మరో ‘దెయ్యం’ చిత్రంగా కొప్పెరుందేవి | new Horror Thriller movie | Sakshi
Sakshi News home page

మరో ‘దెయ్యం’ చిత్రంగా కొప్పెరుందేవి

Published Tue, May 5 2015 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

మరో ‘దెయ్యం’ చిత్రంగా  కొప్పెరుందేవి

మరో ‘దెయ్యం’ చిత్రంగా కొప్పెరుందేవి

దెయ్యం ఇతివృత్తాలతో కూడిన హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రాల హవా కొనసాగుతూనే ఉంది. ఆ మధ్య వచ్చిన ముని, కాంచన, అరణ్మణై నుంచి ఇటీవల విడుదలైన కాంచన-2 వరకు నిర్మాతలకు, బయ్యర్లకు కాసుల వర్షం కురిపించాయి. ఆ తరహాలో మరో దెయ్యం కథా చిత్రం రాబోతోంది. కొప్పెరుందేవి పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం కాంచన-2, అరణ్మణై చిత్రాల్లో నటించిన పలువురు ప్రముఖ నటీనటులను దర్శకుడు శంకర్ పళని స్వామి ఎంపిక చేసుకున్నారు. కోవై సరళ, ఊర్వశి, మనో బాల, వీటీవీ గణేష్, సింగంపులి, శ్రీమాన్, దేవదర్శిణి, ఇలవరసు, లొల్లు స్వామినాథన్, పాండు ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. హర్రర్ కామెడి థ్రిల్లర్ సన్నివేశాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఈ చిత్రం కల్గిస్తుందని దర్శకుడు అంటున్నారు. తమిళ సినీ చరిత్రలోనే తొలిసారిగా ఈ చిత్రం కోసం మంచుకొండల ప్రాంతం లడక్‌లో భారీ సెట్టింగ్ వేసి ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement