వైఎస్సార్ సీపీ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ
ఆర్మూర్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారంతో నామినేషన్ల పర్వం ముగియడంతో జిల్లా ఎన్నికల ఉప అధికారి గజ్జన్న ఆధ్వర్యంలో అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. ఈ పరిశీలన సమయంలో కాంగ్రెస్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన నాయకులు కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థి షేక్ మహబూబ్ అలియాస్ గుడ్ల బాబాపై ఆరోపణలతో చేసిన ఫిర్యాదు కారణం గా ఉత్కంఠ పరిస్థితి నెల కొంది. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ సమర్పించిన ఎంఏ మాజిద్ నామినేషన్ ప త్రాల్లో అతని అభ్యర్థిత్వా న్ని ప్రతిపాదిస్తూ వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ అ భ్యర్థి షేక్ మహబూబ్ సంతకాలు చేశాడంటూ అతనిని పో టీకి అనర్హునిగా ప్రకటించాలని ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పీసీ భోజన్న, పీసీసీ కార్యదర్శి ఖాందేశ్ శ్రీనివాస్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు కలిసి వేరు వేరుగా ఎన్నికల అధికారికి ఫిర్యాదులు చేశారు. దీంతో జిల్లా ఎన్నికల ఉప అధికారి గజ్జన్న షేక్ మహబూబ్‌ను పిలిపించి వివరణ కోరారు. ఎంఏ మాజిద్ నామినేషన్ పత్రాలపై తాను సంతకం చేయలేదని తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేసి ఉంటారని పేర్కొన్నారు. దీంతో పూర్తి స్థాయి విచారణ అనంతరం ఫిర్యాదు చేసిన కాంగ్రెస్, వె ల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులను పిలిపించిన ఎన్నికల అధికారి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా షేక్ మహబూబ్ పోటీ చేయడానికి అర్హుడని ప్రకటించారు.
ఎవరైనా ఒక ఓటరు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రతిపాదించిన పక్షంలో అతను అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అనర్హుడు అని తెలిపే ఏ నిబంధన ఎన్నికల నియమావళిలో లేనందున వారి ఫిర్యాదును తిరస్కరిస్తున్నామన్నారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందంతో ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థిపై వచ్చిన ఫిర్యాదు విషయమై పార్టీ శ్రేణులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న నిజామాబాద్ అర్బన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంతిరెడ్డి శ్రీధర్ రెడ్డి, షేక్ మహబూబ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.