సెమీస్‌లో శివానుజ
జింఖానా, న్యూస్‌లైన్: వశిష్ట ఓపెన్ ఏఐటీఏ టాలెంట్ సిరీస్ బాలికల విభాగంలో టాప్ సీడ్ శివానుజ సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. కార్నివాల్ క్లబ్లో బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్‌లో శివానుజ 4-1, 4-2తో మాన్యా విశ్వనాథ్‌పై విజయం సాధించింది.
రెండో సీడ్ ఆనంద్ ధరాన 4-1, 4-2తో ఫాతిమా జువేరాపై గెలవగా, ఒమర్ మిష్గాన్ 4-0, 1-4, 4-2తో మిక్రా జైస్వాల్‌పై, ధృతి కపూర్ 4-2, 4-0తో అవంతి రెడ్డిపై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించారు. బాలుర విభాగంలో టాప్ సీడ్ అనికేత్ వెంకట్ క్వార్టర్‌ఫైనల్స్‌లోకి చేరుకున్నాడు.