Sewer drain
-
అన్నం తింటున్నపుడు కూడా అదే మురికి వాసన..
ఇస్లామాబాద్: ‘‘మురికి కాలువలో ఉన్నపుడు నా చుట్టూ బొద్దింకలు చేరతాయి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ ఘటనలు వెంటాడుతూనే ఉంటాయి. అన్నం తినడానికి ఎప్పుడైతే చేతిని నోటికి దగ్గరకు తీసుకువస్తానో అప్పుడు మురికి వాసనే వస్తుంది. ఇది అన్నిటికంటే చాలా కష్టమైన పని. ఒక్కోసారి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా దగ్గరికి తీసుకోలేని దుస్థితి. పనిచేస్తూనే ఎప్పుడు ఎలా చనిపోతానో తెలియదు’’.. పాకిస్తాన్‌లోని కరాచీలో డ్రైనేజీ శుభ్రం చేసే జంషద్ ఎరిక్ అనే వ్యక్తి ఆవేదన ఇది. కుల, మత, జాతి వివక్షను ఎదుర్కొనే ఎరిక్ లాంటి ఇంకెంతో మంది పారిశుధ్య కార్మికులు అతడిలాగే కనీస సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలకు నోచుకోవడం లేదు. దేవుడి మీద భారం వేసి మురికి గుంటలోకి దిగడం.. అదృష్టం బాగుండి విష వాయువులు వెలువడక పోతే బతికి బయటపడటం. ఇదే వారి రోజువారీ దినచర్య. ప్రభుత్వం వారికి మాస్కులు గానీ, చేతులకు గ్లోవ్స్ గానీ అందించదు. ఇలాంటి కనీస సదుపాయాలు లేక ఇటీవలి కాలంలో అనేక మంది క్రిస్టియన్ కార్మికులు మృత్యువాత పడటం పాకిస్తాన్లో ఉన్న కుల, మత వివక్షకు అద్దం పడుతోందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ‘‘అనేక దశాబ్దాల క్రితం భారత్‌లో కుల వివక్ష, అంటరానితనం భరించలేక చాలా మంది మతం మారారు. 1947లో దేశ విభజన అనంతరం వీరిలో కొంతమంది పాకిస్తాన్‌కు వెళ్లారు. అయితే ముస్లిం మెజారిటీ దేశమైన ఆ దేశంలో మైనార్టీలుగా పరిగణింపబడుతున్న హిందూ, క్రిస్టియన్ వర్గాలు మాత్రమే మురికి కాలువలు శుభ్రం చేసే పనిచేయాల్సి ఉంటుంది. గతేడాది జూలైలో పాకిస్తాన్ సైన్యం ఓ పత్రికలో.. ‘‘కేవలం క్రైస్తవులు మాత్రమే స్వీపర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు వారు మాత్రమే అర్హులు’’ అంటూ ఓ వివాదాస్పద ప్రకటన విడుదల చేసిందంటే అక్కడ వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటువంటి అనుచిత ప్రకటనపై హక్కుల సంఘాలు భగ్గుమనడంతో వెనక్కి తగ్గిన అధికారులు మతం అనే ఆప్షన్‌ను తీసివేశారే తప్ప నియామకాల్లో మాత్రం ఎటువంటి మార్పులేదు. పాకిస్తాన్‌లోని చాలా వరకు మున్సిపాలిటీల్లో ఎరిక్ లాంటివారే స్వీపర్లు, సీవర్ క్లీనర్లుగా ఉంటారు. ఒట్టి చేతులతోనే వారు మురికి కాలువలు, పైపులు, అందులోకి వచ్చే ఆస్పత్రి, పరిశ్రమల వ్యర్థాలను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇందుకు వారికి చెల్లించే మొత్తం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఎరిక్‌కు మూడు కాల్వలు శుభ్రం చేసినందుకు అందిన మొత్తం కేవలం 6 డాలర్లు. చదువుకోలేదు... అందుకే వాళ్లను ఇలా ఈ విషయం గురించి మాజీ ఎంపీ, స్వీపర్ ఆర్ సూపర్‌హీరోస్ అడ్వకసీ గ్రూపును నడుపుతున్న మేరీ జేమ్స్ గిల్ మాట్లాడుతూ.. సీవేజ్ క్లీనింగ్ కోసం యంత్రాలు అందుబాటులోకి తీసుకు రావాలని తాను ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపారు. అయితే పారిశుధ్య కార్మికుల్లో చాలా మంది నిరక్షరాస్యులని, కాబట్టి ప్రభుత్వ అధికారులు వారిని సులభంగా ఒప్పించి మురికికూపంలోకి దింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సదుపాయాలు కూడా అందుబాటులో ఉండకపోవడం వల్ల వారంతా చర్మ, శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడిప్పుడే కొంతమంది తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు సిద్ధమవుతున్నారని.. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అని పేర్కొన్నారు. ఇక దాదాపు 20 కోట్ల మంది జనాభా ఉన్న పాకిస్తాన్లో సుమారు 80 శాతం పారిశుద్ధ్య కార్మిక పోస్టుల్లో మైనార్టీలనే నియమిస్తున్నారని.. వారి పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలను కొట్టిపారేస్తోంది. ఏదేమైనా తమ లాంటి కార్మికులకు ఆరోగ్య భద్రత లేదని, రోగం బారిన పడి ఆస్పత్రికి వెళ్తే తమను చూసి కొంతమంది డాక్టర్లు లోపలికి కూడా అనుమతించరని.. తమ జీవితాలు ఇలాగే ముగిసిపోతాయంటూ మరో కార్మికుడు తమకు ఎదురవుతున్న చేదు అనుభవాల గురించి పంచుకున్నాడు’’ అని ఈ మేరకు కథనం వెలువరించింది. -
మారేదెన్నడు..సమస్య తీరేదెప్పుడు?
► చెత్త వేస్తుండడంతో నిండుతున్న జౌళి నాల ►ఎన్నిసార్లు పనులు చేపట్టినా అదే తీరు ►ఇబ్బంది పడుతున్న చుట్టు పక్కల ప్రజలు ► పట్టించుకోని అధికారులు నిర్మల్ టౌన్ : జిల్లాకేంద్రం నుంచి వెళ్లే జౌళినాల పూడికతో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు పలుమార్లు జౌళినాల పూడికను తీసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. అందులో చెత్తను వేస్తుండడంతో మళ్లీ పూడకతో నిండిపోతున్నాయి. సరైన మురుగుకాలువ వ్యవస్థ లేకపోవడంతో చుట్టుపక్కల ఇళ్ల నుంచి మురుగునీరు సైతం ఇందులోకే చేరుతోంది. అందులోనే చెత్తను వేయడంతో మరింత అధ్వాన్నంగా తయారైంది. దీనిలోని పూడికను తీయడానికి మున్సిపల్ ఆధ్వర్యంలో పలుమార్లు పనులు చేపట్టినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఎన్నిసార్లు పనులు చేపట్టినా... జౌళినాల పూడికతీత పనుల కోసం ఇప్పటి వరకు పలుమార్లు ప నులు చేపట్టారు. పని అయిపోయిందనిపించారే తప్ప పూడికతీ తను పూర్తిస్థాయిలో తీయడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. లక్షల రూపాయలు వె చ్చించి పూడికతీత పనులను చేపట్టినా ప్రయోజనం ఉండడం లే దు. ఇంతకుముందు పనులు చేపట్టినప్పుడు జౌళినాలలోనే ఓ ప క్కకు తొలగించిన పూడికను అలాగే ఉంచారు. దీంతో అది మళ్లీ అందులోనే పడడంతో సమస్య మొదటికి వస్తోంది. దీనికి తోడు జౌళినాలల్లో పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయాయి. దీంతో మురికినీ రు వెళ్లేందుకు దారిలేక అలాగే నిలిచిఉంటోంది. పారిశుధ్యం కరువు... జౌళినాల పట్టణంలోని విశ్వనాథ్‌పేట్, నాయిడివాడ, బేస్తవార్‌పేట్, సోమవార్‌పేట్, కాల్వగడ్డ, కురాన్నపేట్‌ల మీదుగా పోతోంది. ఇంతకుముందు జౌళినాలలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేది. కానీ స్వర్ణ నుంచి నీరు రావడంలో అడ్డంకులు ఏర్పడడంతో నీటిపారకం నిలిచిపోయింది. అప్పటి నుంచి చుట్టుపక్కల ఇళ్ల నుంచి మురుగునీటిని అందులోనే వదులుతున్నారు. దీంతో విపరీతంగా దుర్గంధం వ్యాపిస్తోంది. ఇబ్బందుల్లో ప్రజలు... జౌళినాల నుంచి దుర్గంధం వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం కాలనీలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. కొన్ని చోట్ల జౌళినాలలను ఆక్రమించుకుని ఇళ్లను నిర్మించుకోవడంతో మురుగునీరు పోవడానికి సరైన స్థలం లేకుండా పోయింది. మురుగునీరు ఇళ్లల్లోకి వచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులతోనే పాలకవర్గం నెట్టుకొస్తున్నారు. దీనివల్ల నిధులు ఖర్చవుతున్నా, సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. శాశ్వత ప్రాతిపదికన పనులు నిర్వహిస్తేనే తగిన ఫలితం ఉంటుంది.ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
రూ. అరకోటికి గండి
రేపల్లె: రేపల్లెలోని న్యూకోర్సు మురుగుకాలువ ఆధునీకరణ పనుల్లో భాగంగా చేపట్టిన తవ్వకాల్లో భారీగా మట్టి వచ్చింది. మొదటివిడతలో వచ్చిన మట్టిని టెండర్ల ద్వారా అధికారులు విక్రయించారు. ఇళ్ల వద్ద, పొలాల్లో మెరక పోసుకునేందుకు ఈ మట్టి బాగా ఉపయోగకరం కావడంతో సహజంగానే డిమాండ్ ఏర్పడింది. దీంతో రెండో విడత వచ్చిన మట్టిని గుట్టుచప్పుడు కాకుండా పాత టెండర్‌దారులే అమ్మేసుకున్నారు. దీనికి అధికారులు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించారు. ఇదీ జరిగింది... ► రేపల్లె ప్రధాన మురుగుకాలువగా ఉన్న న్యూకోర్సు అధునీకరణ పనులను 2012-13లో సుమారు రూ.10 కోట్లతో ప్రారంభించారు. ►నగరం మండలంలోని 16.200 కిలోమీటర్ నుంచి 8.800 కిలోమీటర్ వరకు కాలువ తవ్వకాలు చేపట్టారు. ►పలు ప్రాంతాల్లో కాలువను మూడు విడతలుగా తవ్వాల్సి వచ్చింది. ►కాలువలో మొదటి విడత పూడిక తీయగా వచ్చిన మట్టిని విక్రయించేందు కు 12 రీచ్(ప్రతి 500 మీటర్లకు ఒక రీచ్)లుగా విభజించి, 2013 జూన్‌లో టెండర్లు పిలిచారు. ►మట్టి విలువను రూ.27.6 లక్షలుగా నిర్ణయించగా, టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లు రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. ►ఈ విధంగా కాంట్రాక్టర్లు మట్టిని అమ్ముకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన ► కాలువ 13.700 కిలోమీటర్‌నుంచి 12.500 మధ్య వంతెన ఉంది. ఇక్కడ టెండర్లు పిలవకుండానే మట్టిని కాంట్రాక్టర్, అధికారులు కుమ్మక్కై అమ్ముకున్నారు. మట్టి తరలింపుతో వంతెనకు తీవ్ర నష్టం కలుగుతుందని గ్రామస్తులు అడ్డుకున్నా పట్టించుకోలేదు. ►కాలువ కట్టల లెవలింగ్ పేరుతో రెండో విడత తవ్వకాలు చేపట్టారు. మళ్లీ భారీగా మట్టి వచ్చింది. ►టెండర్లు లేకుండా మట్టిని గుట్టుచప్పుడు కాకుండా అధికారులు పాతటెండర్దారులతో కుమ్మక్కై అమ్ముకున్నారు. ►దీంతో డ్రైనేజీ శాఖకు దాదాపు రూ. అర కోటి వరకు నష్టం వాటిల్లింది. ► 5, 6 రీచ్‌ల్లో మట్టిని తరలించకుండా నిబంధనల పేరిట అధికారులు నిలుపుదల చేశారు. తిరిగి ఇక్కడ రెండో విడత తవ్వకాల్లో వచ్చిన మట్టి నిల్వలపై ఇప్పుడు అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. ►డ్రైనేజీ అధికారుల అనుమతులు లేకున్నా మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల భిన్న వాదనలు ... ►దీనిపై డ్రైనేజీ శాఖ ఈఈ ఏసయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా ప్రజోపయోగానికి మట్టి తరలించుకునేలా అనుమతులు ఇచ్చామని చెప్పారు. టెండర్లు లేకుండా మట్టి తరలిస్తే ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది కదా అని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారు. ►డ్రైనేజీ డీఈ జోజయ్య మాత్రం గత నెలలో టెండర్లు పిలిచామని చెప్పారు. మట్టి తరలింపునకు గ్రామ సర్పంచ్‌కి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. ఎంతకు టెండర్ సొంతం చేసుకున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. ఇదిలావుండగా, న్యూకోర్సు మురుగు కాలువ తవ్వకాల్లో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.