అగ్గిపెట్టెలో ఇమిడే... ఖురాన్
కావలి: ముస్లింల పవిత్రగ్రంథం ఖురాన్. అయితే అన్ని ఖురాన్లు పెద్దపాటి గ్రంథాలుగా ఉండటం సహజం. కానీ అగ్గిపెట్టెలో పట్టేంత సైజులో ఉంటే ఆశ్చర్యమే కదా.. అలాంటి ఖురాన్ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని షేక్ మహబూబ్బాషా వద్ద ఉంది. బాషా చికెన్ దుకాణంలో పనిచేస్తూ రోజూ ఐదు పూటలా నమాజ్ చేస్తారు. 40 ఏళ్ల కిందట తన పాత పెంకుటిల్లు పడగొట్టి కొత్త ఇంటి నిర్మాణం కోసం పునాదులు తీస్తుండగా అగ్గిపెట్టె కంటే చిన్నపాటి పెట్టె కనిపించింది.
అందులో అంగుళం కంటే చిన్నపాటి ఖురాన్ కనిపించింది. అందులో 6,666 వాక్యాలు ఉన్నాయి. ఈ పవిత్ర గ్రంథాన్ని ఆ అల్లా తమకు ఇచ్చాడని భావించి అప్పటి నుంచి భద్రపరిచారు. ఖురాన్లో చెప్పినట్లు మానవ జీవితం ఒక ఆట, ఒక వినోదం, మనం కేవలం నిమ్మిత్త మాత్రులం... అల్లా ఎలా చెబితే అలా నడుచుకోవాల్సిందేనని అంటున్నారు మహబూబ్ బాషా.