జైళ్లలో పేపర్ తయారీ కర్మాగారం
తెలంగాణ జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వీకే.సింగ్
హైదరాబాద్ : రాష్ట్రంలోని జైళ్లలో వ్యర్థ పదార్థాలతో పేపర్ తయారీ కార్మాగారాలను నెలకొల్పనున్నట్లు తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వీకే.సింగ్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని జైళ్లను పరిశీలించి, అక్కడ ఖైదీలను సంస్కరించడానికి అనుసరిస్తున్న విధానాలను ఆయన అధ్యయనం చేసి మంగళవారం తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ యూపీలోని ఆదర్శ్ జైల్లో నడుస్తున్న వ్యర్థపదార్థాలతో పేపర్ తయారీ కార్మాగారం, అందులో ఖైదీల భాగస్వామ్యం చాలా బాగుందని ప్రశంి సంచారు.