seven saturdays
-
నయన మనోహరం..
లోక కల్యాణార్థం చేపట్టిన ఏడు శనివారాల వ్రతాలు అనంతపురంలో ఘనంగా జరుగుతున్నాయి. శనివారం స్థానిక ఆర్ఎఫ్ రోడ్డులోని లక్ష్మీవేంకటేశ్వర ఆలయంలో నయన మనోహరంగా వందలాది మంది మహిళలు సామూహిక వ్రతమాచరించారు. ఒకేసారి దీపారాధన చేయడంతో ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా వింత శోభను సంతరించుకుంది. - అనంతపురం కల్చరల్ -
నేత్రపర్వం
అనంతపురం కల్చరల్ : ఆషాఢమాసం చివరి శనివారం సందర్భంగా స్థానిక ఆర్ఎఫ్ రోడ్లోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏడు శనివారాల వ్రతం కనుల పండువగా జరిగింది. శనివారం మహిళా భక్తులు ఏకరూప వస్త్రధారణతో వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఏఎల్ఎన్ శాస్త్రి, హరికిశోర్ శర్మ నేతృత్వంలో భక్తుల గోవింద నామస్మరణతో ఆప్రాంతం మార్మోగింది. భక్తులు బారులుదీరి వేంకటేశ్వర స్వామి ప్రతిమకు ప్రత్యేక పసుపు, కుంకుమలతో, పవిత్ర జలాలు, పుష్పాలతో పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ఆలయంలోని శ్రీ లక్ష్మీ సహిత శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రత్యేక అలంకరించారు. సుప్రభాత సేవ, అభిషేకాలు, తిరుమంజనం,తోమాల సేవ. కుంకుమార్చన. తీర్థప్రసాద వినియోగం జరిగాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మార్మోగిన గోవింద నామస్మరణ
అనంతపురం కల్చరల్ : లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న ఏడు శనివారాల వ్రతాలు నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో శనివారం స్థానిక ఆర్ఎఫ్ రోడ్డులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఆలయ అర్చకులు ఏఎల్ఎన్ శాస్త్రి, హరికిషోర్ శర్మ నేతత్వంలో వందలాది మహిళలు సామూహిక వ్రతమాచరించారు. ఏకరూప వస్త్రధారణతో బారులు తీరి కూర్చున్న మహిళలు తమ ముందు ఏర్పాటు చేసుకున్న వెంకటేశ్వర స్వామి ప్రతిమకు పసుపు, కుంకమలతో, పవిత్ర జలాలతో, పుష్పాలతో పూజలు చేశారు. అనంతర ం అర్చకులు ఏడు శనివారాల వ్రత విశిష్టత గురించి వివరించారు. కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి, కొండయ్య, నాగరాజు, ఫెక్ల్స్ రమణ తదితరులు పాల్గొన్నారు.