shiva lal yadav
-
శివలాల్‌కు పితృవియోగం
మారేడ్‌పల్లి,న్యూస్‌లైన్: బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి ఎస్జీ నందలాల్ (89) మంగళవారం తెల్లవారుజామున ఇక్కడి స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు భార్య రామ్బాయి, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శివలాల్ పెద్ద కుమారుడు కాగా, రాజేశ్ యాదవ్, వీరేందర్ యాదవ్‌లు ఆ తర్వాతి వారు. ముగ్గురు కుమార్తెలలో ఇంద్రాణి పటేల్ ముంబైలో స్థిర నివాసం ఏర్పరచుకోగా, సుజాత యాదవ్, విద్యాయాదవ్ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. రెజ్లింగ్ క్రీడలో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న నందలాల్, దాదాపు 50 ఏళ్ల పాటు మిలిటరీ డైరీ ఫామ్‌కు పాల కాంట్రాక్టర్‌గా వ్యవహరించారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం మెట్టుగూడలోని యాదవ సమాజ శ్మశాన వాటికలో జరిగాయి. శివలాల్ తండ్రి మృతి పట్ల బీసీసీఐ ప్రముఖులు, హెచ్‌సీఏ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. -
అధ్యక్ష స్థానంలో శివలాల్ యాదవ్
రేపు బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం ముంబై: బీసీసీఐ అత్యవసర వర్కింగ్ కమిటీ సమావేశానికి శివలాల్ యాదవ్ అధ్యక్షత వహించనున్నారు. ఐపీఎల్ వ్యవహారాలను సునీల్ గవాస్కర్ పర్యవేక్షిస్తుండగా... బోర్డు పాలనావ్యవహారాలను ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న శివలాల్ యాదవ్‌కు ఇటీవల సుప్రీం కోర్టు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ వెబ్సైట్లో మాత్రం వర్కింగ్ కమిటీ చైర్మన్‌గా సునీల్ గవాస్కర్ పేరును పేర్కొన్నారు. ‘ఆదివారం జరిగే సమావేశానికి నేను అధ్యక్షత వహిస్తాను. అయితే ఈ మీటింగ్‌కు గవాస్కర్ హాజరవుతారా? లేదా? అనే విషయం తెలీదు. ప్రస్తుతం ఆయన అబుదాబిలో ఉన్నారు. ఈనెల 16న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై జరిగిన విచారణలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలపై భవిష్యత్‌లో ఎలా వ్యవహరించాలనే అంశం సమావేశంలో ఎజెండాగా ఉండనుంది’ అని శివలాల్ తెలిపారు. ‘విచారణ కమిటీకి మనోహర్ నేతృత్వం వహించాలి’ న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై బీసీసీఐ ఏర్పాటు చేసే విచారణ కమిటీకి మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ నేతృత్వం వహించాలని బీహార్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆదిత్య వర్మ డిమాండ్ చేశారు. ఆయన మాత్రమే బీసీసీఐ, ఐపీఎల్‌లను మచ్చ లేకుండా ఉంచగలరని తెలిపారు.