Shiva lord
-
‘శివ... శివా...’ అంటూ శివనామాన్ని స్మరిస్తున్న టాలీవుడ్ స్టార్స్
భక్తి కలిసిన చిత్రాల్లో స్టార్స్ కనిపించడం చాలా తక్కువ. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. డివోషన్ ప్లస్ కమర్షియల్ మిక్స్ అయిన కథలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ తరహా చిత్రాల్లో నటించడానికి స్టార్ హీరోలు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో ‘శివుడు’ నేపథ్యంలో సాగే కథలు, శివుడి ప్రస్తావన కాసేపు ఉండే కథలు ఉన్నాయి. ‘శివ... శివా...’ అంటూ శివుడి నేపథ్యంలో భక్తి భావంతో రానున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. కన్నప్ప విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియన్ చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్పై మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివ భక్తుడైన భక్త కన్నప్ప కథను ‘కన్నప్ప’ ద్వారా వెండితెరకు తీసుకొస్తు్తన్నారు. ఈ చిత్రంలో శివుడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారని సమాచారం. ఈ వార్తలు ఆ మధ్య హల్ చల్ చేయగా ‘హర హర మహాదేవా’ అంటూ రిప్లై ఇస్తూ పరోక్షంగా హింట్ ఇచ్చారు విష్ణు మంచు. ఈ విషయం గురించి మేలో అధికారిక ప్రకటన రావొచ్చని కూడా తాజాగా విష్ణు మంచు స్పందించారు. దీంతో ‘కన్నప్ప’లో శివుడి పాత్రలో ప్రభాస్ నటించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటివరకు మాస్ యాక్షన్ హీరోగా, లవర్ బాయ్‌గా నటించిన ప్రభాస్ ఇటీవలే ‘ఆదిపురుష్’ సినిమాలో రాముడిగా కనిపించారు. ఇప్పుడు ‘కన్నప్ప’ చిత్రంలో శివుడిగా కనిపించనున్నారు. ఇక శివుడి పాత్రలో ప్రభాస్ ఎలా ఉంటారో అంటూ ఏఐ టెక్నాలజీ సాయంతో శివుడి రూపంలో ఉన ్న ప్రభాస్ పోస్టర్లను డిజైన్ చేసి, నెట్టింట షేర్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ శివుడి రూపంలో ప్రభాస్ లుక్ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పార్వతీదేవి పాత్రలో నయనతార కనిపిస్తారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ‘కన్నప్ప’ విడుదల కానుంది. కుబేర ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. అయితే ఫస్ట్ లుక్ మాత్రం టైటిల్‌కు భిన్నంగా ఉండటంతో పాటు ఆశ్చర్యపరిచేలా ఉంది. కుబేరుడు డబ్బులు ప్రసాదించే దేవుడు. కాగా ఫస్ట్ లుక్‌లో ధనుష్ సరైన కాస్ట్యూమ్ లేని పేదవాడిలా కనిపిస్తారు, ఆహార దేవత అన్నపూర్ణాదేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్న ఫొటో కూడా పోస్టర్లో ఉంది. అంటే ఈ కథలో శివుడి గురించి ఏదో ఒక లైన్ టచ్ చేసి ఉంటారని ఊహించవచ్చు. పైగా మహా శివరాత్రి కానుకగా ప్రత్యేకించి ఆ పోస్టర్ విడుదల చేయడం కూడా శివుడి నేపథ్యం ఉంటుందనుకోవచ్చు. హరోం హర ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు హీరో సుధీర్ బాబు. తాజాగా ఆయన నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘హరోం హర’. ‘ది రివోల్ట్’ అనేది ట్యాగ్‌లైన్. ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా శర్మ హీరోయిన్ గా నటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ సినిమా కథనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేపథ్యంలో సాగుతుంది. పైగా ఈ మూవీలో హీరో పేరు కూడా సుబ్రహ్మణ్యమే కావడం విశేషం. ఈ చిత్రానికి ‘హరోం హర’ టైటిల్ ఫిక్స్ చేశారంటే శివుడి నేపథ్యం ఎంతో కొంత ఉంటుందని ఊహించవచ్చు. ఎందుకంటే.. పరమశివుడి తనయుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పుత్రుడి కథ చెప్పే క్రమంలో తండ్రి కథని టచ్ చేసుంటారనుకోవచ్చు. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే ‘హరోం హర’లో సుధీర్ బాబు చిత్తూరు యాసలోనే మాట్లాడతారు. ఈ వేసవిలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓదెల 2 తమన్నా పేరు చెప్పగానే గ్లామరస్ హీరోయిన్ గుర్తొస్తారు. తన నటన.. ప్రత్యేకించి తన అద్భుతమైన డ్యాన్సుతో ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు తమన్నా. ప్రస్తుతం ఆమె శివుడి నేపథ్యంలో రూపొందుతున్న ‘ఓదెల 2’ మూవీలో లీడ్ రోల్ చేస్తున్నారు. ‘ఓదెల రైల్వేస్టేషన్’ వంటి హిట్ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. అశోక్ తేజ దర్శకత్వంలో డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్లపై డి. మధు ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కాశీలో మొదలైంది. ఈ చిత్రంలో శివశక్తిగా తమన్నా నటిస్తున్నారు. శివరాత్రి కానుకగా ‘ఓదెల 2’ నుంచి శివశక్తిగా తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఒక చేతిలో దండకం, మరో చేతిలో డమరుకంతో నాగసాధువు వేషంలో కనిపించారు తమన్నా. తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఓదెల మల్లన్న స్వామి ఎలా కాపాడాడు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. మల్లన్న స్వామి అంటే శివుడే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, పూజా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. -
తారకాసురుడి మూర్ఖత్వం
పూర్వం తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గురించి తీవ్రమైన తపస్సు చేసి, చావులేకుండా ఉండే వరం కోరుకున్నాడు. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదు, సురులకు తప్ప అసురులకు ఆ వరం ఇవ్వకూడదు కాబట్టి, మరేదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ. సరేనన్నాడు తారకుడు. శివుడికి పుట్టిన సంతానం, అందులోనూ ఏడేళ్ల బాలుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణించనటువంటి వరం కోరుకున్నాడు తారకుడు. ఎందుకంటే, శివుడి భార్య సతీదేవి పిలవని పేరంటానికి వెళ్లి తన పుట్టినింట భర్తకు జరిగిన అవమానానికి తట్టుకోలేక యోగాగ్నిలో దహించుకుపోవడంతో శివుడు సతీవియోగ దుఃఖంతో విరక్తుడై ఉన్నాడు. అటువంటి సమయంలో శివుడికి పుత్రులు పుట్టడం అసంభవం కాబట్టి, తన మరణం కూడా అసంభవమే అన్న ధీమాతో ఆ విధమైన వరం కోరుకున్నాడన్నమాట. సరేనన్నాడు బ్రహ్మ. అసుర జన్మ కావడాన పుట్టుకతోనే సంక్రమించిన బలానికి ఈ వరబల ం తోడు కావడంతో తననెవరూ జయించలేరన్న ధీమాతో తారకాసురుడి ఆగడాలు తట్టుకోలేనివిధంగా తయారయ్యాయి. వాడికి మిత్రుడైన శూరపద్ముడు కూడా జతయ్యాడు. ఇద్దరూ కలిసి దేవతలనూ, మానవులనూ, మునులనూ, సాధుప్రాణులందరినీ నానా హింసలకూ గురిచేయసాగారు. దాంతో అందరూ కలసి బ్రహ్మదేవుడికి దగ్గరకెళ్లారు తమను ఆ దుష్టుడి