వరంగల్ : వరంగల్ నగర పరిధిలోని చింతగట్టు క్యాంప్‌ప్రాంతానికి చెందిన బి. శాంతమ్మ(51) స్వైన్ ఫ్లూ బారిన పడి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈనెల 12వ తేదీన ఆమె కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లకు బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆమె జ్వరంతో బాధపడుతూ స్థానిక వైద్యుడిని ఆశ్రయించింది.
జ్వరం నయం కాకపోవడంతో నగరంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో ఆమెకు ఫిట్స్ రావడంతో హెదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సైన్‌ఫ్లూగా నిర్ధారించారు. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం రాత్రి మృతి చెందింది. శాంతమ్మ సైన్‌ఫ్లూతో మృతి చెందినట్లు ఆర్‌డీ నాగేశ్వర్‌రావు ద్రువీకరించారు.