shailja
-
ఇంకా తెలవారలేదు
బడికి వెళ్లి అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు మంచు తెరలపై రక్తాక్షరాలు అయ్యారు. తెల్లవారుజామునే జరిగిన రోడ్డు ప్రమాదంలో నెత్తుటి ముద్దలుగా మారారు. ఈ ఘోరం∙జరిగి సరిగ్గా ఏడాది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి నలుగురు విద్యార్థులతోపాటు ఆటోడ్రైవర్ బలైన విషాద ఘటన 2017 డిసెంబరు 28వ తేదీన ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ శివారులో జరిగింది. ఆ ఘటనలో విద్యార్థినులు కనుమర్తి గాయత్రి (15), ఆళ్ల రేణుక (15), పొట్లపల్లి శైలజ (15), మున్నంగి కార్తీక్ రెడ్డి (15), వీరితోపాటు ఆటోడ్రైవర్ రేపూడి ధన్‌రాజ్ (28) చనిపోయారు. గాయపడిన వారిలో పొట్లపల్లి భాను, పొట్లపల్లి వైష్ణవి, ఆలకుంట శిరీషలు ఉన్నారు. ఈ సంఘటన ఎనిమిది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. అందరూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. వైష్ణవి, శిరీష, లక్ష్మీ భవానీలు ముగ్గురికీ కాళ్లు విరగడంతో ఆపరేషన్లు చేశారు. కొద్ది రోజుల క్రితం వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగు పడటంతో ఇంటికి పంపారు. వీరిలో వైష్ణవి, లక్ష్మీభవాని ఇంటివద్ద మంచంలో ఉంటూనే చదువుకుని చేతి కర్రలుపట్టుకుని తల్లిదండ్రుల సహకారంతో పదోతరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం ప్రైవేట్ కళాశాల హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. శిరీషకు మూడు ఆపరేషన్లు జరిగాయి. ఒక ఆపరేషన్ విజయవంతం కాకపోవడంతో అమ్మ సాయం లేనిదే నడవలేని పరిస్థితిలో ఉంది. దీంతో పదోతరగతి పరీక్షలు కూడా రాయలేక మంచానికే పరిమితమైంది. తాను బాగా చదువుకుని ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించాలని అనుకునేదాన్నంటూ శిరీష గద్గద స్వరంతో చెబుతోంది. కదిలిస్తే కన్నీళ్లే శైలజ తండ్రి శ్రీధర్ ఎంత ముఖ్యమైన పని ఉన్నా గ్రామం నుంచి ఫిరంగిపురం వెళ్లే మార్గంలో ఉన్న దుర్ఘటన ప్రాంతం మీదుగా వెళ్లడం లేదు. అటు వెళితే తమ కుమార్తె అసువులు బాసిన ప్రాంతం వస్తుందని, అది చూసి తట్టుకోలేనన్న భయంతో కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న ఫిరంగిపురం వెళ్లేందుకు ఏడు కిలోమీటర్ల దూరం వచ్చి, 113 తాళ్లూరు నుంచి ఫిరంగిపురానికి రాకపోకలు సాగిస్తున్నారు. కార్తీక్‌రెడ్డి తండ్రి కూడా ఘటన గురించి ఎవరైనా గుర్తు చేస్తే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. గ్రామానికి ఆర్టీసీ బస్ రాని కారణంగా తన కుమారుడు పాఠశాలకు ఆటోలో వెళ్తూ ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లాడని.. ప్రభుత్వం నుంచి అందిన పరిహారంతో తన కుమారుడు కార్తీక్ పేరుతో బస్ షెల్టర్ నిర్మించాడు. పూలచెట్లు చూస్తే తమ కుమార్తె గుర్తుకు వస్తుందంటూ రేణుక తల్లి దేవి విలపిస్తున్న తీరు అపరిచితులు సైతం కంటనీరు తెప్పిస్తోంది. బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగం పొంది మిమ్మల్ని బాగా చూసుకుంటానని ఎప్పుడూ చెబుతుండేదని, దేవుడు తమకు అన్యాయం చేసి తీసుకెళ్లాడని గాయత్రి తల్లి శివకుమారి గుండెలు పగిలేలా రోదిస్తోంది. వైద్యం కోసం ఇల్లు తాకట్టు ఏడాది కాలంగా మంచానికే పరిమితమైన ఆలకుంట శిరీషకు మూడు విడతలుగా ఆపరేషన్లు జరిగాయి. మొదట ఆసుపత్రిలో చేర్చినప్పుడు ఉచితంగా వైద్యం చేయించిన ప్రభుత్వం ఆ తరువాత పట్టించుకోలేదు. దీంతో ప్రతినెలా వైద్యపరీక్షలు, మందుల కోసం వేలకు వేలు ఖర్చు అవుతుండటతోపాటు తండ్రి కృష్ణయ్య రెండేళ్లుగా పక్షవాతం కారణంగా కాలుచేయి పనిచేయక ఇంటివద్దే ఉంటున్నాడు. శిరీష తల్లి పుల్లమ్మకు కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. ప్రభుత్వం 2 లక్షలు నష్టపరిహారం ఇస్తుందనుకుంటే 1 లక్ష మాత్రమే ఇవ్వడంతో చేసేది లేక ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తెచ్చి శిరీషకు వైద్యం చేయిస్తున్నారు. బాసటగా వై.ఎస్.జగన్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ బాధితుల పక్షాన నిలబడడంతో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం కుటుంబాలకు ఆర్ధిక సహాయాన్ని అయితే ప్రకటించింది గానీ అందులోనూ మోసం చేసింది. – ఎన్. మాధవరెడ్డి, సాక్షి, గుంటూరు -
ఊరికిచ్చిన మాట
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం సొంత ప్లాటునే అమ్మకానికి పెట్టి, దానిద్వారా వచ్చిన 22 లక్షల రూపాయలతో చేవెళ్ల మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధిపనులు చేపట్టారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల జెడ్పీటీసీ సభ్యురాలు చింపుల శైలజ! ఇది చూసైనా ప్రభుత్వం తను ఇవ్వవలసిన నిధులను విడుదల చేస్తుందని ఆమె ఆశిస్తున్నారు. మండలంలోని దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన శైలజ చేవెళ్ల మండల జెడ్పీటీసీ సభ్యురాలుగా 2014 లో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఆమె భర్త చింపుల సత్యనారాయణరెడ్డి దేవుని ఎర్రవల్లి గ్రామ సర్పంచ్‌గా 2009 నుంచి 2014 వరకు పనిచేశారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన భార్య శైలజ పోటీకి దిగటంతో ప్రజలు ఈ దంపతులపై ఉన్న నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. మండలం కూడా దేవుని ఎర్రవల్లి గ్రామం మాదిరిగా అభివృద్ధి చెందుతుందని ఆశించారు. అయితే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో తన మండలం అభివృద్ధికి శైలజ సొంత డబ్బును వినియోగించదలిచారు! ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను ఆమె వివరించారు. అన్ని ప్రయత్నాలూ విఫలం ‘‘ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు రావాల్సిన 540 కోట్ల సీనరేజీ నిధులు విడుదల కాకపోవడంపై పలుమార్లు నేను నా భర్తతో కలిసి ప్రభుత్వానికి నివేదించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు! జిల్లాలో జెడ్పీటీసీలంతా కలిసి నిధులు రావటం లేదని సమావేశమై చర్చించాం. అప్పుడు మాత్రం ప్రభుత్వం స్పందించి జిల్లా జెడ్పీటీసీలందరిని పిలిపించి అసెంబ్లీ వద్ద కేటీఆర్, పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి క్రిష్ణారావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డిలు నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. అయినప్పటికీ విడుదల కాలేదు. దాంతో హైకోర్టును ఆశ్రయించాను. కోర్టు కూడా రెండు నెలల్లో నిధులను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లింది. విసిగిపోయి ‘సొంత’ నిర్ణయం ప్రభుత్వం స్పందించకపోవటంతో పాటు నిధులు విడుదల చేయకుండా పై కోర్టుకు అప్పీల్‌కు వెళ్లటంతో ఓటర్లకు ఇచ్చిన హామీలలో కొన్నింటినైనా నెరవేర్చాలనే ఆలోచనతో నా సొంత ప్లాటు అమ్మి మండలంలో అభివృద్ధి చేయాలనే నిర్ణయానికి వచ్చాను. ఈ నిర్ణయంతోనైనా ప్రభుత్వంలో కొంతైనా చలనం వచ్చి గ్రామాలకు రావాల్సిన సీనరేజీ నిధులు వస్తాయనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ప్లాటు అమ్మి వచ్చిన నిధులను మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేటాయిస్తానని ఆరు నెలల క్రితం ప్రకటించాను. ప్రకటించినట్లుగానే చేవెళ్ల మండల కేంద్రంలోని హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి పక్కనే నా పేరుపై ఉన్న 100 గజాల ప్లాటును అమ్మి వేశాను. దీనికి 22 లక్షల రూపాయలు వచ్చాయి. వీటిని అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నాను’’ అని శైలజ తెలిపారు. – ఎస్.రాకేశ్, సాక్షి, చేవెళ్ల, రంగారెడ్డి చేపట్టిన పనులు మండలంలోని మడికట్టులో రైతుల పొలాల వద్దకు వెళ్లే లింకురోడ్డుతోపాటు.. ఎన్కేపల్లి, మల్లారెడ్డిగూడ, కేసారం గ్రామాల్లో వాటర్‌ప్లాంటు ఏర్పాటు, ఊరేళ్లలో రైతుల పొలాల వద్దకు మట్టి రోడ్డు, కుమ్మెరలో సీసీ రోడ్డు లాంటి పనులు ముందుగా చేయాలని శైలజ నిర్ణయించారు. వీటికి ఖర్చు చేయగా నిధులు మిగిలితే ఘనాపూర్‌లో వడ్డెర బస్తీకి రోడ్డు పనులు చేయాలని అనుకున్నారు. ఇలా ఉంటుందని అనుకోలేదు రాజకీయాలంటే మరీ ఇంత దారుణంగా ఉంటాయని అనుకోలేదు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లుగానే నిధులు సైతం వస్తాయని అనుకున్నాను. నేను ఊహించింది ఒకటి అయితే వాస్తవంగా జరుగుతుంది మరొకటి. అందుకే నా బాధ్యతగా నన్ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు తన వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ఈ సాహసం చేశాను. వచ్చేది కొద్ది డబ్బే అయినా కొన్ని హామీలనైనా తీర్చాననే తృప్తి నాకు మిగులుతుంది. నా ఈ నిర్ణయంతో స్థానిక సంస్థల పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే అన్ని గ్రామాలు బాగుపడుతాయని ఆశిస్తున్నాను. – చింపుల శైలజ, జెడ్పీటీసీ, చేవెళ్ల -
పేదరికం నాగలి పట్టించింది!
ఇంటర్ చదివిన శైలజ.. ఎవరైనా సాయం చేస్తే చదువుకుంటానని వెల్లడి అక్కన్నపేట (హుస్నాబాద్): పేదరికం ఆమెతో నాగలి పట్టించింది. తండ్రికి చేదోడుగా నిలవాలనే సంకల్పం ఆమె చేత వ్యవ‘సా యం’ చేయిస్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కూచనపల్లికి చెందిన గూల రవి, సారమ్మలకు ముగ్గురు ఆడపిల్లలు. రవి తన రెండెకరాల భూమి సాగు చేసుకుంటూ, ఒంట్లో ఓపికున్నంత కాలం రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని అంతో ఇంతో చదివించగలిగాడు. రబీ కలసి రాలేదు.. ఖరీఫ్‌లోనైనా కలసి రాకపోతుందా? అనే ఆశతో సాగు మొదలు పెట్టాడు. వ్యవసాయ ఖర్చుల కోసం, తమ ను చదివించేందుకు, కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి పడుతున్న ఇబ్బందుల్ని చూడలేక ఆయన పెద్ద కుమార్తె శైలజ.. సాగు పనుల్లోకి దిగింది. హుస్నాబాద్‌లో ఇంటర్మీడియ ట్ వరకు చదివిన ఆమె ప్రస్తుతం చదువు ఆపే సి, పూర్తిగా వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమైపోయింది. బుధవారం పత్తి విత్తేందుకు వీలు గా దుక్కిలో గొర్రు తోలింది. చదువుకోవాలని ఉంది.. ఇంటర్ చదివాను. తండ్రి కష్టం చూడలేక వ్యవసాయంలోకి దిగా. స్నేహితురాళ్లు చదువుకోవడానికి పోతున్నారు. నాకూ చదువుకోవాలని ఉంది. కానీ, పూట గడిచే పరిస్థితి లేదు. అందుకే నాన్నకు కొడుకు లేని లోటు తీరుస్తూ సాయపడుతున్నాను. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే చదువుకుంటా. – గూల శైలజ -
వివాహిత ఆత్మహత్య
గుంటూరు జిల్లా గురజాలకు చెందిన శైలజ(19) అత్తింటి వేధింపులకు తాళలేక ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శైలజ తల్లిదండ్రులు చిలకలూరిపేటలో ఉంటారు. భర్త జాన్ మోమిన్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. అదనపు కట్నం కోసం నిత్యం వేధించేవారని, వేధింపులకు తాళలేక తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని శైలజ తల్లి సామ్రాజ్యం గురజాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడాది క్రితం వారు అడిగినంత కట ఇచ్చి పెళ్లి చేశామని, అయితే ఇంకా డబ్బు తెమ్మని రోజూ హింసించేవాడని సామ్రాజ్యం పోలీసులకు వివరించింది. తాము ఎన్నిసార్లు నచ్చజెప్పినా జాన్ మోమిన్ వినేవాడు కాదని ఆమె పేర్కొంది. పోలీసులు కేసు నమోదుచేసి జాన్ మోమిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సైలజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
శైలజ ఏమంది?
‘‘సారీ హరీ! ఆరేళ్లపాటు కలిసి తిరిగాం..ఇది ప్రేమ అని ఎందుకనుకున్నావ్’’ అందా అమ్మాయి. హరి ప్రేమించిన ప్రతి అమ్మాయీ ఇదే మాట చెప్పింది. విసిగిపోయాడు. ఇక జన్మలో ఏ అమ్మాయినీ ప్రేమించకూడదని డిసైడైపోయాడు హరి. కానీ శైలజ అనే అమ్మాయి ‘ఐ లవ్ యూ’ అంది. కానీ, వెంటనే రిజెక్ట్ చేసింది. ఈ ట్విస్టేంటో తెలియాలంటే ‘నేను... శైలజ’ చూడాల్సిందే అంటున్నారు హీరో రామ్. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్, కీర్తీ సురేశ్ జంటగా ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 1న రిలీజ్ కానుంది. -
షార్ట్ ఫిల్మ్ @ : శైలజ..
ముదితల్ నేర్వగరాని విద్యన్గలదే.. ముద్దార నేర్పింపగన్.. అనే మాటలక న్నా.. అకుంఠిత దీక్ష.. నిరంతర కఠోర శ్రమ.. కష్టాల కడలిలో ఎదురీదడం.. అందివచ్చిన, అందుకోవాలనుకున్న అవకాశాలను దక్కించుకునే నైజంతోనే రాణిస్తామంటూ వర్ధమాన లఘు చిత్ర దర్శకురాలైన ఓ యువతి నిరూపిస్తోంది. ఆసక్తి ఉన్న రంగంలో కాసింత శ్రద్ధ పెడితే.