sheet
-
‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎవరి రహస్యాలూ దాగడం లేదు. ఓ కుర్రాడు తన తండ్రికి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కుర్రాడు తండ్రి భద్రంగా దాచుకున్న అతని 10వ తరగతి మార్కు షీట్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇందులో అన్ని సబ్జెక్టుల్లో తండ్రి ఫెయిల్ అయ్యాడు. ఆ మార్క్ షీట్ ఫోటోకు క్యాప్షన్‌గా ‘తన తండ్రి మార్క్ షీట్ దొరికింది’ రాశాడు.ఆ కుర్రాడు వీడియోలో ‘మా నాన్న నాతో తరచూ పాస్ కావాలని చెబుతుంటారని, అయితే ఇప్పుడు చూడండి మా నాన్న మార్క్స్‌షీట్.. అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. ఈ వీడియోను చూసినవారంతా నవ్వకుండా ఉండలేకపోతున్నారు.ఈ మార్క్‌షీట్‌ను @desi_bhayo88 పేరిట సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ పోస్టును ఇప్పటివరకూ ఐదు లక్షల మంది చూడగా, ఐదు వేల మంది లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై పలువురు కామెంట్లు కూడా చేశారు. ఒక యూజర్ ఇప్పటితో పోల్చిచూస్తే సీబీఎస్ఈ బోర్డులో తండ్రి ఫెయిల్ అయిన మార్కులు 90 శాతానికి సమానం అని రాశారు. మరొకరు ఫెయిల్ అయితే ఏమవుతుందో తెలుసు కనుకనే పాస్ కావాలని చెప్పారని రాశారు. Pitaji ki marksheet mil gayi 😂 pic.twitter.com/3dXn0yKJh1— Desi Bhayo (@desi_bhayo88) April 19, 2024 -
సీట్ల కోసం సిగపట్లు..
అభివృద్ధి మంత్రంతో నెగ్గుకురాలేమని ఓ పక్క చంద్రబాబు వ్యూహాలు రచిస్తుంటే.. జిల్లా టీడీపీ నేతలు సిగపట్లతో బిజీబిజీగా ఉన్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర కాలం ఉండగానే.. ఆ సీటు నాదంటే నాదంటూ కుమ్ములాటలు మొదలెట్టారు. కొన్నిచోట్ల ప్రస్తుత ప్రజాప్రతినిధులపైకి స్థానిక నాయకులు కాలు దువ్వుతుండగా.. మరికొన్నిచోట్ల జంప్ జిలానీలు ఆశావహులకు ఎసరు పెట్టేలా ఉన్నారు. సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం సిటింగ్ ఎమ్మెల్యేలకు ఆశావహులు ఒకపక్క చెమటలు పట్టిస్తుంటే.. వైఎస్సార్సీపీ నుంచి వలస వచ్చిన శాసనసభ్యులు తొలి నుంచీ టీడీపీని నమ్ముకున్న నేతల ఆశలకు గండి కొడుతున్నారు. వెరసి ఎన్నికల వేడి రాజుకోకముందే అధికార పార్టీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. నేను ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ ప్రజాప్రతినిధులే కాదు.. ఆ పార్టీ నేతలు సైతం గురిపెట్టి బరిలోకి దిగుతుండడంతో సిటింగ్‌లకు ప్రాణ సంకటంగా మారింది. ఈసారి సీటు దక్కుతుందో లేదోనన్న సందేహాలు వారిని వెంటాడుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పుణ్యమాని అరకు, పాడేరు స్థానాలపై ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్ల ఆశలకు గండిపడే పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న ఎన్నికల్లోనైనా గెలవకపోతానా? అని పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఆశలు పెట్టుకోగా.. ఈసారి తనకు చాన్స్ దక్కుతుందన్న ఆశతో సీనియర్ నాయకుడు పాంగి రాజారావు ఇంతకాలం ఉన్నారు. గతేడాది టీడీపీలోకి ఫిరాయించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు రాకతో వీరి ఆశలకు గండిపడినట్టయింది. అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానం ఇస్తానని నమ్మించి మోసగించినా పార్టీనే అంటిపెట్టుకున్న మాజీ మంత్రి మణికుమారి, త్రిసభ్య కమిటీ సభ్యులైన బొర్రా నాగరాజు, ఎంవివిఎస్ ప్రసాద్‌లు రానున్న ఎన్నికల్లో పాడేరు టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా టీడీపీలోకి ఫిరాయించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రాకతో వీరి ఆశలకు ఇక్కడ గండి పడింది. ఈ రెండు చోట్ల పైకి గుంభనంగా ఉన్నప్పటికీ లోలోన మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పార్టీ ఆశావాహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరి చేరికను మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బాహాటంగానే వ్యతిరేకించారు. గత నాలుగేళ్లుగా నామినేటెడ్ పదవులు దక్కక.. రానున్న ఎన్నికల్లో టికెట్ వస్తుందన్న ఆశ లేక ఏజెన్సీ టీడీపీలో అసంతృప్తి నివురుగప్పిన నిçప్పులా రాజుకుంటోంది. ఏ క్షణంలోనైనా వీరు తమ అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైదానంలో అసమ్మతి సెగలు మైదాన ప్రాంతంలోనూ ఇదే రీతిలో అసంతృప్తి సెగలు ఎగసిపడుతున్నాయి. అనకాపల్లితోపాటు యలమంచిలి, చోడవరం నియోజకవర్గాల్లో సిటింగ్ ఎమ్మెల్యేలకు పలువురు ఎసరుపెట్టేలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా అనకాపల్లి నియోజక వర్గంపై ఒకరు కాదు.. ఇద్దరు కాదు నెలకొకరు సీటు నాదంటే నాదంటూ తెరపైకి వస్తున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ భూ కబ్జా కేసులో ఇరుక్కోవడంతో ఈసారి ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో ఈ స్థానం నుంచి పోటీ చేయబోతున్నామంటూ.. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు నర్మగర్భంగా ప్రకటించారు. అబ్బే అదేం లేదు ఈసారి నేనే పోటీ చేస్తా, నా సీటు ఎవరికీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పీలా చెప్పుకొచ్చారు. తాజాగా గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలికి టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఆయన బంధువు పరుచూరి భాస్కరరావు తన మనసులోని మాటను బయటపెట్టారు. అనకాపల్లి నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నానని, పార్టీ అధిష్టానం కూడా తన సేవలను గుర్తించి టికెట్ ఇస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీంతో అనకాపల్లి అసెంబ్లీపై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు పోటీ పడుతున్నట్టయ్యింది. యలమంచిలి నుంచి రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఈ స్థానంపై ఇరువురు కన్నేశారు. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు తనయుడు ఆడారి ఆనంద్‌తో పాటు జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని భర్త లాలం భాస్కర్ ఈ సీటు కోసం ఆశలు పెట్టుకున్నారు. విశాఖ డెయిరీ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు ఆడారి తులసీరావు లేదా ఆయన కుమార్తె పాల్గొనేవారు. కానీ కొన్ని నెలలుగా ఆనంద్ చురుగ్గా పాల్గొంటున్నారు. భాస్కర్ కూడా ఈ నియోజకవర్గంపై పట్టు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో పంచకర్ల కొత్త నియోజకవర్గం వెతుక్కోవల్సిన పరిస్థితి నెలకొంది. చోడవరంపై గంటా కన్ను చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు ఈసారి ఎసరు పెట్టేలా ఆ పార్టీలో చోటు చేసుకుంటున్న రాజకీయాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాజుకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ప్రతిసారి నియోజకవర్గం మారే గంటా ఈసారి సిటీలో ఏదో నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది వర్కవుట్ కాకపోతే గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన చోడవరాన్ని ఎంచుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ఈ స్థానం నుంచి టీడీపీ తరపున తాను బరిలోకి దిగబోతున్నట్టు గంటా తనయుడు రవితేజ ఆమధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చిన విషయం విదితమే. ఈ తండ్రీ కొడుకులిద్దరూ చోడవరంలో ఎమ్మెల్యే రాజు సీటుకు ఎసరు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఏడాదిన్నర ముందుగానే అధికార టీడీపీలో నెలకొన్న సీట్ల సిగపట్లు ఆ పార్టీకి తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
‘పుష్కర’ కేసులో ఛార్జిషీట్ వేసేదెన్నడు?
తొక్కిసలాటపై కేసు నమోదు చేసిన పోలీసులు రెండేళ్లు కావస్తున్నా నేటికీ పూర్తికాని విచారణ కొనసాగుతోందంటూ కమిషన్‌కు వివరణ ఛార్జిషీట్ వేస్తే కారణాలు, బాధ్యులు ఎవరో తెలిసే అవకాశం సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటపై పోలీసులు విచారణ ఇంకా కొనసాగుతోంది. 2015 జూన్ 14న పుష్కరాలు ప్రారంభమయ్యాయి. అదే రోజు ఉదయం సీఎం చంద్రబాబు దంపతులు పుష్కరఘాట్‌లో పూజలు, పుణ్యస్నానాలు ఆచరించారు. అ సమయంలో గంటన్నరపాటు లోపలికి వచ్చే భక్తులు బయటకు వెళ్లకుండా ఉన్న ఒక్కగేటు మూసివేశారు. గేటు ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసటాల చోటుచేసుకుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 28 మంది మరణించగా 51 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో స్థానిక పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 174 ప్రకారం 2015లో కేసు నంబర్ 268/2015 నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసి దాదాపు రెండేళ్లు కావస్తున్నా విచారణ ఓ కొలిక్కి రాలేదు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు ఏక సభ్యకమిషన్ కు చెబుతున్నారు. మొదట దర్యాప్తునకు ప్రత్యేక అధికారిగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డీఎస్పీ ఎం. అంబికా ప్రసాద్‌ను నియమించారు. కొన్ని రోజులు తర్వాత బదిలీపై అబింకా ప్రసాద్ వెళ్లిపోయారు. ఆయన తర్వాత కేసును ప్రస్తుతం అమలాపురం డీఎస్పీగా పనిచేస్తున్న అంకయ్యకు అప్పగించారు. అయితే నేటికీ కేసు విచారణ దశలోనే ఉండడం గమనార్హం. పోలీసులు నమోదు చేసిన కేసులో విచారణ పూర్తి చేసి చార్జిషీటు వేస్తే కమిషన్ విచారణకు ఉపయోగకరంగా ఉండేది. అయితే ముందు నుంచి కమిషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్న అన్ని ప్రభుత్వ విభాగాలులాగే పోలీసు శాఖ కూడా ఈ కేసుపై నాన్చివేత ధోరణి అవలబింస్తోంది. సీసీటీవీల ఫుటేజీలు లేవని చెప్పడం, రికార్డు కాలేదని, లైవ్ కోసమే వాటిని ఏర్పాటు చేశామని చెప్పడంతో యంత్రాంగం నిబంధనలను ఏ విధంగా ఉల్లంఘించిందో స్పష్టమవుతోంది. చనిపోయిన 28 మందికి పంచనామాలు, పోస్టుమార్టం నివేదికలు కమిషన్‌కు ఇస్తే కమిషన్ విచారణకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. అంతేకాకుండా చనిపోయిన, గాయపడ్డవారిని అక్కడ నుంచి ఎంత సమయానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచారు? ఆలస్యమైతే దానికి బాధ్యులు ఎవరు? అన్న విషయాలు దర్యాప్తులో తేలే అవకాశం ఉండేది. కానీ విచారణ పూర్తి చేయడానికి పోలీసుశాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్న విషయం మంగళవారం జరిగిన కమిషన్ విచారణలో తేటత్లెమవుతోంది. కనీసం ఫలానా సమయానికి విచారణ పూర్తవుతుందని కూడా పోలీసు అధికారులు చెప్పకపోవడం గమనార్హం. కేసుపై పోలీసుల నిర్లక్ష్యం.. తొక్కిసలాటపై పోలీసులు పెట్టిన కేసు ఇప్పటికీ పూర్తికాకపోవడం విడ్డూరం. గాయపడిన వారి ధ్రువపత్రాలు వచ్చిన తర్వాత చార్జిషీటు వేస్తామని గత విచారణ సందర్భంగా పోలీసులు చెప్పారు. ఆ పత్రాలను కమిషన్‌కు కూడా సమర్పించారు. కానీ వారి విచారణ పూర్తి చేసి చార్జిషీటు మాత్రం వేయకపోవడం కేసుపై వారి నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. – ముప్పాళ్ల సుబ్బారావు, న్యాయవాది, బార్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యుడు, రాజమహేంద్రవరం అధ్యక్షుడు -
చలికి దుప్పటి కప్పేద్దాం!
చలి మొదలైంది. వణుకు మొదలైంది. ఇన్నాళ్లూ బీరువాలో అడుగునో, బ్యాగుల్లోనో దాచిన స్వెట్టర్లు మెల్లగా బయటకు వస్తున్నాయి. సరికొత్త మోడల్స్‌ను వెతికే నేటితరం కోసం మార్కెట్లో ఎన్నో స్వెటర్ వెరైటీలు సందడిచేస్తున్నాయ. కలర్స్, కట్స్, కవరింగ్స్.. ఏదైనా సరే స్టైల్‌గా.. వెచ్చగా స్వెటర్‌ని హత్తుకుపొండి. చలికి దుప్పటి కప్పేయండి. మెటీరియల్స్‌లో స్వెటర్స్ గొర్రె వెంట్రుకలను గ్రేడ్స్‌గా విభజించి స్వెటర్లను తయారుచేస్తారు. గ్రేడ్ రకాలను బట్టి ధర ఉంటుంది. కాశ్మీర్ స్వెటర్ల ప్రపంచంలోనే మంచి నాణ్యమైనవిగా పేరుంది. అల్పాకా స్వెటర్స్ను ఫైబర్‌తో తయారుచేస్తారు. వీటి ఉత్పత్తిలో వందేళ్లుగా దక్షిణ అమెరికా ప్రసిద్ధిగాంచింది. చలికి వెచ్చదనాన్ని ఇవ్వడంలోనూ, కాశ్మీర్ ఊలు అంత మెత్తగా ఈ ఫైబర్ ఊలు ఉంటుంది. దీంతో గ్లౌజ్‌లు, హ్యాట్లు కూడా తయారుచేస్తారు. కాటన్, పాలియస్టర్ మెటీరియల్‌తో స్వెటర్లు తయారుచేస్తారు. ఇవి చలిని కొంతవరకు మాత్రమే ఆపగలవు. కాటన్ నాణ్యతను బట్టి ఇవి చలిని ఆపగలవు. పాలియస్టర్, కాటన్ల కలయికతో స్వెటర్లను తయారుచేస్తారు. వీటిని రెగ్యులర్ వేర్‌గానూ ధరించవచ్చు. ఫైబర్ కూడా ఇందులో కలిసి ఉంటుంది. పరిమాణం చాలా వరకు వదులుగా, ఒంటిమీద పడిపోతున్నట్టుగా ఉంటుంటాయి స్వెటర్లు. అలా అయితే చూడ్డానికి బాగుండదు. ఛాతీ పరిమాణం, పొడవు, చేతుల పొడవు..ఇలా శరీర కొలతల ప్రకారం ఎంపిక చేసుకోవాలి. నెక్ స్టైల్స్ ముఖ్యం క్రో నెక్: చాలా వరకు సాధారణంగా అందరూ ఉపయోగించే స్వెటర్లకు క్రో(కాకి) నెక్ ఉంటుంది. దీంట్లో వెడల్పు, మెడకు పట్టేసినట్టు ఉండటం వంటి తేడాలు ఉంటాయి. ఇది చాలా మామూలు స్టైల్. వి-నెక్: ఈ స్టైల్ స్వెటర్ సాధారణం కన్నా భిన్నం. ఇన్నర్ షర్ట్ నెక్ భాగం పైకి కనిపించేలా 2 పీస్ స్టైల్ ఇందులో చూడచ్చు. టర్టిల్ నెక్ పొడవు కాలర్ మడ త వేసి ఉంటుంది. ఈ స్టైల్ క్లాసిక్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఫార్మల్ టైప్ స్వెటర్స్ కన్నా ఇది ఇంకాస్త వెచ్చదనాన్ని ఇస్తుంది. రోల్నెక్, షావ్ల్ నెక్, నాచ్ నెక్ అంటూ నెక్ స్టైల్స్‌లో మరికొన్ని ఉన్నాయి. స్వెటర్ నెక్ స్టైలో ఫుల్ జిప్, హాప్ జిప్, అలాగే హాఫ్ బటన్, బటన్ డౌన్ ఉన్నవీ స్టైల్లో ముందున్నాయి. రంగులు ప్రాధాన్యం సాధారణంగా స్వెటర్ రంగులలో ముదురు రంగులకే ప్రాధాన్యం ఉంటుంది. వీటిలో నీలం, పచ్చ, పసుపు, ముదురు గోధుమ, బూడిద, తెలుపు, నలుపు రంగువి ఉంటాయి. మీ శరీర రంగును బట్టి ఈ కలర్స్‌ని ఎంచుకోవాలి. ధర కాదు కీలకం ఖరీదు ఎక్కువ పెట్టిన స్వెటర్లే బాగుంటాయిని అనుకోకూడదు. మీరు ఎంచుకున్న స్వెటర్ మీకు సౌకర్యవంతంగా, కంటి రంగులు ఇంపుగా, కనీసం 10 ఏళ్లు వేసుకోదగినదిగా చూసి ఎంపిక చేసుకోవాలి. తక్కువ ధరలోనూ నాణ్యమైన మెటీరియల్స్‌లో స్వెటర్లు అందుబాటులో ఉన్నాయి. మీ ఎంపికే ప్రధానమైనది. టేక్ కేర్ మెషిన్ వాష్, డ్రై క్లీన్ వద్దు ఊలు స్వెటర్‌ను శుభ్రపరచాలంటే డిటర్జెంట్ లిక్విడ్ సోప్‌ను కొద్దిగా నీళ్లలో కలిపి, అందులో నానబెట్టి, మురికిగా ఉన్న చోట రుద్దితే చాలు. ఊలు చాలా మెత్తగా ఉంటుంది, మురికి కూడా త్వరగా వదిలిపోతుంది. బ్రష్, డ్రైక్లీన్, మెషిన్వాష్... తో శుభ్రపరిస్తే ఊలు త్వరగా పాడైపోతుంది. అలాగే శుభ్రపరిచిన తర్వాత నీళ్లు పోయేలా గట్టిగా పిండకూడదు. కాసేపు ట్యాప్ మీద అలాగే ఉంచి, నీళ్లన్నీ పోయాక తీసి ఆరే యాలి. హ్యాంగ్ చేయవద్దు స్వెటర్లను హ్యాంగర్‌కి వేయడం వల్ల భుజాలు, మెడ భాగంలో సాగి ఊలు పలచనవడం,రంధ్రాలు పడటం వంటివి జరుగుతాయి. అందుకని మడచి, షెల్ఫ్‌లో పెట్టేస్తే చాలు. ఆరేసేటప్పుడు కూడా హ్యాంగర్స్ వాడకూడదు. దారాలు ఊడితే... ఊలు స్వెటర్ దారాలు వదులై బయటకు రావచ్చు. వాటిని స్వెటర్ లోపలి భాగానికి కలిపి కుట్టువేయడమో, ముడివేయడమో చేయాలి. ఈ జాగ్రత్త వల్ల స్వెటర్ త్వరగా పాడవదు. కొనేటప్పుడు... చలి నుంచి తట్టుకోవడానికి మాత్రమే స్వెటర్ ఎంపిక అనుకుంటున్నారా.. లేక మీకు అత్యంత ఇష్టమైనదిగా ఉండిపోయేలా ఎంచుకోవాలనుకంటున్నారా.. అనేది ముందు తేల్చుకోవాలి. స్వెటర్ కొనుగోలుకు ముందు ఏ మెటీరియల్‌తో తయారుచేసినది, సైజ్, స్టైల్, కలర్, కుట్టు, ధర.. ఇలా వరసగా సరిచూసుకోవాలి. - ఎన్.ఆర్ -
బెయిల్ స్కాం కేసులో అదనపు చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కేసులో బెయిల్ పొందేందుకు గాలి జనార్ధన్‌రెడ్డి ముడుపులిచ్చారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ అధికారులు కోర్టులో ఇటీవల ఓ అదనపు చార్జిషీట్‌ను దాఖలు చేశారు. జనార్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయించే క్రమంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న గాలి సోమశేఖర్‌రెడ్డి, రౌడీషీటర్ యాదగిరి, కంప్లీ ఎమ్మెల్యే సురేష్ తదితరులు.. తమ సన్నిహితులు, తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, బంధువుల పేర్లతో సిమ్ కార్డులు తీసుకుని, వాటి ద్వారా సంభాషణలు జరిపేవారని ఏసీబీ చార్జిషీట్లో పేర్కొంది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు ఎవరెవరి పేర్లతో సిమ్ కార్డులు పొందారో వారి వాంగ్మూలాలను నమోదు చేసి ఆ వివరాలను చార్జిషీట్లో పొందుపరిచారు. రౌడీషీటర్ యాదగిరి వద్ద పనిచేసే కారు డ్రైవర్ రాము, సోమశేఖర్‌రెడ్డి వ్యక్తిగత సహాయకులు సునీల్‌కుమార్‌రెడ్డి, జి.రాజశేఖర్, నాగరాజు తదితరుల వాంగ్మూలాలను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. వీరిలో కొందరు తమ గుర్తింపు కార్డులతోపాటు దరఖాస్తులపై సంతకాలు తీసుకున్నారని చెప్పగా, మరికొందరు తమకు అసలు ఫోన్లే లేవని చెప్పారు. బ్యాంకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నివేదిక ఇచ్చిన ఫోరెన్సిక్ అధికారుల వాంగ్మూలాలను కూడా ఏసీబీ నమోదు చేసింది.