Shiva Rathri
-
మహాకుంభమేళా ముగింపు.. ఆవిష్కృతం కానున్న మరో అద్భుత ఘట్టం
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా (Kumbh Mela 2025)లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆకాశంలో ఏడు గ్రహాలు బుధ, శుక్ర, మంగళ, బృహస్పతి, శని, యూరేనస్, నెప్ట్యూన్లు ఒకే సరళరేఖపై రానున్నట్లు తెలుస్తోంది.ఈ గ్రహాల సమన్వయం నెగటివ్ గ్రహ ప్రభావాలను తగ్గించి, ప్రపంచంలో శాంతి, సమర్థత, సంపద తీసుకురానుందని ఆధ్యాత్మిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ అసాధారణ ఖగోళ సంఘటన కుంభమేళా తుది పవిత్ర స్నానానికి మరింత ప్రత్యేకతను ఇవ్వనుంది.మహాశివరాత్రిపై గ్రహ ప్రభావంజ్యోతిష్యులు ఆచార్య హరికృష్ణ శుక్లా గ్రహాల కదలికల ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. సూర్యుడు, చంద్రుడు మకర రాశిలో ఉండగా, శని కుంభ రాశిలో ఉండగా, బృహస్పతి వృషభ రాశిలో ఉండటం మహాకుంభమేళా ప్రారంభమైంది. కుంభమేళా చివరి రోజు ఫిబ్రవరి 26న గ్రహాల శక్తివంతమైన సమన్వయంతో జరగనుంది. ఆరోజు చంద్రుడు, బుధుడు, సూర్యుడు శని కుంభ రాశిలో ఉండగా, శుక్రుడు, రాహు మీన రాశిలో ఉండగానే బృహస్పతి వృషభ రాశిలో ఉండనుంది. ఈ గ్రహాల మార్పుతో ఫిబ్రవరి 28న గ్రహాలు ఒకే సరళరేఖ వైపు పయనిస్తాయని అన్నారు. ఫలితంగా ప్రతికూలతలు తొలిగి శుభపరిణామాలు జరుగుతాయని శుక్లా తెలిపారు. గ్లోబల్ మార్పుఫిబ్రవరి 26, 2025న గ్రహాల సమన్వయంతో ప్రపంచంలో ప్రతికూలతలు తగ్గే అవకాశం ఉందని జ్యోతిష్యులు ఆచార్య హరికృష్ణ మాట్లాడుతూ.. 2019 నుండి ప్రపంచాన్ని అనేక ప్రతికూల పరిస్థితులు పట్టిపీడిస్తున్నాయి. కోవిడ్-19 ,ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచం దేశాల్లో అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే, గ్రహాల మార్పులతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు. శాంతి, స్థిరత్వం కొనసాగే అవకాశం ఉందని అన్నారు. -
శివనామస్మరణతో మార్మోగుతోన్న నల్లమల్ల ఫారెస్ట్
-
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల ప్రాముఖ్యత ఇదే..
శివుడు భోళాశంకరుడిగా, భక్త వశంకరుడిగానూ ప్రసిద్ధుడు. భస్మాసురుడికి సైతం వరాలిచ్చేంత భోళాతనం శివుడికే చెల్లింది. కఠిన నియమాలను పాటించనక్కర్లేదు. నిండుమనసుతో పూజిస్తే చాలు, భక్తులను ఇట్టే అనుగ్రహించే దైవం శివుడు మాత్రమే. కన్నప్పను కటాక్షించిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. త్రిమూర్తులలోనే కాదు, సమస్త దేవతల్లోనూ శివుడు మాత్రమే భక్తసులభుడు. శివుడు సనాతనుడు. వేదాలు శివుడిని రుద్రుడిగా ప్రస్తుతించాయి. నిజానికి వేదకాలానికి ముందే శివారాధన వ్యాప్తిలో ఉండేదనేందుకు ఆరాధారాలు ఉన్నాయి. పురాణేతిహాసాల్లో శివుని మహిమను వెల్లడించే గాథలు విరివిగా కనిపిస్తాయి. శివుని గాథలన్నింటినీ క్రోడీకరించిన శివపురాణం శైవులకు ఆరాధ్యగ్రంథం. మాఘ బహుళ చతుర్దశి రోజున క్షీరసాగరమథనంలో పుట్టిన గరళాన్ని తన కంఠంలో బంధించి శివుడు లోకాలను రక్షించాడు. అందుకే ఈ రోజు మహాశివరాత్రిగా ప్రసిద్ధి పొందింది. ఈ మహాశివరాత్రి శైవులకు అత్యంత పవిత్ర పర్వదినం. భారతదేశం నలుచెరగలా పురాతన శైవక్షేత్రాలు ఉన్నాయి. