మంత్రి గారి భార్య పరీక్ష రాసేందుకు వచ్చి..
జగదల్పూర్: విద్యాశాఖ మంత్రి గారి సతీమణి పరీక్షలు రాయకుండానే పీజీ డిగ్రీ సంపాదించాలనుకుంది. తన పలుకుబడితో తన బదులు మరోకరు పరీక్షలు రాసేలా ఏర్పాటు చేసింది. కాగా మంత్రిగారి భార్య పంపిన నకిలీ విద్యార్థిని అడ్డంగా దొరికిపోయింది. చత్తీస్గఢ్లో ఈ సంఘటన వెలుగుచూసింది.
చత్తీస్గఢ్ విద్యాశాఖ మంత్రి కేదార్ కశ్యప్ భార్య శాంతి కశ్యప్.. సుందర్లాల్ శర్మ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ (ఇంగ్లీష్) ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. శాంతి కశ్యప్ తన బదులు సోదరి కిరణ్ మౌర్యను పరీక్షలు రాసేందుకు పంపారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు కిరణ్ మౌర్య.. శాంతి హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్ సెంటర్కు వెళ్లారు. పరీక్ష పత్రం తీసుకుని రాస్తుండగా.. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించారు. వారు సెంటర్ ఇంచార్జి హేమరావు ఖర్గేకు చెప్పడంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి కిరణ్ మౌర్యను ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు పంపారు. చత్తీస్గఢ్లో ఈ ఘటన దుమారం రేపింది. కాగా ఈ విషయంపై మంత్రి స్పందించలేదు.