shoot video
-
టిక్‌టాక్.. ఎంత పని చేసింది?
సాక్షి, బెంగళూరు: టిక్‌టాక్ మోజులో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. టిక్‌టాక్ వీడియో చిత్రీకరిస్తూ ఒక యువకుడు కరెంట్ షాక్‌తో గాయపడ్డాడు. 22 ఏళ్ల యువకుడు కదులుతున్న గూడ్స్ రైలుపై నిలబడి టిక్‌టాక్ వీడియో చిత్రీకరిస్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. ఈ ప్రమాదంలో యువకుడికి 20 శాతం కాలిన గాయాలు అయ్యాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనలో అతడి ప్రాణానికి ప్రమాదం తప్పిందని తెలిసింది. ('అయినా.. నేను కొట్టింది నా భర్తనే కదా') మైసూర్ నుంచి వస్తున్న గూడ్స్ రైలు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు బెంగళూరు మెజెస్టిక్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ సమయంలో నెమ్మదిగా నడుస్తున్న గూడ్స్ రైలుపై టిక్‌టాక్ వీడియో చేసేందుకు ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. వీడియో తీసుకునే సమయంలో హైటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో షాక్ తగిలి కిందపడిపోయాడు. ఇది గమనించిన రైల్వే అధికారులు ఆ యువకుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడినిక ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. టిక్‌టాక్ వీడియోలు చేస్తూ యువత ప్రాణాలకు మీదకు తెచ్చుకోవడం పరిపాటిగా మారిపోయింది. అధికారులు, అయినవారు చెబుతున్నా వినకుండా యువత టిక్‌టాక్‌కు బానిసలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. (ప్రధాని ప్రసంగం అయిపోగానే.. తెగ వెతికారు!) -
రహస్యంగా నన్ను వీడియో తీశాడు
బెంగళూరు: ఓ ఆటో డ్రైవర్ మొబైల్ ఫోన్‌తో రహస్యంగా తనను వీడియో తీశాడని బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఆరోపించింది. ఆటోలోపల పైభాగంలో రహస్యంగా మొబైల్ అమర్చాడని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. కాగా తాను వీడియో తీయలేదని, కరెంట్ లేకపోవడంతో అంతకుముందు ప్రయాణికుడికి చిల్లర డబ్బు వెనక్కు ఇచ్చేందుకు మొబైల్ లైట్ వాడేందుకు దాన్ని పైభాగంలో పెట్టానని ఆటో డ్రైవర్ చెప్పాడు. ఈ నెల 24 రాత్రి రిచ్మండ్ టౌన్ వద్ద సంబంధిత మహిళ ఉద్యోగిని ఆటోలో ఎక్కింది. కొంచెం దూరం వెళ్లాక ఆటోలోపలి పైభాగం నుంచి ఓ వస్తువు ఆమెపై పడింది. దాన్ని మొబైల్ ఫోన్ గా గుర్తించింది. ఆటోడ్రైవర్ తనను వీడియో తీసేందుకు మొబైల్ ఫోన్‌ను రహస్యంగా ఉంచాడని భావించింది. ఆమె వెంటనే ఆటో ఆపాలని డ్రైవర్‌కు సూచించింది. ఆటో దిగగానే మొబైల్ ఫోన్ గురించి ప్రశ్నించింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న కుబ్బన్ పార్క్ పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతని మొబైల్ ఫోన్లో ఎలాంటి వీడియోలు కనిపించలేదని, ఫోరెన్సిక్ నిపుణులకు మొబైల్ పంపినట్టు పోలీసులు చెప్పారు. సంబంధిత మహిళ ఫిర్యాదు కోసం ఎదురు చూస్తున్నట్టు పోలీసులు చెప్పారు. పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిందిగా ఆమెకు చెప్పినట్టు తెలిపారు.