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు, పంచకేదార క్షేత్రాలు, పంచారామ క్షేత్రాలు ప్రసిద్ధమైనవి. వీటికి తోడు దేశంలో దాదాపు ప్రతిగ్రామంలోనూ శివాలయాలు కనిపిస్తాయి. మహాశివరాత్రి పర్వదినాన ప్రసిద్ధ శైవక్షేత్రాలే కాకుండా, ఊరూరా వెలసిన శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. నమక చమక స్తోత్రపారాయణాలతో హోరెత్తుతాయి. మహాశివరాత్రి రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో ఉపవాసం, జాగరణ చేస్తూ రోజంతా శివనామ స్మరణలో గడుపుతారు. యథాశక్తి ఆలయాల్లో అభిషేక, అర్చనాది సేవలు జరిపిస్తారు. సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్ ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్ ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్ సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే వారాణస్యాం తు విశ్వేశం, త్య్రంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ఇది జ్యోతిర్లింగ స్తోత్రం. ఇందులో ప్రస్తావించిన క్షేత్రాలు: సోమనాథ క్షేత్రం సౌరాష్ట్ర– అంటే గుజరాత్‌లోని గిర్‌సోమనాథ్ జిల్లాలో ఉంది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో మల్లికార్జున క్షేత్రం ఉంది. ఆదిశంకరాచార్యులు శివానంద లహరి స్తోత్రాన్ని ఇక్కడే రచించారు. మహాకాళేశ్వర క్షేత్రం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. మధ్యప్రదేశ్‌లోనే నర్మదాతీరంలో ఓంకారేశ్వర క్షేత్రం ఉంది. ఇక్కడ ఒకే శివలింగం రెండు భాగాలుగా ఉండి, ఓంకారేశ్వర, అమలేశ్వర అనే రెండు పేర్లతో పూజలు అందుకుంటూ ఉంటుంది. బిహార్‌లోని దేవగఢ్ జిల్లాలో బైద్యనాథ క్షేత్రం ఉంది. క్షీరసాగర మథనం తర్వాత ధన్వంతరి అమృతాన్ని ఇక్కడి శివలింగంలోనే భద్రపరచాడని ప్రతీతి. మహారాష్ట్రలోని పుణే సమీపంలో భీమా నది ఒడ్డున భీమశంకర క్షేత్రం ఉంది. త్రిపురాసుర సంహారం తర్వాత శివుడు ఇక్కడ విశ్రమించాడని పురాణాల కథనం. తమిళనాడులోని సాగరతీరాన రామేశ్వర క్షేత్రం ఉంది. రావణసంహారం తర్వాత శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు రామాయణం చెబుతోంది. మహారాష్ట్రలోని దారుకావనంలో నాగేశ్వర క్షేత్రం ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జ్యోతిర్లింగ క్షేత్రాల్లోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన విశ్వేశ్వర క్షేత్రం ఉంది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద త్రయంబకేశ్వర క్షేత్రం ఉంది. ఇక్కడి శివలింగం చిన్నగుంటలా ఉంటుంది. అందులో మూడుబొటన వేళ్లలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకలుగా మూడు చిన్న లింగాలు కనిపిస్తాయి. ఉత్తరాఖండ్‌లో మందాకినీ నది సమీపంలో హిమాలయాల్లో కేదారేశ్వర క్షేత్రం ఉంది. మంచుకారణంగా ఏడాదికి ఆరునెలలు మాత్రమే ఇందులో భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుంది. మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరా గుహల సమీపంలో ఘృష్ణేశ్వర క్షేత్రం ఉంది. చదవండి: అతడూ ఆమె: ‘ఒసేయ్..నా కళ్లజోడు తెచ్చివ్వు’! -
మహాశివరాత్రి వేడుకల్లో ప్రమాదం
-
'డీజే' టీజర్‌కు ముహుర్తం ఫిక్స్
సరైనోడు సినిమాతో బాక్లబస్టర్ సక్సెస్ సాధించిన అల్లు అర్జున్ త్వరలో డీజే దువ్వాడ జగన్నాథమ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కామెడీ యాక్షన్ సినిమాలను తెరకెక్కించే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. చాలా కాలం తరువాత దిల్ రాజు తన సొంత నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తుండటంతో డీజేపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగా ఇటీవల విడుదలైన డీజే ఫస్ట్ లుక్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ బ్రాహ్మణుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్న డీజే టీం, త్వరలో టీజర్‌తో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 24 ఉదయం 9 గంటలకు డీజే టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కొత్త ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.