ship sank
-
తుఫాన్: సముద్రంలో మునిగిన నౌక!
టోక్యో: దాదాపు 42 మంది సిబ్బందితో పాటు దాదాపు 6వేల ఆవులను తీసుకొని న్యూజీలాండ్ నుంచి చైనాకు వెళ్తున్న నౌక మునిగిపోయింది. దక్షిణ జపాన్ ద్వీపానికి సమీపంలో గల్లంతైన ఈ నౌక కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. నౌకా సిబ్బందిలో ఒకరిని రక్షించినట్లు తెలుస్తోంది. జపాన్ పరిసరాల్లో ప్రస్తుతం టైఫూన్ మేసక్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ దెబ్బకు మునిగిన నౌకా సిబ్బంది బుధవారం ప్రమాద సంకేతాలను సమీప నౌకాశ్రయానికి పంపారు. ఆ సమయంలో దక్షిణ చైనా సముద్రంలో నౌక పయనిస్తోంది. ప్రమాదసమయంలో నౌక తలకిందులైందని తర్వాత మునిగిపోయిందని ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి వివరించారు. సిబ్బందిలో 38మంది ఫిలిప్పీన్స్కు ఇద్దరు న్యూజిలాండ్, ఇద్దరు ఆస్ట్రేలియాకు చెందిన సిబ్బంది ఉన్నారు. యూఏఈకి చెందిన గల్ఫ్ నావిగేషన్ హోల్డింగ్స్ సంస్థ ఈ నౌకకు సొంతదారు. ఆగస్టులో నౌక న్యూజిలాండ్ నుంచి బయలుదేరింది. చదవండి: రికార్డు సృష్టించిన మెకంజీ స్కాట్ -
చైనాలో నౌక ప్రమాదం
-
నౌక మునక.. 450 మంది గల్లంతు
ఆసియా ఖండంలోనే అతి పొడవైన నదిగా పేరొందిన చైనాలోని యాంగ్జీ నదిలో ఘోర నౌకా ప్రమాదం జరిగింది. ఈస్టన్ స్టార్ అనే నౌక పెను తుఫానులో చిక్కుకొని మునిగిపోవడంతో అందులో ప్రయాణిస్తోన్న 450 మంది గల్లంతయ్యారు. సోమవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దక్షిణ చైనాలోని నింజింగ్ నుంచి చోంక్వింగ్ కు బయలుదేరిన నౌకకు ప్రయాణం మధ్యలో ప్రతికూల వాతావరణం ఎదురైంది. తీవ్ర తుఫాను, పెనుగాలులు తాకిడికిగురై నీటిలో మునిగిపోయిందని, ప్రమాద స్థలికి చేరుకున్న సహాయ బృందాలు కెప్టెన్, చీఫ్ ఇంజనీర్ సహా కేవలం ఎనిమిది మందిని మాత్రమే కాపాడగలిగామని చైనా నౌకా దళం అధికారులు చెప్పారు. తప్పిపోయినవారి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశామన్నారు. గల్లంతైనవారిలో 405 ప్రయాణికులు, 47 మంది నౌకా సిబ్బంది, ఐదుగురు ట్రావెల్ ఏజెన్సీకి చెందినవారు ఉన్నట్లు చైనా అధికారిక మీడియా జిన్హువా పేర్కొంది.ప్రస్తుతానికి కూడా తుఫాను తీవ్రత తగ్గక పోవడంతో సహాయ కార్యక్రమాలు మందకోడిగా సాగుతున్నాయి. చైనా ప్రీమియర్ లీ కెక్వింగ్.. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.