shield
-
చంద్రయాన్–3లో తెలుగు రక్షణ కవచం!
సాక్షి, అమరావతి: జాబిలిపై అన్వేషణకు బయల్దేరిన చంద్రయాన్–3 ఉపగ్రహానికి రక్షణ కవచం తొడిగారు బెజవాడకు చెందిన ఇంజినీరు బొమ్మారెడ్డి నాగభూషణరెడ్డి (బీఎన్ రెడ్డి). ఉపగ్రహంలో గుండెకాయ వంటి అత్యంత కీలకమైన బ్యాటరీలను కాపాడే రక్షణ కవచాన్ని, మరికొన్ని విడిభాగాలను బీఎన్ రెడ్డి స్థాపించిన ‘నాగసాయి ప్రెసిషియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీనే అందించింది. ఉపగ్రహాల్లో బ్యాటరీలకు రక్షణ కవచాల తయారీలో ఈ సంస్ధ దేశంలోనే పేరెన్నికగన్నది. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఈ కంపెనీ ఇప్పటివరకు 50 శాటిలైట్లకు విడి భాగాలను అందించింది. తాజాగా చంద్రయాన్–3లో రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్స్లో బ్యాటరీలను అమర్చే అల్యూమినియం స్టాండ్స్, నాసిల్స్, స్లీవ్స్‌ను సమకూర్చింది. గతంలో చంద్రయాన్–1, చంద్రయాన్–2తో పాటు ఇస్రో నిర్వహించిన అనేక ప్రయోగాల్లో ఈ సంస్థ భాగస్వామి అయ్యింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)తో కలిసి పని చేయడంతో పాటు ఏరో స్పేస్, యుద్ధ విమానాల విడిభాగాలను కూడా వివిధ విమాన తయారీ సంస్థలకు సమకూరుస్తోంది. ఏరో స్పేస్ రంగంలో ఉజ్వల భవిష్యత్తును ఊహించి.. బీఎన్ రెడ్డి తండ్రి వెంకటరామిరెడ్డి విజయవాడ, గన్నవరంలో రైల్వే ఇంజినీరుగా పని చేసేవారు. ఈ క్రమంలోనే బీఎన్ రెడ్డి విద్యాభ్యాసం కేబీఎన్, సిద్థార్థ ఇంజినీరింగ్ కాలేజీల్లో సాగింది. 1982లో హైదరాబాద్ వెళ్లిన ఆయన ఓ చిన్న పరిశ్రమలో ఉద్యోగిగా చేరారు. అనంతరం జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్, డిజైనింగ్స్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. తర్వాత అల్విన్ లిమిటెడ్‌లో ఉద్యోగంలో చేరారు. ఏరో స్పేస్ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గ్రహించి 1994లో సొంతంగా ‘నాగసాయి ప్రెసిషియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. తొలినాళ్లలో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ పరికరాలను తయారు చేసేవారు. 1998 నుంచి ఇస్రో ప్రయోగాలకు అవసరమైన వివిధ ఉపకరణాలను అందించడంపై దృష్టి పెట్టారు. బీఎన్ రెడ్డి పనితీరు, నైపుణ్యాన్ని ఇస్రో ఉన్నతాధికారులు 6 నెలల పాటు పరీక్షించారు. పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత అవకాశం కల్పించారు. అల్యూమినియం ప్లాంటు ఏర్పాటుకు విశేష కృషి ఒకప్పుడు శాటిలైట్‌లో విడి భాగాల తయారీకి ఉపయోగించే ప్రత్యేక అల్యూమినియాన్ని ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఇది అధిక సమయం, ఖర్చుతో కూడుకున్నది. ఆ తర్వాత హైదరాబాద్‌లోనే నాణ్యమైన అల్యూమినియం ప్లాంటు ఏర్పాటు జరిగింది. ఈ ప్లాంటు ఏర్పాటుకు బీఎన్ రెడ్డి విశేష కృషి చేశారు. దీని ద్వారా ఖర్చు, సమయం ఆదా అవుతున్నాయి. ఇస్రో, నాసాతో భాగస్వామ్యమే లక్ష్యం ‘‘ఇస్రో, నాసాల శాటిలైట్ ప్రయోగాల్లో నా కంపెనీ భాగస్వామ్యం ఉండాలన్నదే నా లక్ష్యం. స్వదేశీ పరిజ్ఞానంతో పరికరాల తయారీ ద్వారా ప్రయోగాల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు చంద్రయాన్–3ని కూడా తక్కువ ఖర్చుతోనే చేపట్టారు. ప్రయోగంలో శాటిలైట్ విజయవంతంగా కక్ష్యలోకి వెళ్లడం సంతోషంగా ఉంది’’ అని బీఎన్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
ఫ్లయింగ్ సాసర్లా కనిపించే.. ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్.. ప్రయోజనాలు ఇవే
అంతరిక్ష ప్రయోగాలు అంటేనే ఎంతో క్లిష్టమైనవి. అందులోనూ మనుషులు స్పేస్‌లోకి వెళ్లే ప్రయోగాలు మరింత రిస్క్. పెద్ద ఎత్తున రక్షణ ఏర్పాట్లు ఉండాలి. ఏ చిన్న లోపమున్నా భారీ ప్రమాదం తప్పదు. పైగా మార్స్‌పైకి మనుషులను పంపేందుకు నాసా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో స్పేస్ షిప్‌లు.. మార్స్‌పై దిగేప్పుడు పుట్టే వేడిని తట్టుకోవడానికి, మెల్లగా ల్యాండ్ కావడానికి వీలయ్యే రక్షణ ఏర్పాట్లు కావాలి. ఈ క్రమంలోనే నాసా ఫ్లయింగ్ సాసర్లా కనిపించే ఓ ప్రత్యేక ‘ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్’ను రూపొందించింది. బుధవారం దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. ఈ హీట్ షీల్డ్ ఏంటి, దాని ప్రాధాన్యత, భవిష్యత్తులో ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వాతావరణం ఘర్షణ నుంచి.. అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్లు, వ్యోమనౌకలు గంటకు 25 వేల కి.మీ.కిపైగా వేగంతో ప్రయాణిస్తుంటాయి. తిరిగి భూవాతావరణంలోకి వచ్చేప్పుడూ అంతే వేగంతో ప్రవేశిస్తాయి. ఈ సమయంలో వాతావరణ ఘర్షణ వల్ల వాటి ఉపరితలంపై వేల డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత పుడుతుంది. దీనిని తట్టుకునేందుకు రాకెట్లు, స్పేస్ షిప్‌ల ఉపరితలంపై హీట్ షీల్డ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక సిరామిక్ టైల్స్ వాడతారు. మార్స్‌పైకి వెళ్లాలంటే.. భూమితోపాటు అంగారకుడు (మార్స్), శుక్రుడు (వీనస్) వంటి గ్రహాలపైనా వాతావరణం ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరిన వ్యోమనౌకలు మార్స్‌పై దిగాలంటే దాని వాతావరణం ఘర్షణను ఎదుర్కోవాలి. అదే సమయంలో సున్నితంగా ల్యాండింగ్ కావడం కోసం వేగాన్ని త్వరగా తగ్గించుకోవాలి. ఇప్పటివరకు చంద్రుడు, మార్స్‌పైకి రోవర్లను పంపినప్పుడు ల్యాండింగ్ కోసం ప్యారాచూట్లను వాడారు. చిన్నవైన రోవర్లకు అవి సరిపోయాయి. కానీ మానవసహిత ప్రయోగాలకు వాడే వ్యోమనౌకలు భారీగా ఉంటాయి. ఈ క్రమంలో వేడిని ఎదుర్కోవడం, వేగాన్ని తగ్గించుకోవడానికి పరిష్కారంగా నాసా శాస్త్రవేత్తలు ‘లో ఎర్త్ ఆర్బిట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ యాన్ ఇన్‌ఫ్లాటబుల్ డీసెలరేటర్ (లోఫ్టిడ్)’ ప్రయోగాన్ని చేపట్టారు. ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్ అంటే.. మొదట చిన్నగా ఉండి, కావాలనుకున్నప్పుడు గాలితో ఉబ్బి, పెద్దగా విస్తరించే ఉష్ణ రక్షక కవచం అని చెప్పుకోవచ్చు. ఎలా పనిచేస్తుంది? వ్యోమనౌకకు ముందు భాగాన ఈ ప్రత్యేక పరికరాన్ని అమర్చుతారు. మార్స్పైగానీ, భూవాతావరణంలోకిగానీ వ్యోమనౌక ప్రవేశించినప్పుడు ఇది విచ్చుకుంటుంది. వ్యోమనౌక ముందు గొడుగులా ఏర్పడుతుంది. దీనివల్ల వాతావరణం నేరుగా వ్యోమనౌకను తాకకుండా ఈ హీట్‌షీల్డ్ అడ్డుకుంటుంది. ఇది సుమారు 20 అడుగుల వెడల్పుతో ఉండటంతో వాతావరణం ఒత్తిడికి వ్యోమనౌక వేగం కూడా తగ్గుతుంది. వేగం బాగా తగ్గాక చివరన ప్యారాచూట్‌ను వినియోగిస్తారు. దీనితో సున్నితంగా ల్యాండింగ్ అవుతుంది. ప్రయోగాత్మకంగా.. సోమవారం అమెరికాలోని వాండెన్‌బర్గ్ స్పేస్‌ఫోర్స్ స్టేషన్ నుంచి అట్లాస్–వి రాకెట్ ద్వారా మరో ఉపగ్రహంతోపాటు ‘లోఫ్టిడ్’ను ప్రయోగించనున్నారు. రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లాక దీనిని భూమివైపు వదిలేస్తుంది. సుమారు గంటకు 35వేల కిలోమీటర్ల వేగంతో అది భూమివైపు ప్రయాణం మొదలుపెడుతుంది. తర్వాత ఎంత వేగంతో ప్రయాణిస్తోంది? ఒత్తిడి ఎంత పడుతోంది? ఎంతమేర ఉష్ణోగ్రత పుడుతోందన్న వివరాలను పరిశీలించేందుకు ఇందులో ప్రత్యేకమైన సెన్సర్లను ఏర్పాటు చేశారు. ఈ డేటా ఆధారంగా ‘లోఫ్టిడ్’కు తుదిరూపు ఇవ్వనున్నారు. ప్రస్తుతం కేవలం హీట్‌షీల్డ్‌ను మాత్రమే ప్రయోగిస్తున్నారు. విజయవంతమైతే వ్యోమనౌకలకు అమర్చి పంపుతారు. భవిష్యత్తులో ఇతర గ్రహాలపైకి చేసే అన్ని రకాల ప్రయోగాల్లో ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొలంబియా ప్రమాదమే ఉదాహరణ 2003లో నాసాకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్ అంతర్జాతీయ అంతరిక్షం (ఐఎస్ఎస్) నుంచి తిరిగి వస్తూ పేలిపోయింది. అందులో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా సహా ఏడుగురు వ్యోమగాములు మృతిచెందారు. ఈ ప్రమాదానికి కారణం స్పేస్ షటిల్ ఎడమవైపు రెక్కపై ఉన్న హీట్ షీల్డ్ కొంతమేర దెబ్బతినడమే. అంతకుముందు స్పేస్ షటిల్ అంతరిక్షంలోకి వెళ్తున్న సమయంలోనే.. దానికి అనుబంధంగా ఉన్న రాకెట్ ట్యాంక్ ఇన్సులేటింగ్ ఫోమ్ చిన్న ముక్క విడిపోయి స్పేస్ షటిల్ రెక్కపై ఉన్న హీట్ షీల్డ్‌కు తగిలింది. హీట్ షీల్డ్‌గా అమర్చిన టైల్స్‌లో పగులు వచ్చింది. చిన్న పగులుతో.. పెద్ద ప్రమాదం కొలంబియా షటిల్ భూమికి తిరిగివచ్చేప్పుడు ధ్వని వేగానికి 20 రెట్లకుపైగా వేగంతో.. అంటే సుమారు గంటకు 25 వేల కిలోమీటర్లకుపైగా వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో 1,500 సెంటీగ్రేడ్లకుపైగా వేడి పుట్టింది. కానీ షీట్ షీల్డ్ టైల్స్‌లో పగులు కారణంగా ఆ వేడి లోపలి భాగానికి చేరి.. రెక్కలోని భాగాలు దెబ్బతినడం మొదలైంది. కాసేపటికే స్పేస్ షటిల్ పేలి ముక్కలైపోయింది. హీట్ షీల్డ్‌లో చిన్న పగులు ఉన్నా ఇంత ఘోరమైన ప్రమాదం జరిగే పరిస్థితులు ఉంటాయి. ఈ క్రమంలోనే నాసా శాస్త్రవేత్తలు.. ఇతర గ్రహాలపై దిగేప్పుడు స్పేస్ షిప్‌లకు హీట్ షీల్డ్‌గా ఉండేందుకు, అదే సమయంలో వేగాన్ని తగ్గించి సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు తోడ్పడే ‘ఇన్‌ఫ్లాటబుల్ హీట్‌షీల్డ్’ను అభివృద్ధి చేస్తున్నారు. -
ట్విటర్‌కు మరో షాక్, కేసు నమోదు
సాక్షి, న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్‌కు కేంద్రం మరోసారి భారీ షాక్ ఇచ్చింది. ఫేక్ న్యూస్, వినియోగదారుల రక్షణ అంశంలో కేంద్రం, ట్విటర్ మధ్య వివాదం నేపథ్యంలో ఇండియాలో ఉన్న చట్టపరమైన రక్షణను తాజాగా కేంద్రం ఎత్తివేసింది. కొత్త ఐటీ నిబంధనల అమలుపై పదే పదే హెచ్చరిస్తున్నా ట్విటర్ పట్టించుకోని కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొందరు కీలక అధికారులను ట్విటర్ నియమాకాలపై ఇటీవల కేంద్రం తుది హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయంలో విఫలమైన కారణంగా తాజా నిర్ణయం తీసుకున్నట్టు ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో సోషల్ మీడియా మధ్యవర్తిగా ఉండాల్సిన రక్షణను ట్విటర్ కోల్పోయిందని, దీంతో ఇకపై భారత చట్టాల పరంగా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశాయి ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ట్విటర్‌పై తొలి కేసు కూడా నమోదవడం గమనార్హం. మతపరమైన హింసను ప్రోత్సహింఆరంటూ పలువురు జర్నలిస్టులపైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కొత్త ఐటీ నిబంధనలపై చీఫ్ కంప్లైయెన్స్ఆఫీసర్‌తో సహా భారతదేశానికి చెందిన అధికారుల నియామకాల్లో నిబంధనలను పాటించని ఏకైక టెక్ ప్లాట్‌ఫాం ట్విటర్ అని కూడా పేర్కొంది. జూన్ 5న వృద్ధ ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన కేసులో ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గత రాత్రి థర్డ్ పార్టీకి సంబంధించిన మొదటి కేసు నమోదైంది. బాధితుడు తప్పుడు సమాచారమని వివరించినా ట్విటర్ చర్య తీసుకోలేదని ఆరోపించారు. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ట్విటర్ తొలగించలేదని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దేశంలో ముఖ్య అధికారులను నియమించాల్సిన నిబంధనలను పాటించడంలో విఫలమైనందున ట్విట్టర్ వినియోగదారుల పోస్టులపై విచారణ నుండి భారతదేశంలో చట్టపరమైన రక్షణ కోల్పోయిందని, దీంతో యూపీలో కేసు నమోదైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.మే 25 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనలన్నింటినీ ట్విటర్ ఇంకా పాటించలేదని అందుకే మధ్యవర్తిగా వారి రక్షణ లేకుండా పోయిందని వివరించింది. ఏ ప్రచురణకర్త మాదిరిగానే భారతీయ చట్టానికి వ్యతిరేకంగా జరిమానా చర్యలకు ట్విటర్ బాధ్యత వహిస్తుందని ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే నియామకాలపై స్పందించిన ట్విటర్ తాత్కాలిక చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్‌ను నియమించామనీ, ఈ వివరాలను ఐటీ మంత్రిత్వ శాఖతో పంచుకుంటామని ట్విటర్ తెలిపింది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా తాము అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని వివరణ ఇచ్చింది. చదవండి: ట్విటర్‌కు మరోసారి నోటీసులు -
సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామానికి ‘షీల్డు’
మంత్రి అయ్యన్నచేతుల మీదుగా అవార్డు అందుకున్న కాట్రపాడు సర్పంచ్ నాగమ్మ కాట్రపాడు (దాచేపల్లి): రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా కాట్రపాడు సర్పంచ్ రెడ్డిచర్ల నాగమ్మ షీల్డ్‌ను అందుకున్నారు. గ్రామంలో ప్రతీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో కాట్రపాడును సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో సర్పంచ్ నాగమ్మ పాల్గొన్ని మంత్రి చేతుల మీదుగా షీల్డ్‌ను అందుకున్నారు. పంచాయతీ ఖాతాలో రూ.2లక్షల నగదును ప్రభుత్వం జమ చేస్తుందని ఆమె చెప్పారు. సర్పంచ్ వెంట పంచాయతీ కార్యదర్శి పి. విజయ్‌కుమార్, ఏపీవో జీ. వెంకటేశ్వర్లు తదితరులున్నారు.