Shivsensa
-
త్వరలో శివసేన నుంచి మరో సీఎం.. ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు
ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో శివసేనకు చెందిన వ్యక్తే మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని ప్రజలకు హామీ ఇచ్చారు. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రయోగాన్ని ఆయన వెనకేసుకొచ్చారు. బీజేపీ ఇచ్చిన మాట తప్పడం వల్లే ఎంవీఏ ఆవిర్భవించిందని, మహారాష్ట్ర ప్రజలు కూడా ఈ కూటమిని స్వాగతించారని పేర్కొన్నారు. శివసేన అధికారిక పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో థాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేనకు సొంతంగా సీఎం అయ్యే అవకాశం మరోసారి వస్తుందని, అయితే అందుకు పార్టీకి క్షేత్రస్థాయిలో పునరజ్జీవం పోయాల్సిన అవసరం ఉందని థాక్రే అభిప్రాయపడ్డారు. తాను రాష్ట్రమంతా పర్యటించి పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీలైనంత ఎక్కువ మందిని శివసేనలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసింది శివసేన. ఎన్నికల తర్వాత అనూహ్యంగా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రెండున్నరేళ్ల తర్వాత ఏక్నాథ్ షిండే.. థాక్రేపై తిరుగుబావుటా ఎగురవేశారు. దాదాపు 40మంది రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని చీల్చి బీజేపీతో జట్టుకట్టారు. ఇటీవలే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు శివసేన పార్టీ తమదే అని థాక్రే, షిండే వర్గాలు న్యాయపోరాటానికి దిగాయి. ప్రస్తుతం దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. చదవండి: పొలిటికల్ హీట్ పెంచిన షిండే ట్వీట్.. ఉద్ధవ్ థాక్రేతో స్నేహం! -
అవిశ్వాసం: ఉద్దవ్ థాకరేకు అమిత్ షా ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్లో పాలక నరేంద్ర మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరేతో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. బీజేపీతో కేంద్రంలో, మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న శివసేన పలు సందర్భాల్లో బీజేపీని ఇరుకునపెట్టేలా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో తాము విడిగా పోటీచేస్తామని శివసేన ప్రకటించింది. అయితే విపక్షాల అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ప్రభుత్వానికి బాసటగా నిలవాలని అమిత్ షా ఈ సందర్భంగా ఉద్ధవ్ థాకరేను కోరినట్టు సమాచారం. అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయేలా చేసే సంఖ్యాబలం బీజేపీకి ఉన్నా మిత్ర పక్షాలను విపక్షానికి సహకరించే పరిస్థితి తీసుకురాకూడదని కమలనాధులు భావిస్తున్నారు. మరోవైపు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలా అనే దానిపై పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శివసేన వైఖరి ఏంటో లోక్‌సభలో శుక్రవారం మాత్రమే అందరికీ తెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. గత నాలుగేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. -
నమో టీ స్టాల్.. శివ్ వడాపావ్
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ.. శివసేన పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. తమ తమ ప్రచారాలకు వినూత్నమార్గాన్ని ఎంచుకున్నాయి. శివసేన 'శివ్ వడాపావ్' పేరుతో తినుబండారాలను అందించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి ప్రతిగా బీజేపీ 'నమో టీ స్టాల్' పేరుతో నగరవ్యాప్తంగా టీ దుకాణాలను తెరవాలని నిర్ణయం తీసుకుంది. నమో అంటే నరేంద్ర మోదీ అన్న విషయం తెలిసిందే. నమో టీ స్టాళ్లను తమ పార్టీ సమావేశంలో నగర కార్పొరేటర్ ప్రకాశ్ గంగాధర్ ప్రతిపాదించారని, దీనిని పార్టీ ఆమోదించిందని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ నాయకుడు మనోజ్ కుమార్ తెలిపారు. ఈ ప్రతిపాదనను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎమ్సీజీఎమ్) కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపామని మనోజ్ తెలిపారు. కాగా ఇరుపార్టీల తీరును ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ ఛద్దా తప్పు పట్టారు.