shobha oza
-
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సుష్మితా దేవ్
న్యూఢిల్లీ: ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంపీ సుష్మితా దేవ్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. ప్రస్తుత మహిళా అధ్యక్షురాలు శోభా ఓజా స్థానంలో ఆమెను నియమిస్తూ పార్టీ శనివారం ఓ ప్రకటన చేసింది. అలాగే ఆల్ ఇండియా ఏఐసీసీ మధ్యప్రదేశ్ జనరల్ సెక్రటరీగా దీపక్ బబారియా, కార్యదర్శులుగా జబైర్ ఖాన్, సంజయ్ కపూర్ నియమితులయ్యారు. -
జైట్లీ వ్యాఖ్యలపై మండిపాటు
మహిళా కాంగ్రెస్ నిరసన ప్రదర్శన న్యూఢిల్లీ: నగరంలో అత్యాచార ఘటనలపై కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలపట్ల మహిళా కాంగ్రెస్ మండిపడింది. తక్షణమే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. జైట్లీ వ్యాఖ్యలకు నిరసనగా అశోకారోడ్డులోని బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకునేందుకు మహిళా కాంగ్రెస్ విభాగం సభ్యులు పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్పటికీ పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ విషయమై మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శోభా ఓజా మీడియాతో మాట్లాడుతూ ‘తాను త ప్పు చేశాననే విషయాన్ని జైట్లీ నిర్మొహమాటంగా అంగీకరించాలి. మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. కాగా నగరంలో జరిగిన ఓ అత్యాచార ఘటన వల్ల పర్యాటక రంగం దెబ్బతిందంటూ గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం అనంతరం జైట్లీ వ్యాఖ్యానించిన సంగతి విదితమే.