Shrimaan
-
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన శ్రీమాన్(21), శివాణి (20) ఆదివారం ఉదయం 11గంటలకు గుట్ట పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో బస చేశారు. సాయంత్రం యాదాద్రి కొండపైకి వెళ్లి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వారు ఉన్న గదిలో రాత్రి నిద్ర చేశారు. సోమవారం తెల్లవారుజామున ఆ ప్రేమికులు ఫినాయిల్‌ను తాగి అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. గమనించిన లాడ్జి నిర్వహకులు పోలీసులకు, 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే శ్రీమాన్, శివాణిలను చికిత్స నిమిత్తం తొలుత భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఇరు కుటుంబాల సభ్యులకు చెప్పి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. -
మరో ‘దెయ్యం’ చిత్రంగా కొప్పెరుందేవి
దెయ్యం ఇతివృత్తాలతో కూడిన హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రాల హవా కొనసాగుతూనే ఉంది. ఆ మధ్య వచ్చిన ముని, కాంచన, అరణ్మణై నుంచి ఇటీవల విడుదలైన కాంచన-2 వరకు నిర్మాతలకు, బయ్యర్లకు కాసుల వర్షం కురిపించాయి. ఆ తరహాలో మరో దెయ్యం కథా చిత్రం రాబోతోంది. కొప్పెరుందేవి పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం కాంచన-2, అరణ్మణై చిత్రాల్లో నటించిన పలువురు ప్రముఖ నటీనటులను దర్శకుడు శంకర్ పళని స్వామి ఎంపిక చేసుకున్నారు. కోవై సరళ, ఊర్వశి, మనో బాల, వీటీవీ గణేష్, సింగంపులి, శ్రీమాన్, దేవదర్శిణి, ఇలవరసు, లొల్లు స్వామినాథన్, పాండు ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. హర్రర్ కామెడి థ్రిల్లర్ సన్నివేశాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఈ చిత్రం కల్గిస్తుందని దర్శకుడు అంటున్నారు. తమిళ సినీ చరిత్రలోనే తొలిసారిగా ఈ చిత్రం కోసం మంచుకొండల ప్రాంతం లడక్‌లో భారీ సెట్టింగ్ వేసి ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు.