మంత్రి గారి భార్య పరీక్ష రాసేందుకు వచ్చి.. | Fake Candidate Writes Exam for Chhattisgarh Minister's Wife: Sources | Sakshi
Sakshi News home page

మంత్రి గారి భార్య పరీక్ష రాసేందుకు వచ్చి..

Published Wed, Aug 5 2015 11:03 AM | Last Updated on Tue, May 29 2018 11:17 AM

మంత్రి గారి భార్య పరీక్ష రాసేందుకు వచ్చి.. - Sakshi

మంత్రి గారి భార్య పరీక్ష రాసేందుకు వచ్చి..

జగదల్పూర్: విద్యాశాఖ మంత్రి గారి సతీమణి పరీక్షలు రాయకుండానే పీజీ డిగ్రీ సంపాదించాలనుకుంది.  తన పలుకుబడితో తన బదులు మరోకరు పరీక్షలు రాసేలా ఏర్పాటు చేసింది.  కాగా మంత్రిగారి భార్య పంపిన నకిలీ విద్యార్థిని అడ్డంగా దొరికిపోయింది.  చత్తీస్గఢ్లో ఈ సంఘటన వెలుగుచూసింది.

చత్తీస్గఢ్ విద్యాశాఖ మంత్రి కేదార్ కశ్యప్ భార్య శాంతి కశ్యప్.. సుందర్లాల్ శర్మ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ (ఇంగ్లీష్) ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. శాంతి కశ్యప్ తన బదులు సోదరి కిరణ్ మౌర్యను పరీక్షలు రాసేందుకు పంపారు.  ఈ రోజు ఉదయం 10 గంటలకు  కిరణ్ మౌర్య.. శాంతి హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్ సెంటర్కు వెళ్లారు. పరీక్ష పత్రం తీసుకుని రాస్తుండగా.. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించారు. వారు సెంటర్ ఇంచార్జి హేమరావు ఖర్గేకు చెప్పడంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి కిరణ్ మౌర్యను ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు పంపారు. చత్తీస్గఢ్లో ఈ ఘటన దుమారం రేపింది. కాగా ఈ విషయంపై మంత్రి స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement