
శతాబ్ది రైళ్లలో ఇక వినోదం కూడా!
దేశంలోని వివిధ ప్రధాన నగరాల మధ్య ప్రయాణ కాలాన్ని గణనీయంగా తగ్గిస్తూ, సౌఖ్యవంతమైన ప్రయాణాన్ని అందించే శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణికులకు కొత్తగా వినోదాన్ని కూడా జోడిస్తున్నారు. ఇంతకాలం ఈ రైళ్లలో ఉచితంగా టీ, స్నాక్స్, భోజనాలు ఇచ్చేవారు. టికెట్ ధరలోనే వీటి ధర కూడా కలిపి ఉండేది. ఇది ప్రయాణికులకు చాలా సౌఖ్యంగా ఉండేది.
దూరప్రయాణాల్లో ప్రత్యేకంగా భోజనాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ రైళ్లలో నాణ్యమైన ఆహారమే అందించేవారు. ఇప్పుడు దీనికితోడు వినోదాన్ని కూడా జోడిస్తే.. ఈ రైళ్లకు మరింత ఆదరణ లభించడం ఖాయం. వోల్వో బస్సులు, ఇతర దూరప్రాంత బస్సుల్లో ఎల్ఈడీ టీవీలలో సినిమాలు వేయడం మనకు ఎప్పటినుంచో తెలుసు. మరి శతాబ్ది రైళ్లలో కూడా ఇలాగే సినిమాలు చూపిస్తారో, లేక పాటలు వినిపిస్తారో చూడాల్సి ఉంది.