Severe injured
-
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
కురవి/మహబూబాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృత్యువాతకు గురికాగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కురవి మండలంలోని కాంపల్లి శివారు సత్యమాత ఆలయం సమీపంలో ఖమ్మం ప్రధాన రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కారు పల్టీకొట్టి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభానికి ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. సీరోలు ఏఎస్సై సారమల్లు కథనం ప్రకారం.. మహబూబాబాద్ పట్టణం మార్నేనినగర్‌కు చెందిన మార్నేని వేణు, భార్య సునీత, కుమారులు మ నుచరణ్, శ్రీహర్షతో పాటు వేణు బంధువులైన సూరి శెట్టి శ్రీనివాసరావు, భార్య అనిత, కుమార్తె విదాత్రి మహబూబాబాద్ నుంచి విజయవాడకు గత సోమవారం వెళ్లారు. విదాత్రికి ఆరోగ్య సమస్యలుండడంతో విజయవాడలో చికిత్సకోసం కారులో వెళ్లారు. చికిత్స అనంతరం సోమవారం రాత్రి అదే కారులో విజయవాడ నుంచి ఖమ్మంకు చేరుకున్నారు. ఖమ్మం నుంచి కురవి మీదుగా మహబూబాబాద్‌కు వస్తుండగా కురవి శివారులోని సత్యమాత గుడి సమీపంలోకి రాగానే సోమవారం తెల్లవారుజామున(మంగళవారం) కారు ఒక్కసారిగా పల్టీకొట్టింది. కారును శ్రీనివాసరావు డ్రైవింగ్ చేస్తున్నాడు. కారు పల్టీకొట్టి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొంది. ఈ ఘటనలో మార్నేని మనుచరణ్(13) అక్కడికక్కడే మృతి చెందాడు. అందులో ప్రయాణిస్తున్న మార్నేని వేణుకు ఎడమకాలు విరిగి కిడ్నీల వద్ద బలమైన గాయమైం ది. వేణు భార్య సునీతకు, కుమారుడు శ్రీహర్షకు, వేణు సడ్డకుడైన సూరిశెట్టి శ్రీని వాసరావుకు, అతని భార్య అని తకు, కు మార్తె విధాత్రికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే శ్రీనివాసరావు 108కి సమాచారం అందజేయడంతో హుటాహుటిన క్షతగాత్రులను మహబూబాబాద్‌లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మనుచరణ్ మృతదేహం వద్ద బంధువుల రోధనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సారమల్లు తెలిపారు. గణపురంలో.. గణపురం(భూపాలపల్లి): గణపురం మండలంలోని బస్వరాజుపల్లె కాకతీయ లాంగ్వాల్ ప్రాజెక్టు సమీపంలో గొల్లపల్లె క్రాస్ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. గణపురం ఏఎస్సై యాకుబ్‌అలీ కథనం ప్రకారం.. గణపురం మండలకేంద్రానికి చెందిన కొయ్యల కృష్ణంరాజు అనే వ్యక్తి స్థానిక ద్విచక్రవాహన షోరూంలో పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం కృష్ణంరాజు అతని ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి వెళ్లి రాత్రి 9గంటలకు తిరిగివస్తుండగా గొల్లపల్లె క్రాస్ వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్‌ను గమనించకుండా అతివేగంతో వచ్చి ఢీ కొట్టాడు. దీంతో అతను బండిపై నుంచి కింద పడగా తలకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన సింగరేణి ఉద్యోగులు వెంటనే 108కి సమాచారం అందించడంతో కృష్ణంరాజును సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ కూడా వైద్యులు పరిస్థితి విషమించిందని తెలపడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమద్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య మాధవి, రెండు సంవత్సరాల కూతురత్సుంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఏమి‘టీ’ శిక్ష..?
