shiva sena leaders
-
ఉద్ధవ్ థాక్రేపై అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఫైర్
లక్నో: అయోధ్యలో జనవరి 22న జరిగే ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలకు ఆహ్వానం అందలేదన్న శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేపై శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మండిపడ్డారు. ఆలయ మహా సంప్రోక్షణకు శ్రీరాముని భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందజేశామని తెలిపారు. రాముని పేరు చెప్పుకుని ప్రతిపక్షాలే రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రామున్ని నమ్మినవారే ప్రస్తుతం అధికారంలో ఉన్నారని అన్నారు. "రాముని భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందుతాయి. రాముని పేరు మీద బీజేపీ రాజకీయం చేస్తున్నారని చెప్పడం పూర్తిగా తప్పు. మన ప్రధానిని ప్రతిచోటా గౌరవిస్తారు. ఆయన తన హయాంలో ఎనలేని కృషి చేశారు. రాజకీయాలు కాదు.. ఇది ఆయన భక్తి” అని ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. రామ మందిర ప్రారంభ వేడుకలను బీజేపీ రాజకీయం చేస్తుందని శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ఇటీవల ఆరోపించారు. తమ పార్టీ ఎన్నికల్లో రాముడిని తమ అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆచార్య సత్యేంద్ర దాస్.. సంజయ్ రౌత్, ఉద్ధవ్ థాక్రేపై విరుచుకుపడ్డారు. రాముని పేరు ఎవరు వాడుకుంటున్నారో? తెలుసుకోవాలని ప్రశ్నించారు. రామ మందిర ప్రతిష్ఠాపనకు తనకు ఆహ్వానం అందకపోవడంపై థాక్రే బీజేపీని విమర్శించారు. మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చవద్దని అన్నారు. ఒకే పార్టీ చుట్టూ తిరగకూడదని చెప్పారు. రామాలయం ప్రారంభోత్సవం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. మందిర నిర్మాణం కోసం తన తండ్రి బాల్ థాక్రే చేసిన పోరాటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇటీవల రామాలయ వేడుక ఆహ్వానాన్ని సీపీఐ కార్యదర్శి సీతారాం ఏచూరి తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.. కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపు -
‘50 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లింది మరిచారా?’
ముంబై: శివసేన నేత ఆదిత్య ఠాక్రే, ఆయన తండ్రి, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. మీ ఇద్దరిని చూసి బీజేపీ భయపడదన్నారు. 32 ఏళ్ల వ్యక్తికి ఈ ప్రభుత్వం భయపడుతోందంటూ ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత మీడియాతో శుక్రవారం మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి. ‘కనీసం అతడి తండ్రిని చూసి కూడా ఇక్కడ ఎవరూ భయపడరు. మీ పార్టీ నుంచి అంతా చూస్తుండగానే 50 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అప్పుడు ముంబయి అట్టుడుకుతుందని, కాలిపోతుందన్నారు. కానీ అగ్గిపుల్ల కూడా మండలేదు.’ అని దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతకు ముందు అసెంబ్లీ వేదికగా.. శ్రీ సిద్ధివినాయక ఆలయ ట్రస్టులో అవకతవకలపై విచారణను నెలరోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: 'నన్నెవరు కొట్టలేదు.. అదో పెద్ద స్కామ్': నటి ఆవేదన -
చంద్రబాబుపై శివసేన వ్యంగ్యాస్త్రాలు
-
తొందరపడొద్దు: శివసేన నాయకులతో ఉద్ధవ్
సాక్షి, ముంబై: అధికారం కోసం శివసేన తమ ఎదుట మోకరిల్లుతుందని బీజేపీ భావిస్తే అది భ్రమే అవుతుందని శివసేన నాయకులు స్పష్టం చేశారు. మాతోశ్రీ బంగ్లాలో గురువారం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారం కోసం అనవసరంగా తొందరపడకూడదని ఉద్ధవ్ చెప్పినట్లు తెలిసింది. బీజేపీ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత నవంబర్ ఒకటో తేదీన బాంద్రాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గీయుల ద్వారా తెలిసింది. బీజేపీతో పాత అనుంబంధాన్ని కొనసాగించే విషయంపై శివసేనలో పాత ఎమ్మెల్యేలు జతకట్టాలని చెబుతుండగా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. ఇలా రెండు వేర్వేరు వర్గాల అభిప్రాయాలపై ఉద్దవ్ ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ మొదటి నుంచి తమపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందని కొందరు సేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా శివసేన పొత్తుపై బీజేపీ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శివసేన నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఓం మాథూర్ చెప్పగా, ఆ పార్టీతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని రాజీవ్ రూఢీచెప్పడం గమనార్హం. శివసేనకు రెండు క్యాబినెట్, కొన్ని సహాయ మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని పార్టీ వర్గీయుల ద్వారా తెలిసింది.