
నయన మనోహరం..
లోక కల్యాణార్థం చేపట్టిన ఏడు శనివారాల వ్రతాలు అనంతపురంలో ఘనంగా జరుగుతున్నాయి. శనివారం స్థానిక ఆర్‌ఎఫ్ రోడ్డులోని లక్ష్మీవేంకటేశ్వర ఆలయంలో నయన మనోహరంగా వందలాది మంది మహిళలు సామూహిక వ్రతమాచరించారు. ఒకేసారి దీపారాధన చేయడంతో ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా వింత శోభను సంతరించుకుంది.
- అనంతపురం కల్చరల్