సీతంపేట: భరించలేని తలనొప్పి ఆ విద్యార్థి పాలిట శాపంలా పరిణమించింది. ఎంతో ఓపిక, సహనంతో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి..ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయిని బాధ్యత మరిచి వేడి టీ గ్లాసుని బాలుడి చేతిపై ఉంచింది. దీంతో బాలుడి చేతి పై తీవ్ర గాయమై..ఆస్పత్రి పాలయ్యాడు. వివరాలివీ.. మల్లి గిరిజన సంక్షేమ ఉన్నత బాలుర ఆశ్రమ పాఠశాలలో జగ్గడుగూడకు చెందిన సవర సూగన్న ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 15న పాఠశాలలో సో షల్ అసిస్టెంట్ పల్లెరిక చంద్రకళ 8వ తరగతి మూడు సెక్షన్లు కలిపి పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. మధ్యలో టీ రావడంతో ఆమె టీ తాగుతూ..ఆ సమయంలో తలనొప్పితో బాధపడుతూ..కునుకు తీస్తున్న సూగన్న వద్దకు వెళ్లి..టీ గ్లాసుతో చురక వేసింది. వెంటనే తేరుకున్న విద్యార్థి వెక్కివెక్కి ఏడ్చాడు. అనంతరం చేతిపై బొబ్బలు తేలడంతో మరుసటి రోజు.. వసతిగృహ సంక్షేమాధికారి ధర్మారావు ఆస్పత్రికి తీసుకువెళ్లినా.. చేయిపై బొబ్బలు తగ్గలేదు. అనంతరం చెయ్యి సెప్టిక్ అయి..చీము కారడంతో విద్యార్థి..తన స్వగ్రామమైన జగ్గడుగూడకు వచ్చేసి..తల్లికి విషయాన్ని చెప్పాడు. కంగారు పడిన ఆమె..సపర్యలు చేసి, బం ధువులతో విషయాన్ని చెప్పింది. వెంటనే వారంతా.. ఐటీడీఏకు వచ్చి..జరిగిన సంఘటనను బుధవారం రాత్రి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఆయన..విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని డీడీ సుదర్శనదొరను ఆదేశించారు. డీడీ పాఠశాలకు వెళ్లి..విచారణ జరిపారు. ఇంత నిర్లక్ష్యమా..? మల్లి ఆశ్రమ పాఠశాలలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ సుదర్శన దొర విచారణ చేపట్టారు. ఏటీడబ్ల్యూవో ఎర్రన్నాయుడు, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌పాత్రో తదితరులు పాఠశాల సిబ్బంది నుంచి వివరాలు తీసుకున్నా రు. ఉపాధ్యాయిని చంద్రకళను విచారించగా..విద్యార్థి చేయిపై..టీ తాగుతున్న గ్లాసుతో చేరకవేయడం వాస్తవేనని అంగీకరించారని డీడీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇంత సంఘటన జరిగినా..తనకు గానీ, ఏటీడబ్ల్యూవోకు గానీ సమాచారం ఇవ్వకపోవడం వెనుక హెచ్ఎం నిర్లక్ష్యం ఉందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణ నివేదికను ఐటీడీఏ పీవోకు అందజేస్తానన్నారు. ఇదిలా ఉండగా..బాబు కనీసం అన్నం తినలేకపోతున్నాడని..సూగన్న తల్లి చంద్రమ్మ రోదిస్తోంది. పాఠశాలకు పంపిస్తే..ఇంతటి శిక్ష వేస్తారా..అంటూ..ఆమె ప్రశ్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చదివించాలంటూ.. ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాలుడికి వైద్యసేవలంది స్తున్న డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ..చెయ్యి సెప్టిక్ అయ్యిందని..ప్రస్తుతానికి ఫర్వాలేదని తెలిపారు. ఉపాధ్యాయురాలి సస్పెన్షన్ విద్యార్థిపై టీ గ్లాసుతో చురక వేసిన ఉపాధ్యాయిని పి.చంద్రకళను సస్పెండ్ చేసినట్టు గిరిజన సంక్షేమ శాఖ డీడీ సుదర్శన్ దొర తెలిపారు. సంఘటన జరిగినా..ఐటీడీఏకు సమాచారం ఇవ్వనందుకు హెచ్ఎం గున్ను రామ్మోహనరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.