సమష్టిగా ఆడి విజేతగా నిలవాలి
– వాలీబాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్
మహబూబ్‌నగర్ క్రీడలు : రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీలో సమష్టిగా ఆడి విజేతగా నిలవాలని వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అ««దl్యక్షుడు శాంతికుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలుర కళాశాలలో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 వాలీబాల్ జిల్లా బాల, బాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను శాంతికుమార్ ప్రారంభించి మాట్లాడారు. ఓడిపోతే నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. జిల్లాలో ప్రతిభ కనబరుస్తున్న వాలీబాల్ క్రీడాకారులకు అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అండర్–19 ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రాంచందర్, పీడీ పాపిరెడ్డి, రిటైర్డ్ పీడీ చెన్నవీరయ్య తదితరులు పాల్గొన్నారు.
అండర్–19 బాలుర జట్టు : వెంకటేశ్, రాజేశ్, రమేశ్, ఆకాశ్ (మహబూబ్‌నగర్), రాజేందర్, గులాంమహ్మద్ (నారాయణపేట), రియాజ్ (మద్దూర్), శ్రీకాంత్, శ్రీశైలం (కడ్తాల్), కృష్ణయ్య (కోస్గి), రఘు (ఆత్మకూర్), పవన్‌కుమార్ (ఖిల్లాఘనపురం).
బాలికలు : నీలమ్మ, దీప, రజిత (కల్వకుర్తి), అమృత, అనిత (కోయిలకొండ), మహేశ్వరి, నందిని, పద్మ, శాంతి (మహబూబ్‌నగర్).