నుంచి కాపాడమని. ఆ రాక్షసుడి నొసట రాత రాసిన విధాతకు తెలియదా వాడినెలా సంహరించాలో! దేవతలకు ఒక ఉపాయం చెప్పాడాయన. శివుడికి పుట్టబోయే కుమారుడు తప్ప వీడిని మరెవరూ సంహరించలే రు కాబట్టి, మనమందరం కలసి శివుడిని వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మళ్లించాలి. అప్పుడు మన పని సులువవుతుందన్నాడు. అందుకు సమర్థులెవరని వెతగ్గా, మన్మథుడు ముందుకొచ్చాడు. మన్మథుడి భార్య రతీదేవి ముందు భర్తను వారించినప్పటికీ, లోకకల్యాణం కాబట్టి సరేనని ఒప్పుకుంది. సతీదేవి పర్వతరాజైన హిమవంతుడికి పుత్రికగా పుట్టింది. పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అయిందామె. ఆమెకు చిన్నప్పటినుంచి శివుడంటే వల్లమాలిన భక్తి. ఆ భక్తి కాస్తా ఆయన్ను పరిణయమాడాలనుకునేంతటి అనురక్తిగా మారింది. సాక్షాత్తూ పరమ శివుని పతిగా పొందాలంటే మాటలా మరి! అందుకే తపస్సు చేయడం మొదలెట్టింది. మన్మథుడి పని కాస్త సులువు చేసినట్లయింది. మహా వైరాగ్యంలో ఉన్న శివుడి తపస్సు భంగం చేయకుండా, ఆయన తపస్తు చేసే ప్రదేశమంతా రోజూ చక్కగా అలికి శుభ్రంగా ముగ్గులు పెట్టడం, ఆయన ఏమయినా తింటాడేమోనని పండ్లు తెచ్చి ముంగిట పెట్టడం.. ఇలా ఎంతకాలం గడిచినా, శివుడు కళ్లు తెరవనేలేదు కానీ, పార్వతి మాత్రం అన్నపానీయాలు మానేసి, కేవలం పండుటాకులు మాత్రమే తింటూ అపర్ణగా మారింది. ఓరోజున మన్మథుడు కాస్త ధైర్యం చేశాడు. తన చెలికాడైన వసంతుని తోడు చేసుకుని, పూలబాణాలతో శివుణ్ణి తపస్సు నుంచి మళ్లించి, ఆయన కోపాగ్ని కీలల్లో బూడిదయ్యాడు. ఆ తర్వాత జరిగిందంతా గ్రహించిన శివుడు పార్వతిని పరిణయమాడడంతో, వారికి కుమారస్వామి జన్మించాడు. (కుమారస్వామి జనన వృత్తాంతం ఇక్కడ అప్రస్తుతం కాబట్టి మరోసారి చెప్పుకుందాం). ఎప్పుడూ బాలుడిలా ఉంటాడు కాబట్టి, కుమారస్వామి అని, బ్రహ్మజ్ఞానం కలవాడు కాబట్టి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడనీ, కృత్తికా నక్షత్రాలు పాలివ్వగా ఆరుముఖాలతో పాలు తాగాడు కాబట్టి షణ్ముఖుడనీ, రెల్లుగడ్డిలో జన్మించిన కారణంగా శరవణ భవుడనీ, కృత్తికా దేవతలు పెంచారు కాబట్టి కార్తికేయుడన్న పేర్లతో ప్రసిద్ధుడయ్యాడు. అమిత బలపరాక్రమాలు, యుద్ధతంత్ర నైపుణ్యం కలిగిన బాలసుబ్రహ్మణ్యుడు దేవతల సైన్యానికి అధిపతిగా నియమితుడయ్యాడు. ఏడోఏడు రానే వచ్చింది. అప్పుడు దేవతలు కుమారస్వామికి అతని జన్మకారణాన్ని తెలియజెప్పి, యుద్ధానికి సన్నద్ధుడిని చేశారు. అందుకోసమే ఎదురు చూస్తున్న కుమారస్వామి ఆశ్వయుజ బహుళ షష్ఠినాడు దేవతలందరినీ వెంటబెట్టుకెళ్ల్లి, తారకునిపై సమర శంఖం పూరించాడు. ఏడేళ్ల బాలుడు తననేమి చేయగలడన్న ధీమాతోనే కదా, తారకుడు అతడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ చావకుండా వరం కోరుకున్నాడు. ఇప్పుడు కూడా అదే ధీమాను, నిర్లక్ష్యాన్ని వదులుకోలేదు. దాంతో ముందుగా శూరపద్ముడు, తర్వాత తారకుడు కుమారస్వామి వీరత్వం ముందు ఓడిపోయి, తర్వాత ప్రాణాలు కోల్పోక తప్పలేదు. ఆ విధంగా తారకాసురుడు మహా విరాగి అయిన శివుడికి కల్యాణం జరగదు, ఒకవేళ జరిగినా కొడుకులు పుట్టరు, పుట్టినా, ఏడేళ్లవాడవ్వాలి. ఏడేళ్లొచ్చినా, అంతటి పసివాడు తనను ఓడించలేడు అన్న అతి తెలివితో తన చావును తానే కొని తెచ్చుకున్నాడు.