మిస్టర్ క్లీన్!
కుర్రాడి పేరు ఆనంద్. అతనికి ఓసీడీ ఉంది. అంటే... అదేదో బీటెక్, ఎమ్‌టెక్ లాంటి డిగ్రీ అనుకునేరు. ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’ అన్నమాట. దీని లక్షణం అతి శుభ్రం. ఆనంద్ ‘మిస్టర్ క్లీన్’. ఈ డిజార్డర్‌తో ఆనంద్ లైఫ్ ఎలా ఉంటుంది? అనేది తెలుసుకోవాలంటే ‘మహానుభావుడు’ చూడాల్సిందే. శర్వానంద్ టైటిల్ రోల్లో మారుతి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. మెహరీన్ కథానాయిక. ఒక్క సాంగ్ మినహా షూటింగ్ కంప్లీట్ అయిన ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలనుకుంటున్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘భలే భలే మగాడివోయ్’ చిత్రం తర్వాత నాకు బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్‌తో చేస్తున్న చిత్రం ఇది. పుల్æకామెడీ అండ్ మ్యూజికల్ లవ్‌స్టోరీ. ఓసీడీ ఉన్న కుర్రాడిగా శర్వానంద్ అద్భుతంగా చేస్తున్నారు. తన కెరీర్లో బెస్ట్ మూవీగా నిలుస్తుంది. ఎస్.ఎస్. తమన్ అందించిన ఆడియో సూపర్’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో శర్వానంద్ హీరోగా చేస్తున్న మూడో చిత్రం ఇది. క్యారెక్టరైజేషన్‌తో కామెడీ పండించగల దర్శకుల్లో మారుతి ప్రథముడు. డబ్బింగ్ కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు.