ఎస్ఎఫ్డీ జిల్లా కన్వీనర్ గా హరీష్
అనంతపురం సప్తగిరిసర్కిల్ : అఖిల భారత విద్యార్థి పరిషత్ లోని స్టూడెంట్ ఫర్ డెవెలప్మెంట్ (ఎస్ఎఫ్డి) విభాగం జిల్లా కన్వీనర్ గా హరీష్ ను ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు తిరుమల రెడ్డి ప్రకటించారు. హరీష్ మాట్లాడుతూ విద్యార్థులలో నైపుణ్యం, ప్రతిభ ను వెలికితీయడం కోసం సేవాభావంతో సమాజం పట్ల అవగాహన పెంపొందించడమే ఎస్ఎఫ్డీ విభాగం ప్రధాన లక్ష్యమన్నారు.