shooted
-
స్టార్ అథ్లెట్ అలెక్స్ క్వినెజ్ కాల్చివేత...
క్విటో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఈక్వెడార్‌కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్ అలెక్స్ క్వినెజ్ను దుండగులు కాల్చిచంపారు. గ్వాయకిల్ నగరంలో అతను కాలి్చవేతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. 32 ఏళ్ల అలెక్స్ 2019లో దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల స్ప్రింట్‌లో కాంస్య పతకం సాధించాడు. టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించినప్పటికీ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ‘ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు’ అనే నిబంధన అతిక్రమించడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు. అథ్లెట్ మృతిపట్ల ఈక్వెడార్ అధ్యక్షుడు గులెర్మో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: T20 World Cup 2021 Ind Vs Pak: ‘అసలేం చేశారయ్యా.. ఆ సెలక్షన్ ఏంటి?’ -
కుమారుడిపై తుపాకీతో కాల్పులు
వేలూరు: తుపాకీతో కుమారుడిని కాల్చి చంపిన ఘటన వేలూరులోని అడుక్కంబరైలో చోటుచేసుకుంది. పిల్లయార్‌గుడి వీధికి చెందిన సుబ్రమణి(50) రిటైర్ట్ ఆర్మీ జవాను. ప్రస్తుతం వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సుబ్రమణి మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి కుమార్తెను తిట్టాడు. కుమారుడు వినోద్(25) తండ్రిని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన సుబ్రమణి ఇంటిలో ఉంచిన తుపాకీతో వినోద్‌ను కాల్చడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శబ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకునేలోగా సుబ్రమణి పరారయ్యాడు. వేలూరు తాలుకా పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పరారీలో ఉన్న సుబ్రమణి కోసం గాలిస్తున్నారు. చదవండి: పాము మెడకు కండోమ్.. -
నడిరోడ్డుపై ఎమ్మెన్నెస్ నేత హత్య
థానే: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పదాధికారి జమీల్ షేక్‌ను వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగడు తుపాకీతో కాల్చి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటనలో జమీల్ షేక్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. థానే రాబోడిలోని బిస్మిల్లా హోటల్ ఎదురుగా సోమవారం మధ్యాహ్యం 1.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న జమీల్‌పై దుండగుడు కాల్చిన బుల్లెట్ నేరుగా తలలోకి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలపాలైన జమీల్‌ను స్థానికులు జుపిటర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎమ్మెన్నెస్ పదాధికారులు అవినాష్ జాదవ్, రవీంద్ర మోరేలతోపాటు పోలీస్ డిప్యూటీ కమిషనర్ అవినాష్ అబురే, నేర పరిశోధన శాఖ డిప్యూటీ కమిషనర్ లక్ష్మికాంత్ పాటిల్, సహాయక కమిషనర్ నీతా పాడవి, రాబోడి సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర శిరతోడే తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. థానేలో జరిగిన ఈ సంఘటనతో పోలీసు యంత్రాంగం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హంతకుని కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాబోడిలో క్లస్టర్ యోజనను ఎమ్మెన్నెస్ ముఖ్యంగా జమీల్ షేక్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీంతోనే ఈ హత్య జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
గన్ సేఫ్టీపై చర్చిస్తూనే.. చర్చిలో కాల్పులు
న్యూయార్క్: అమెరికాలో జనరల్‌గా నిర్వహించుకునే థాంక్స్ గివింగ్ మీల్ అనుకోని ప్రమాదానికి దారితీసింది. ఇటీవల టెక్సాస్ చర్చిలో జరిగిన కాల్పుల దుర్ఘటన నింపిన విషాదాన్ని తలుచుకుంటూ ఉండగా..మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. పెరుగుతున్న గన్ కల్చర్, ముఖ్యంగా చర్చిలో జరుగుతున్న కాల్పులు, హింసపై అక్కడ కొంతమంది పెద్ద వాళ్లు( సీనియర్ సిటిజన్స్) చర్చిలో సమావేశమయ్యారు. మృతులకు నివాళులర్పించిన అనంతరం కాల్పులు, తదనంతర పరిణామాలు, గన్ సేఫ్టీపై చర్చించుకుంటున్నారు. కానీ తామూ తుపాకి కాల్పుల బాధితులమవుతామని...ఆ ఆహ్లాదకరమైన మధ్యాహ్నం ..భయంకరమైన మలుపు తిరుగుతుందని అస్సలు ఊహించలేదు వారిలో ఓ వృద్ధ జంట. ఏం జరిగిందో తెలుసుకునే లోపే క్షణాల్లో తుపాకీ గుళ్లు ఆ దంపతుల శరీరంలోకి దూసుకుపోయాయి. వివరాల్లోకి వెడితే.. న్యూయార్క్‌లోని ఈస్ట్ టెన్నెసీ చర్చ్‌లో థాంక్స్ గివింగ్ విందును ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 20 మంది సీనియర్ సిటిజన్లు ఈ విందు హాజరయ్యారు. వారిలో యునైటెడ్ మెథడిస్ట్ చర్చి సభ్యుడు పెద్దాయన (81) తన వెంట తెచ్చుకున్న తుపాకిని చూపించి, దాని వాడాలో అక్కడున్న వారికి వివరించాడు. 38-కాలిబర్ రగ్గర్ హ్యాండ్ గన్ను ఓపెన్ చేసి ,మ్యాగజైన్ లోడ్ చేసి అక్కడున్నవారికి చూపించాడు. దాన్ని అలాగే పక్కన పెట్టాడు. ఇంతలో మరో సభ్యుడు తనకూ చూపించమంటూ..వెంటనే ట్రిగ్గర్ నొక్కాడు. అంతే క్షణాల్లో బుల్లెట్ పెద్దాయన అరచేతిలోంచి...పక్కనే వీల్ చైర్లో కూర్చుని వున్న భార్య (80) పొట్ట, ముంజేతిలోకి దూసుకుపోయింది. అయితే ప్రమాదవశాత్తూ జరిగిన ఈ కాల్పుల్లో గాయపడిన భార్యాభర్తలిద్దరి ఆరోగ్యపరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందనీ, ఎవరిమీదా కేసు నమోదు చేయలేదని పోలీసు ఉన్నతాధికారి రుస్ పార్క్స్ తెలిపారు. ఇటీవలి మాస్ షూటింగ్ నేపథ్యంలో స్థానిక చర్చిలలో సెమినార్లు నిర్వహించాలని కౌంటీ షెరీఫ్ విభాగం నిర్ణయించడంతో వీరు కూడా సమావేశమయ్యారని తెలిపారు. కాగా టెక్సాస్‌లోని చిన్నపట్టణం విల్సన్ కంట్రీలోని సుదెర్‌ల్యాండ్‌లో ఉన్న ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో 26 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. -
నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య
-
నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య
నోయిడా : ఉత్తర ప్రదేశ్ నోయిడాలో ఓ తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు నల్గొండ జిల్లాకు చెందిన సందేశ్ భాస్కర్(23)గా గుర్తించారు. నోయిడాలోని అమేథీ యూనివర్సిటీలో మెరైన్ సైన్స్‌లో విద్యను అభ్యసిస్తున్నాడు. స్థానిక అపార్ట్మెంట్లో తన మిత్రులైన నదీమ్, మధుర్ తో కలిసి ఉంటున్నాడు. శనివారం సాయంత్రం 4.30 ని.లకు అమన్ అనే విద్యార్థి భాస్కర్ రూమ్‌కు వచ్చి బెల్ గొట్టాడు.ఆ టైమ్‌లో రూమ్‌లో భాస్కర్ ఒక్కడే ఉన్నాడు. భాస్కర్ తలుపు తీశాడు. ఒక్కసారిగా అమన్ భాస్కర్‌పై దాడికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య పెనుగుసలాట జరిగింది. వెంటనే అమన్ తనతో పాటు తెచ్చుకున్న గన్‌తో భాస్కర్ తలపై కాల్చాడు. దీంతో భాస్కర్ అక్కడిక్కడే మృతి చెందాడు. అమన్ అదే యూనివర్సిటీలో టూరిజం విద్యార్ధిగా పోలీసులు గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. భాస్కర్ రూమ్మేట్స్ ఇద్దరు అమేథీ యూనివర్సిటీ ఇద్దరు టూరిజం విద్యార్థులు. భాస్కర్‌కు అతని రూమ్మేట్స్ ద్వార అమన్‌తో పరిచయం ఉందని తెలుస్తోంది. ఏదైనా పెద్ద గొడవలు హత్యకు దారితీసి ఉంటాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భాస్కర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.