శ్రీశైలంలో దంపతుల ఆత్మహత్య | couple committed suicide in srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో దంపతుల ఆత్మహత్య

Published Fri, Dec 13 2013 2:19 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

couple committed suicide in srisailam

 శ్రీశైలం, న్యూస్‌లైన్ :  మొదటి భార్యకు సంతానం కల్గలేదంటూ రెండో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి చివరకు ఆమెకు జన్మించిన కూతురు పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చలేక ఒంటరిగా మిగిలిని మొదటి భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శ్రీశైల క్షేత్రం పాతాళగంగ రోడ్డు మార్గంలో ఉన్న సర్వతోభద్ర వనంలో గురువారం చోటు చేసుకుంది. మృతులను మహబూబ్‌నగర్ జిల్లా జడ్జర్ల మండలం మరికల్ గ్రామానికి చెందిన శివ య్య (50)శాంతమ్మ (45)గా పోలీసులు గుర్తించారు. సీఐ నాగేశ్వరరావు వివరాల మేరకు శివయ్య తన మొదటి భార్యకు సంతానం లేకపోవడంతో రెండో పెళ్లి చేసుకోగా ఇద్దరు కొడుకులు, కూతురు కలిగారు. కూతురుకు పెళ్లీడు రావడంతో రెండేళ్ల క్రితం ఘనంగా పెళ్లి జరిపించాడు.

అయితే ఇందుకోసం చేసిన అప్పులు వడ్డీలు పెరిగిపోవడం, ఇచ్చిన వాళ్లు ఒత్తిడి తెస్తుండడంతో భరించలేక  చనిపోవాలనుకున్నాడు. అయితే తాను పోతే కొడుకులున్నారు కాబట్టి రెండో భార్యకు ఇబ్బంది లేకున్నా మొదటి భార్య మాత్రం ఒంటరిదవుతుందని భావించి ఆమెను కూడా వెంట తీసుకెళ్లాడు. ఏదో ఊరికి ఇద్దరం కలిసి వెళ్తున్నామని అందరికీ చెప్పిన శివయ్య పత్తి పంటకు పిచికారి చేసేందుకు తెచ్చిన పురుగు మందు తీసుకుని బుధవారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. గురువారం ఉదయం స్ప్రైట్ కూల్‌డ్రింక్ బాటిల్‌లో మందు కలిపి ఇద్దరూ తాగారు.

అక్కడున్న తోటమాలి గమనించి సమాచారం ఇవ్వగా 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చారు. అప్పటికే శాంతమ్మ మరణించగా శివయ్యను ప్రాజెక్టు వైద్యశాలకు తరలించారు. అతడు చికిత్స పొందుదూ మృతి చెందాడు. వన్‌టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. వారి వద్ద ఉన్న ఫోన్‌బుక్ ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement