Shifting house
-
వైరల్: గుడిసెకు కాళ్లు వచ్చాయా?
న్యూఢిల్లీ: ఏదైనా ఓ భారీ వస్తువును ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకువెళ్లాలంటే కొంతమంది సమిష్టిగా పని చేయాల్సిందే. ఎంత పెద్ద పనైనా బృందంగా ఏర్పడి చేస్తే ఎటువంటి అలసట లేకుండానే పూర్తవుతుంది. ఇటువంటి ఓ పనిని నాగాలాండ్‌లోని ఓ గ్రామ ప్రజలు చేయగా అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది స్థానికులు నాగాలాండ్‌లోని ఒక గ్రామంలో ఏకంగా ఓ గుడిసె ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కాలినడకన చేతులపై మోస్తూ మార్చారు. ఆ గుడిసెను నాలుగు వైపుల పట్టుకొని అది ఉన్న ప్రదేశం నుంచి కొత్త ప్రదేశానికి మార్చారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామెన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఐక్యతమే మహా బలం అని నాగాలు మనకు చూపించే వీడియో ఇది. నాగాలాండ్‌లోని ఓ గ్రామంలో హౌస్ షిఫ్టింగ్ చాలా పురోగతిలో ఉంది’ అని కామెంట్ జత చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సుమారు 9 వేల మంది నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోను చేసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. ‘చక్రాలు లేకుండానే షిఫ్టింగ్.. అద్భుతం’, ‘వావ్.. ఇది టీం వర్క్ అంటే’, ‘గుడిసెకు కాళ్లు వచ్చాయా?’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
అత్యంత చౌక నగరం అదే...
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగం, చదువు, పెళ్లి.. అవసరం ఏదైనా కానివ్వడం ఒక చోట నుంచి మరొక చోటుకు ఇల్లు మార్చడం పెద్ద తలనొప్పి. ఇల్లు వెతకడం నుంచి మొదలుపెడితే అడ్వాన్స్, ట్రాన్స్పోర్ట్, ఇంటర్నెట్, ఫోన్, గ్యాస్ వంటి యుటిలిటీ చేంజెస్ వరకూ ప్రతి ఒక్కటీ టాస్కే. పైగా ఖర్చు కూడా! ఇంటి షిఫ్టింగ్‌లో ప్రపంచ దేశాల్లోని ప్రధాన నగరాలతో పోలిస్తే మన దేశ రాజధాని అత్యంత చౌక నగరమట!! బెర్లిన్ ప్రధాన కేంద్రంగా సేవలందిస్తున్న కొరియర్ అండ్ లాజిస్టిక్ కంపెనీ మూవింగ్ ప్రపంచ దేశాల్లోని 85 నగరాల్లో 2019 మూవింగ్ ఇండెక్స్ స్టడీని నిర్వహించింది. ఇంటి షిప్టింగ్‌లో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇల్లు మారిన తర్వాత కుదురుకునే వరకూ తొలి మూడు నాలుగు నెలల పాటు ఆర్ధికంగా కొంత ఇబ్బందులుంటాయని స్డడీ వెల్లడించింది. షిఫ్టింగ్ ఢిల్లీలో 1,735 డాలర్ల ఖర్చు.. ఇంటి షిప్టింగ్‌లో అమెరికా అత్యంత ఖరీదైన నగరం. శాన్ఫ్రాన్సిస్కోలో ఇండివిడ్యువల్స్ ఇంటి షిఫ్టింగ్ చేయాలంటే 13,531 డాలర్లు ఖర్చు అవుతుంది. న్యూయార్క్‌లో 12,041 డాలర్లు, స్విట్జర్లాండ్‌లోని జెనివాలో 11,694 డాలర్లు ఖర్చు అవుతుంది. ఇక మన నగరం ఢిల్లీలో 1,735 డాలర్లు ఖర్చు అవుతుందని సర్వే తెలిపింది. ఢిల్లీలో ఇండివిడ్యువల్స్ ఇంటి షిఫ్టింగ్ ఖర్చులు విభాగాల వారీగా చూస్తే.. శాశ్వత ఇంటి అద్దె 182 డాలర్లు, తాత్కాలిక ఇంటి అద్దె అయితే 392 డాలర్లు, అద్దె డిపాజిట్ 182 డాలర్లు, ఫుడ్ అండ్ డ్రింక్స్ 232 డాలర్లు, ట్రాన్స్పోర్ట్ 11 డాలర్లు, స్టోరేజీ 51 డాలర్లు, ఇంటర్నెట్ షిఫ్టింగ్ కోసం 4 డాలర్లు, ఫోన్ బిల్స్ 2 డాలర్లు ఖర్చు అవుతుంది. ఫ్యామిలీ షిఫ్టింగ్ అయితే 4,232 డాలర్లు ఫ్యామిలీ మొత్తం ఇల్లు షిఫ్టింగ్ చేయాలంటే అత్యంత ఖరీదైన నగరం శాన్ఫ్రాన్సిస్కో. ఇక్కడ 24,004 డాలర్లు ఖర్చు అవుతుంది. బూస్టన్లో 20,738 డాలర్లు, జెనీవాలో 20,165 డాలర్లు అవుతుంది. ఇక ఢిల్లీలో కుటుంబంతో సహా షిఫ్ట్ చేయాలంటే 4,232 డాలర్లు అవుతుంది. విభాగాల వారీగా చూస్తే.. శాశ్వత ఇంటి అద్దె 335 డాలర్లు, తాత్కాలిక ఇంటి అద్దె అయితే 1,422 డాలర్లు, అద్దె డిపాజిట్ 335 డాలర్లు, ఫుడ్ అండ్ డ్రింక్స్ 533 డాలర్లు, ట్రాన్స్పోర్ట్ 29 డాలర్లు, స్టోరేజీ 51 డాలర్లు, ఇంటర్నెట్ షిఫ్టింగ్ కోసం 4 డాలర్లు, ఫోన్ బిల్స్ 5 డాలర్లు ఖర్చు అవుతుంది. -
ఇల్లు మారుతున్నారా?
వాయనం: అసౌకర్యాలు కలిగినప్పుడు ఇల్లు మారడం సహజమే. అయితే అది అంత సులభమైన విషయం మాత్రం కాదు. అందుకే చాలామంది ఎంత ఇబ్బందిగా ఉన్నా సర్దుకుపోతుంటారు తప్ప, ఇల్లు మారడానికి మాత్రం ఇష్టపడరు. అయితే కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇల్లు షిఫ్టింగ్ అంత కష్టమనిపించదు. మీకు కనుక ఇల్లు మారే ఆలోచన ఉంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి చాలు... * ఇల్లు మారాలనుకున్నప్పుడు ముందుగా చేయాల్సింది... ఇప్పుడు ఉంటున్న ఇంటికి, కొత్తగా తీసుకున్న ఇంటికి మధ్య పోలికలు, వైరుధ్యాలు అంచనా వేసుకోవడం. అలా చేస్తే సామాన్లు సర్దుకోవడంలో ఇబ్బంది ఉండదు! * ఇప్పుడున్న ఇంట్లో ఉన్న ఒక వస్తువును, కొత్త ఇంట్లో ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ముందుగానే అంచనా వేసుకోండి. ప్రతి వస్తువు స్థానాన్నీ ముందే నిర్దేశించుకోండి! * ఒకవేళ వెళ్లబోతున్న ఇల్లు ఇప్పటి ఇంటి కన్నా చిన్నది అయితే, అనవసరమైన వస్తువులు ఏవైనా ఉంటే ఇక్కడే తీసి పారేయండి, లేదంటే అమ్మేసుకోండి. అనవసరంగా మోసుకెళ్లడమెందుకు! * ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్లు వస్తే ఓకే. లేదంటే వస్తువులన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం ప్యాక్ చేసుకోండి. సామాన్లను ఎప్పుడూ గదుల వారీగా ప్యాక్ చేసుకోవాలి తప్ప, అందులో ఒకటి ఇందులో ఒకటి ప్యాక్ చేసి అన్నిటినీ కలిపి ఒకచోట పారేయవద్దు! * ప్రతి ప్యాకెట్మీదా అందులో ఏమున్నాయో తప్పక రాసుకోండి. అలాగే ఏ గదిలోని వస్తువుల ప్యాకెట్లు ఆ గదిలోనే ఉంచుకోండి. లారీలో సర్దేటప్పుడు కూడా అదే పద్ధతి ప్రకారం ఎక్కిస్తే... దింపుకునేటప్పుడు కూడా ఆయా వస్తువుల్ని అవి పెట్టాల్సిన గదుల్లోకి చేరవేసుకోవడం తేలిక అవుతుంది! మొక్కలు కనుక ఉంటే... వాటన్నిటినీ కుండీలతో తీసుకెళ్లవద్దు. పొరపాటున కుండీలు పగిలితే, మట్టి అంతా రాలిపోయి, వేళ్లు బయటపడి, మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే మట్టితో సహా మొక్కను కుండీలోంచి జాగ్రత్తగా తీసి, వేళ్లను ఓ పాలిథీన్ కవర్లో గట్టిగా బిగించి కట్టండి. సామాన్లతో పాటు ఇష్టమొచ్చినట్టు లారీలో ఎక్కించకుండా, మొక్కలన్నిటినీ ఓ పక్కగా, వాటి మీద బరువు పడకుండా ఉండేలా సర్దండి. కొత్త ఇంటికి వెళ్లీ వెళ్లగానే ముందుగా మొక్కల్ని తీసి కుండీల్లో పెట్టి, నీళ్లు పోయడం మర్చిపోకండి! ఇంత ప్లాన్డ్గా ఉంటే ఇల్లు షిఫ్టింగ్ అనేది సమస్య ఎందుకవుతుంది! చక్కగా కొత్త ఇంటికెళ్లగానే ఏ గదిలో ప్యాకెట్లు ఆ గదిలో పెట్టేసుకుని, వాటి మీద రాసుకున్న వివరాలను బట్టి ఒక్కోటీ సర్దేసుకున్నారనుకోండి... రెండు మూడు రోజుల్లో అన్నీ సెట్ అయిపోతాయి. ఇక మీరు హ్యాపీగా ఉండవచ్చు!