shanthamma
-
శ్రీనివాస్ గౌడ్ తల్లి దశదిన కర్మలో పాల్గొన్న సీఎం కేసీఆర్
-
శ్రీనివాస్ గౌడ్ తల్లి దశదిన కర్మలో పాల్గొన్న సీఎం కేసీఆర్
సాక్షి, మహబూబ్‌నగర్: ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను సీఎం కేసీఆర్ ఆదివారం పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆదివారం శాంతమ్మ దశదిన కర్మకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. మహబూబ్‌నగర్ భూత్పూర్ రోడ్డు పాలకొండలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని శాంతమ్మ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించిచారు. సీఎం కేసీర్‌తోపాటు మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ అక్టోబర్ 29న కన్నుమూసిన విషయం తెలిసిందే. -
స్వైన్ ఫ్లూతో వరంగల్ జిల్లా వాసి మృతి
వరంగల్ : వరంగల్ నగర పరిధిలోని చింతగట్టు క్యాంప్‌ప్రాంతానికి చెందిన బి. శాంతమ్మ(51) స్వైన్ ఫ్లూ బారిన పడి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈనెల 12వ తేదీన ఆమె కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లకు బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆమె జ్వరంతో బాధపడుతూ స్థానిక వైద్యుడిని ఆశ్రయించింది. జ్వరం నయం కాకపోవడంతో నగరంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో ఆమెకు ఫిట్స్ రావడంతో హెదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సైన్‌ఫ్లూగా నిర్ధారించారు. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం రాత్రి మృతి చెందింది. శాంతమ్మ సైన్‌ఫ్లూతో మృతి చెందినట్లు ఆర్డీ నాగేశ్వర్రావు ద్రువీకరించారు. -
శ్రీశైలంలో దంపతుల ఆత్మహత్య
శ్రీశైలం, న్యూస్‌లైన్ : మొదటి భార్యకు సంతానం కల్గలేదంటూ రెండో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి చివరకు ఆమెకు జన్మించిన కూతురు పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చలేక ఒంటరిగా మిగిలిని మొదటి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శ్రీశైల క్షేత్రం పాతాళగంగ రోడ్డు మార్గంలో ఉన్న సర్వతోభద్ర వనంలో గురువారం చోటు చేసుకుంది. మృతులను మహబూబ్‌నగర్ జిల్లా జడ్జర్ల మండలం మరికల్ గ్రామానికి చెందిన శివ య్య (50)శాంతమ్మ (45)గా పోలీసులు గుర్తించారు. సీఐ నాగేశ్వరరావు వివరాల మేరకు శివయ్య తన మొదటి భార్యకు సంతానం లేకపోవడంతో రెండో పెళ్లి చేసుకోగా ఇద్దరు కొడుకులు, కూతురు కలిగారు. కూతురుకు పెళ్లీడు రావడంతో రెండేళ్ల క్రితం ఘనంగా పెళ్లి జరిపించాడు. అయితే ఇందుకోసం చేసిన అప్పులు వడ్డీలు పెరిగిపోవడం, ఇచ్చిన వాళ్లు ఒత్తిడి తెస్తుండడంతో భరించలేక చనిపోవాలనుకున్నాడు. అయితే తాను పోతే కొడుకులున్నారు కాబట్టి రెండో భార్యకు ఇబ్బంది లేకున్నా మొదటి భార్య మాత్రం ఒంటరిదవుతుందని భావించి ఆమెను కూడా వెంట తీసుకెళ్లాడు. ఏదో ఊరికి ఇద్దరం కలిసి వెళ్తున్నామని అందరికీ చెప్పిన శివయ్య పత్తి పంటకు పిచికారి చేసేందుకు తెచ్చిన పురుగు మందు తీసుకుని బుధవారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. గురువారం ఉదయం స్ప్రైట్ కూల్‌డ్రింక్ బాటిల్లో మందు కలిపి ఇద్దరూ తాగారు. అక్కడున్న తోటమాలి గమనించి సమాచారం ఇవ్వగా 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చారు. అప్పటికే శాంతమ్మ మరణించగా శివయ్యను ప్రాజెక్టు వైద్యశాలకు తరలించారు. అతడు చికిత్స పొందుదూ మృతి చెందాడు. వన్‌టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. వారి వద్ద ఉన్న ఫోన్‌బుక్ ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.