shatabdi trains
-
రైళ్లలో ఫ్లెక్సీ–ఫేర్‌కు సవరణలు
న్యూఢిల్లీ: ఖరీదైన రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో 2016లో ప్రవేశపెట్టిన ఫ్లెక్సీ–ఫేర్ విధానంలో రైల్వే మార్పులు చేయడంతో కొన్ని రైళ్లలో చార్జీలు తగ్గనున్నాయి. ఫ్లెక్సీ–ఫేర్ విధానాన్ని 15 రైళ్లలో పూర్తిగా, మరో 32 రైళ్లలో ప్రతి ఏడాదీ ఫిబ్రవరి, మార్చి, ఆగస్ట్ నెలల్లో మాత్రమే రైల్వే శాఖ రద్దు చేసింది. ఆ మూడు నెలల్లో ఈ 32 రైళ్లలో రద్దీ తక్కువగా ఉంటున్నందునే ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫ్లెక్సీ–ఫేర్ విధానం అమలయ్యే మిగతా రైళ్లలోనూ గరిష్ట చార్జీని ప్రస్తుతం ఉన్న 1.5 రెట్ల నుంచి 1.4 రెట్లకు తగ్గించింది. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఈ ఫ్లెక్సీ–ఫేర్ విధానం కారణంగా ప్రతి పది శాతం సీట్లు బుక్ అయ్యే కొద్దీ చార్జీ 10 పెరుగుతూ పోతుంది. అలా సాధారణ చార్జీతో పోలిస్తే గరిష్టంగా 1.5 రెట్ల వరకు చార్జీలను పెంచేవారు. తాజా నిర్ణయంతో చార్జీలు 1.4 రెట్ల వరకే పెరుగుతాయి. ఫ్లెక్సీ–ఫేర్ విధానం వల్ల రైల్వేకు ఆదాయం పెరిగింది కానీ ప్రయాణికుల సంఖ్య మాత్రం భారీగా తగ్గిందనీ ఈ ఏడాది జూలైలోనే రైల్వేపై కాగ్ మొట్టికాయలు వేశారు. దీంతో ఫ్లెక్సీ–ఫేర్‌లో తాజా మార్పులు జరిగాయి. ఈ మార్పుల కారణంగా చార్జీలు తగ్గుతున్నాయి కాబట్టి మరింత ఎక్కువ మంది ప్రయాణికులు రైళ్లు ఎక్కడం ద్వారా అధిక ఆదాయాన్ని సాధిస్తామని రైల్వే మంత్రి గోయల్ చెప్పారు. ఫ్లెక్సీ–ఫేర్ విధానం పూర్తిగా రద్దయిన వాటిలో చెన్నై–మదురై దురంతో రైలు ఉండగా.. ఫిబ్రవరి, మార్చి, ఆగస్ట్ నెలల్లో మాత్రమే ఈ విధానం రద్దయిన రైళ్లలో సికింద్రాబాద్–పుణె శతాబ్ది, సికింద్రాబాద్–హజ్రత్ నిజాముద్దీన్ శతాబ్ది, సికింద్రాబాద్–ముంబై దురంతో, చెన్నై సెంట్రల్–కోయంబత్తూర్ శతాబ్ది తదితర రైళ్లున్నాయి. -
రైలు ప్రయాణికులకు తీపికబురు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రద్దీ తక్కువగా ఉన్న మార్గాల్లో నడిచే శతాబ్ది ప్రీమియం రైళ్లలో చార్జీలను త్వరలో తగ్గించనున్నట్లు రైల్వేశాఖ ఉన్నతాధికారి చెప్పారు. ఈ ప్రతిపాదనపై రైల్వేశాఖ ప్రస్తుతం పనిచేస్తోందన్నారు. ఎక్కువ రద్దీలేని మార్గాల్లో నడుస్తున్న 25 శతాబ్ది రైళ్లలో చార్జీల్ని తగ్గించే అవకాశమున్నట్లు గుర్తించారు. గతేడాది ఢిల్లీ–అజ్మీర్, చెన్నై–మైసూరుల మధ్య చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో దీన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. బస్సులకు సమానంగా చార్జీలు తగ్గించడంతో ఈ మార్గాల్లో రైల్వే ఆదాయం 17 శాతం, ప్రయాణికుల బుకింగ్స్ 63 శాతం పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణ చార్జీలు తగ్గించడంతోపాటు రైలు సర్వీసుల లే ఓవర్ టైం తగ్గించి 100 కొత్త రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇప్పటికే 25 నూతన రైళ్లు ప్రారంభించగా, ఈ ఏడాదిలోపు మరో 75 రైళ్లు ప్రారంభం కానున్నాయి. వేగంగా ప్రయణించే 45 శతాబ్ది రైళ్లు దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నాయి. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు రాజధాని, దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. -
శతాబ్ది రైళ్లలో ఇక వినోదం కూడా!
దేశంలోని వివిధ ప్రధాన నగరాల మధ్య ప్రయాణ కాలాన్ని గణనీయంగా తగ్గిస్తూ, సౌఖ్యవంతమైన ప్రయాణాన్ని అందించే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణికులకు కొత్తగా వినోదాన్ని కూడా జోడిస్తున్నారు. ఇంతకాలం ఈ రైళ్లలో ఉచితంగా టీ, స్నాక్స్, భోజనాలు ఇచ్చేవారు. టికెట్ ధరలోనే వీటి ధర కూడా కలిపి ఉండేది. ఇది ప్రయాణికులకు చాలా సౌఖ్యంగా ఉండేది. దూరప్రయాణాల్లో ప్రత్యేకంగా భోజనాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ రైళ్లలో నాణ్యమైన ఆహారమే అందించేవారు. ఇప్పుడు దీనికితోడు వినోదాన్ని కూడా జోడిస్తే.. ఈ రైళ్లకు మరింత ఆదరణ లభించడం ఖాయం. వోల్వో బస్సులు, ఇతర దూరప్రాంత బస్సుల్లో ఎల్ఈడీ టీవీలలో సినిమాలు వేయడం మనకు ఎప్పటినుంచో తెలుసు. మరి శతాబ్ది రైళ్లలో కూడా ఇలాగే సినిమాలు చూపిస్తారో, లేక పాటలు వినిపిస్తారో చూడాల్సి ఉంది.