Sharat Chandra
-
భర్తలకు సెక్షన్ ఏది?
ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఐపీసీ సెక్షన్ భార్యాబంధు’. శరత్చంద్ర, నేహా దేశ్‌పాండే జంటగా రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. శరత్చంద్ర మాట్లాడుతూ – ‘‘చిన్నప్పటినుంచి హీరో కావాలనుకునేవాణ్ణి. కొన్ని సినిమా షూటింగులు చూసిన తర్వాత సినిమాలంటే ఆసక్తి తగ్గింది. అమ్మా,నాన్నల ఒత్తిడితో అక్కినేని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకున్నాను. కోర్సు పూర్తయ్యాక ఏం చేస్తావని మా గురువుగారు అడిగితే ఇంటికెళ్తాను అని చెప్పాను. ఆయన నా ధృక్పథాన్ని మార్చారు. ఆ తర్వాత ‘ఐపీసీ సెక్షన్ భార్య బంధు’ చేసే అవకాశం వచ్చింది. ఇందులో న్యాయవాదిగా కనిపిస్తా. మన దేశంలో మహిళలు, వృద్ధులు, చిన్నారులకు అండగా కొన్ని చట్టాలు, సెక్షన్లు ఉన్నాయి. కానీ భార్యల వల్ల కష్టాలు పడే భర్తల కోసం ఒక్క చట్టం కూడా లేదు. ‘ఇండియన్ పీనల్ కోడ్‌లో’ ఓ కీలకమైన సెక్షన్ ‘ఇల్లాలి పీనల్ కోడ్’గా మారడంతో ఎంతోమంది మగాళ్లు కష్టాలు పడుతున్నారు. పెళ్లయిన మగాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ విషయాన్నే మా సినిమాలో చూపించాం’’ అన్నారు. ‘‘సంప్రదాయమైన అమ్మాయిగా, వెస్ట్రన్ డ్యాన్సర్‌గా రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేశాను. కథతో పాటు నా పాత్ర ట్రావెల్ అవుతుంది’’ అన్నారు నేహా దేశ్‌పాండే. -
కొరటాల శివపై కోర్టు సీరియస్
హైదరాబాద్: 'శ్రీమంతుడు' సినిమా దర్శక నిర్మాతలపై నాంపల్లి న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరో మహేశ్‌బాబుతో పాటు నిర్మాత ఎర్నేని నవీన్‌కు మరోసారి సమన్లు జారీ చేసింది. మహేష్ బాబుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేమని న్యాయస్థానం పునరుద్ఘాటించింది. హైకోర్టు నుంచి గిరిధర్ పేరుతో మహేశ్‌కు మినహాయింపు తీసుకురావడం చెల్లదని స్పష్టం చేసింది. మరోవైపు దర్శకుడు కొరటాల శివపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు ద్వారా మినహాయింపు కోరడం పట్ల సీరియస్ అయింది. గతంలో సమన్లు జారీ చేసినా తమ ఎదుట ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఆగస్టు 7కు కోర్టు వాయిదా వేసింది. స్వాతి మాస పత్రికకు 2012లో తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా నిర్మించారని, తన అనుమతి లేకుండా తన నవల ఆధారంగా సినిమా నిర్మించడం కాపీ రైట్ ఉల్లంఘనే అవుతుందంటూ ఆర్.డి.విల్సన్ అలియాస్ శరత్చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించడంతో విచారణ మొదలైంది. -
ఎమ్మెల్యే సహా తొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు
స్కై బార్ ఫలితం పరారీలో రౌడీ షీటర్ సోమశేఖర గౌడ అవసరమైతే ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తాం : శరత్ చంద్ర సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఇక్కడి యూబీ సిటీలోని స్కై బార్లో పోలీసులు, బార్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై బాగలకోటె జిల్లా హునగుంద ఎమ్మెల్యే (కాంగ్రెస్) విజయానంద కాశప్పనవర్ సహా తొమ్మిది మందిపై పోలీసులు గురువారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. విధులకు ఆటంకం కల్పించారని, నోటికొచ్చినట్లు దూషించారని, దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఐపీసీ సెక్షన్లు 353, 504 కింద కబ్బన్ పార్కు పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేతో పాటు ఉన్న రౌడీ షీటర్ సోమశేఖర గౌడ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నట్లు సంయుక్త పోలీసు కమిషనర్ కేవీ. శరత్ చంద్ర తెలిపారు. అతనిపై గతంలో కూడా అనేక కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి అవసరమైతే ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు. కాగా మంగళవారం రాత్రి ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బార్‌కు వెళ్లి దౌర్జన్యం చేసి, ఒకటిన్నర గంటల వ రకు పూటుగా మద్యం సేవించి, నృత్యాలు చేశారు. సమయం మించి పోయినా బారును తెరిచి ఉంచడంతో పోలీసు కానిస్టేబుల్ కిరణ్ కుమార్ వీడియో చిత్రీకరణ చేస్తుండగా ఎమ్మెల్యేతో పాటు విజయానంద దాడికి పాల్పడ్డారు. మరో వైపు పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో ఎమ్మెల్యే ఇక్కడి సిటీ కోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. బహిష్కరణ దౌర్జన్యానికి పాల్పడిన సోమశేఖర గౌడను కాంగ్రెస్ ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. ఎమ్మెల్యే విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఎవరైనా సరే, చట్టాన్ని అతిక్రమించడానికి వీల్లేదని ఆయన అన్నారు.