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వయిస్తే.. అభిరుచికి, అభిలాషకు మరింత మెరుగులు దిద్దుకోవచ్చని, జీవిత లక్ష్యాలు సాధించవచ్చని చేతల్లో చూపుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తోందామె. విభిన్న ఆలోచనలకు చదువు అడ్డంకి కాదని.. వినూత్న ఆలోచనతో షార్ట్ ఫిల్మ్స్ డెరైక్టర్‌గా ప్రస్థానాన్ని కొనసాస్తూ దూసుకుపోతోంది. భవిష్యత్తులో ప్రముఖ సినీ డెరైక్టర్ కావాలన్నదే తన జీవిత ధ్యేయమని చెబుతున్న ఆమె పలమనేరుకు చెందిన నాగరాజు, విజయమ్మ దంపతుల కుమార్తె శైలజ. ఆమె కథాకమామిషు మీ కోసం.. పలమనేరు: షార్ట్ పిల్మ్ డెరైక్టర్‌గా శైలజ విశేషంగా రాణిస్తోంది. ఇప్పటికే పలు షార్ట్ ఫిల్మ్‌లకు దర్శకురాలిగా పని చేసింది. కొత్తదనంగా ఆలోచించి వినూత్నంగా చిత్రాలను తీస్తోంది. ఈ మధ్య ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాథ్ సాక్షి దిన పత్రిక సౌజన్యంలో నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్ కాంటెస్ట్‌లోనూ ఎంపికైంది. మారుమూల ప్రాంతం నుంచి సినీ రంగంలోకి ప్రవేశించడం అంత సులువు కాదు. కానీ తన లక్ష్య సాధనకు కష్టాలకు ఎదురొడ్డి ముందుకెళుతోంది. చదివింది ఇంటర్ వరకే. తొలి నుంచి సినీ రంగంపై ఉన్న ఆసక్తికి తోడు ప్రముఖ యాంకర్ సుమ ఇన్స్పిరేషన్తో యాంకర్ కావాలని కలలుకంది. ఎన్నో అడ్డంకులు. అవాంతరాలు.. అయినా మడమ తిప్పలేదు. ఒక్క ఏడాదిలోనే 22 ఉద్యోగాలు చేసింది. వేటిలోనూ సంతృప్తి కలగలేదు. వాటిని వదిలేసింది. ఎలాగైనా సినీ రంగంలో అడుగు పెట్టాలని లక్ష్యం బలంగా వేళ్లూనుకుంది. దీంతో ఇంట్లో వాళ్లను ఒప్పించి హైదరాబాదు చేరింది. జెమిని టీవీలో ప్రసారమైన కామెడీలో లైవ్ యాంకర్‌గా ప్రస్థానం మొదలైంది. ఆపై టీవీ సీరియల్ పాత్రలకు డబ్బింగ్, స్క్రిప్టు రైటింగ్‌తో పాటు పలు విభాగాల్లో పట్టు సాధించింది. ఇప్పటికే పలు లఘు చిత్రాలు.... ఈ మధ్యనే పూరి జగన్నాథ్ డెరైక్టర్స్ హంట్‌లో ఈమె దర్శకత్వం వహించిన హ్యాపీ బ్రేక్అప్ ఎంపికైంది. అంతకు ముందు మూడు తరాల ప్రేమకథ, మంచిని వెతుకుదాం, ఓ అనాథ నాన్న కథ, అందమైన ప్రేమకథ(మూకీ), ఒకే భవనంలో దెయ్యం అనే లఘు చిత్రం తీయడం, భవిష్యత్తు ప్రేమలపై 2040, హత్య ఎలా జరిగింది? అనే షార్ట్ ఫిల్మ్‌లు ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఎన్నో ఇబ్బందులు.. చిత్రపరిశ్రమలో అవకాశాలు దక్కించుకోవడం పురుషులకే చాలా కష్టం. మరి ఓ మహిళా దర్శకురాలిగా రాణించాలంటే ఎన్నో అవరోధాలు అధిగమించాల్సిందే. తాను తొలి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో భోజనం కూడా చేయకుండా నిద్రించిన సందర్భాలు ఉన్నాయని శైలజ చెబుతోంది. ఉదయం నిద్ర లేచింది మొదలు అర్ధరాత్రి దాకా సినిమానే జీవితంగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వస్తోంది. కఠోరమైన శ్రమతో ముందుకెళ్లాల్సిందే.... నేను దర్శకురాలిగా సినీ రంగంలో మంచిపేరు తెచ్చుకోవాలనే కష్టపడుతున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్డ్‌వర్క్ చేయాల్సిందే. నేను టీవీ రంగంలో పలు శాఖలో పని చేస్తూ ఆ సంపాదనతోనే లఘు చిత్రాలు తీస్తున్నా. ఈ మధ్యనే డెరైక్టర్‌గా అవకాశం వచ్చింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. - శైలజ, లఘుచిత్ర దర్శకురాలు