేరుతో భూ సమీకరణ అని భూములు లాగేసుకుంటున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
భారీ వర్షాలకు పంట నష్టపోవడంతో ఇద్దరు రైతులు ఆత్మహత్య
-
భారీ వర్షాలకు పంట నష్టపోవడంతో ఇద్దరు రైతులు ఆత్మహత్య
హైదరాబాద్: అకాల వర్షాలు ఇద్దరు రైతుల ఉసురుతీశాయి. భారీ వర్షాలకు పంట నష్టపోవడంతో నిజామాబాద్, నల్గొండ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం శెట్టిపల్లిలో రైతు బాగయ్య ఆత్మహత్య చేసుకున్నారు. కోసిన రెండెకరాల వరి తడిసిపోవడంతో మనస్తాపంతో బాలయ్య(48) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ జిల్లా మోత్కుపల్లి మండలం ముసిపట్ల గ్రామంలో రైతు అయినమల్లు ఆత్మహత్య చేసుకున్నారు. పది ఎకరాల పంట వర్షాలకు నష్టపోవడంతో దిక్కుతోచని స్థితిలో అయినమల్లు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.