
గ్రామంలో విచారిస్తున్న పోలీసులు
వేలూరు: తుపాకీతో కుమారుడిని కాల్చి చంపిన ఘటన వేలూరులోని అడుక్కంబరైలో చోటుచేసుకుంది. పిల్లయార్‌గుడి వీధికి చెందిన సుబ్రమణి(50) రిటైర్ట్ ఆర్మీ జవాను. ప్రస్తుతం వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సుబ్రమణి మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి కుమార్తెను తిట్టాడు. కుమారుడు వినోద్(25) తండ్రిని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఆగ్రహించిన సుబ్రమణి ఇంటిలో ఉంచిన తుపాకీతో వినోద్‌ను కాల్చడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శబ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకునేలోగా సుబ్రమణి పరారయ్యాడు. వేలూరు తాలుకా పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పరారీలో ఉన్న సుబ్రమణి కోసం గాలిస్తున్నారు.
చదవండి: పాము మెడకు కండోమ్..
Comments
Please login to add a commentAdd a comment