shameless flop show
-
'దంగల్' బ్యూటీ షేమ్‌లెస్ సెల్ఫీ
‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్ మరోసారి సెల్ఫీతో నెటిజన్ల ముందుకు వచ్చారు. బాలీవుడ్ తారలు ధరిస్తున్న డ్రెస్సులపై నెటిజన్లు మండిపడుతున్న సమయంలో ‘షేమ్‌లెస్’ సెల్ఫీతో సోషల్ మీడియాలో కలకలం రేపారు. చీర, బ్లౌజ్ ధరించి 'షేమ్‌లెస్ సెల్ఫీ' అంటూ చిన్న క్యాప్షన్ పెట్టి ఫొటో పోస్ట్ చేసిన ఈ అమ్మడు తీరు ఏమీ బాగాలేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక మహిళ చీర, బ్లౌజ్ ధరించే తీరు ఇదేనా? అసభ్యంగా వున్న ఈ సెల్ఫీ ద్వారా నువ్వు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎరుపు రంగు చీరలో.. చేతుల కింది దాకా బ్లౌజ్‌తో, నాభి కనిపించేలా ఉన్న ఈ సెల్ఫీపై కొందరు ప్రశంసలు గుప్పించారు. అంతకుముందు ఆమె పోస్ట్ చేసిన సెల్ఫీ పైనా కూడా నెటిజన్లు తిట్లవర్షం కురిపించారు. విమర్శలను పట్టించుకోకుండా తాజా మరో సెల్ఫీ పోస్ట్ చేశారు. :) 📸 @arjunkamath87 💄 @dsimrock 💇🏻 @nakitadsouza 💃 @nekkosha thank you nekko😘😘 A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on Nov 7, 2017 at 2:08am PST Shameless selfie😬📸 credit for Saree @swatimukund 😘😘 A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) on Oct 8, 2017 at 7:49am PDT -
నోట్లరద్దు సిగ్గుమాలిన ఫ్లాప్ షో
మరోసారి మోదీపై విరుచుకుపడిన మమత రేపటి నుంచి మూడురోజులపాటు దేశవ్యాప్త నిరసనలకు పిలుపు కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మరోసారి బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. మొన్నటికి మొన్న ప్రధానిగా మోదీని తొలగించి, ఇతర బీజేపీ అగ్రనాయకులు పగ్గాలు చేపట్టాలని ప్రతిపాదించిన ఆమె.. తాజాగా పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా మూడురోజుల పాటు దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్, భువనేశ్వర్, పంజాబ్, కిషన్‌గంజ్(బీహార్), మణిపూర్, త్రిపుర, అస్సాం, జార్ఖండ్, ఢిల్లీలలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. సోమవారం, మంగళవారం, బుధవారం ఈ ధర్నాలు చేపడతామని ఆమె చెప్పారు. నోట్ల రద్దు పేరుతో నవంబర్ 8 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనలను ఎత్తివేయాలని, నగదు ఉపసంహరణ ఆంక్షలను తొలగించాలని మమత డిమాండ్ చేశారు. నోట్ల రద్దు వల్ల లక్షలాదిమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.