దూడ కాదు... ఆవు!
కొచ్చి: కేరళలోని కొజికోడ్‌లో ‘మాణిక్యం’ ఇప్పుడొక సెలబ్రిటీ. తనను చూడటానికి లోకల్ జనాలే కాదు... విదేశాల నుంచి కూడా అనేకమంది వస్తున్నారు. మరి మాణిక్యం ఎవరు? ప్రత్యేకత ఏమంటే... ఫొటోలో ఒక ఆవు పక్కన దూడలా కనిస్తున్న ఆవు పేరే ‘మాణిక్యం’. భూమిపై అత్యంత పొట్టి ఆవు(షార్టెస్ట్ కౌ ఇన్ ది ప్లానెట్)గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది ఈ ఆవు.
కేవలం రెండు అడుగుల ఎత్తుతో, 40 కిలోల బరువుతో ఉండే మాణిక్యం రెండు పూటలా పుష్కలంగా పాలిస్తుంది. పొట్టి ఆవుల జాతిలోకెళ్లా పొట్టిగా మాణిక్యం రికార్డు పుటల్లోకెక్కింది. దీంతో అనునిత్యం ఎంతో మంది స్థానికులు, జాతీయ అంతర్జాతీయ మీడియా వాళ్లు కూడా వచ్చి మాణిక్యంను కళ్లారా చూసి ఫొటోలు తీసుకొని వెళుతున్నారు.