గుంటూరు జిల్లా గురజాలకు చెందిన శైలజ(19) అత్తింటి వేధింపులకు తాళలేక ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శైలజ తల్లిదండ్రులు చిలకలూరిపేటలో ఉంటారు. భర్త జాన్ మోమిన్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. అదనపు కట్నం కోసం నిత్యం వేధించేవారని, వేధింపులకు తాళలేక తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని శైలజ తల్లి సామ్రాజ్యం గురజాల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఏడాది క్రితం వారు అడిగినంత కట ఇచ్చి పెళ్లి చేశామని, అయితే ఇంకా డబ్బు తెమ్మని రోజూ హింసించేవాడని సామ్రాజ్యం పోలీసులకు వివరించింది. తాము ఎన్నిసార్లు నచ్చజెప్పినా జాన్ మోమిన్ వినేవాడు కాదని ఆమె పేర్కొంది. పోలీసులు కేసు నమోదుచేసి జాన్ మోమిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సైలజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వివాహిత ఆత్మహత్య
Published Sun, Jan 10 2016 3:44 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement