నదిలో పడి యువకుడు గల్లంతు
మాడుగుల(విశాఖపట్నం): పశువులను మేపడానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తూ నదిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా దేవరాపాలెం మండలం తారువ గ్రామ సమీపంలోని శారదా నదిలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. గ్రామానికి చెందిన యువకుడు పశువులను మేపడానికి తీసుకెళ్లి ప్రమాదవశాత్తూ కాలు జారి నదిలో కొట్టుకుపోయాడు.
ఇది గమనించిన తోటి పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.