శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లి దశదిన కర్మలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ | CM KCR Paid Tribute To Shantamma In Mahabubnagar | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లి దశదిన కర్మలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

Published Sun, Nov 7 2021 2:58 PM | Last Updated on Sun, Nov 7 2021 3:23 PM

CM KCR Paid Tribute To Shantamma In Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్: ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను సీఎం కేసీఆర్‌ ఆదివారం పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆదివారం శాంతమ్మ దశదిన కర్మకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. మహబూబ్‌నగర్ భూత్పూర్ రోడ్డు పాలకొండలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని శాంతమ్మ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించిచారు. సీఎం కేసీర్‌తోపాటు మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాతృమూర్తి శాంతమ్మ అక్టోబర్‌ 29న కన్నుమూసిన విషయం తెలిసిందే.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement