మార్కెట్ యార్డ్‌లో దొంగల బీభత్సం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని మార్కెట్ యార్డ్‌లో మంగళవారం ఉదయం దొంగలు బీభత్సం సృష్టించారు. మార్కెట్ యార్డ్‌లోని ఏడు షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. అక్కడి వాచ్‌మెన్‌ను బెదిరించి షాపుల్లో నుంచి రూ.4 లక్షల రూపాయలను దొంగలు అపహరించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.