సీజన్ ముగింపు టోర్నీకి సెరెనా దూరం
సింగపూర్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ నుంచి ఐదుసార్లు మాజీ విజేత సెరెనా విలియమ్స్ వైదొలిగింది. భుజం గాయం కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రపంచ రెండో ర్యాంకర్ అయిన సెరెనా వివరించింది. సింగపూర్ వేదికగా ఈ టోర్నీ ఈనెల 23 నుంచి 30 వరకు జరుగుతుంది. ప్రపంచ సింగిల్స్ ర్యాంకిం గ్సలో టాప్-8లో ఉన్న వాళ్లు ఈ టోర్నీలో ఆడతారు. ‘సింగపూర్‌కు వచ్చి అత్యుత్తమ క్రీడాకారిణులతో ఆడాలని ఆశించాను.
కానీ భుజం గాయం పూర్తిగా తగ్గాలంటే నిలకడగా చికిత్స తీసుకోవాలని నా వైద్యుడు సూచించాడు. దాంతో రాబోయే కొన్ని వారాలపాటు నేను ఆటకు దూరంగా ఉంటాను’ అని సెరెనా తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఇప్పటికే ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), సిమోనా హలెప్ (రొమేనియా), అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలాండ్), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), ముగురుజా (స్పెరుున్), మాడిసన్ కీస్ (అమెరికా), సిబుల్కోవా (స్లొవేకియా) అర్హత సాధించారు.