Shriya Bhopal
-
ముడి పడటంలేదా?
మనసు... మనసు కలవాలంటే ముడి పడాలిగా.. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి అవ్వాలంటే మూడు ముళ్లు పడాలిగా.. ఎంగేజ్‌మెంట్‌కీ, పెళ్లికీ ఇండియా నుంచి ఇటలీ అంత దూరం ఉంటే. ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చా? అఖిల్–శ్రియా భూపాల్ ఎంగేజ్మెంట్ హైదరాబాద్‌లో జరిగింది. పెళ్లి మాత్రం రోమ్‌లో అనుకున్నారు. ఇలాంటి పెళ్లిళ్లను ఇప్పుడు ‘డెస్టినేషన్ వెడ్డింగ్’ అంటున్నారు. ఒక నాలుగైదు వందల మందిని మాత్రం పెళ్లికి ఆహ్వానిస్తున్నారు.. అటు అక్కినేనివారు.. ఇటు జీవీకేగారూ గెస్ట్ లిస్ట్ ఫైనలైజ్ చేశారు. గెస్టులు విమానం టిక్కెట్స్ ఫైనలైజ్ చేశారు. ఆహ్వానించని కొంతమందికి మేం కూడా వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. మమ్మల్ని పిలవలేదని కొంచెం బాధగా ఉంటుంది. అసలు లిస్టులో ఉండని రూమర్గాళ్లకి కాలుతూ ఉంటుంది. ఇక్కడ మొదలైంది మరి.. అసలు కహానీ.. అఖిల్–శ్రియ ఎయిర్‌పోర్టులో గొడవపడ్డారని, అఖిల్ ఇంకా చిన్నవాడు కాబట్టి నెర్వస్‌గా ఫీల్ అయ్యాడని, ఇప్పుడే పెళ్లయితే కెరీర్ ఏంటి అనే టెన్షన్ మొదలైందని... అటు శ్రియ ఏమో అఖిల్ సరిగ్గా తనతో టైమ్ స్పెండ్ చేయడంలేదని, మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నా, ఎంగేజ్మెంట్ తర్వాత ప్రేమ తగ్గిందని, చివరికి ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరూ మాటా మాటా అనుకున్నారని.. ఇటలీకి పెళ్లికి వెళ్లాల్సిన అఖిల్ గోవాకీ, శ్రియ అమెరికాకీ చెక్కేశారనీ ఎవరి నోటికి వచ్చినట్లు వాళ్లు పేలుతున్నారు..ఎవరైనా పెళ్లి జరగాలని, రెండు కుటుంబాలూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఫ్యాన్స్, శ్రేయోభిలాషులైతే ప్రార్థిస్తారు. బ్రేకప్ అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో.. ఎంత ఇమాజినేషన్ ఉందో అఖిల్–శ్రియాలకు తెలుసు. వీళ్లకి ‘ముడి పడుద్దా’? రూమర్ రాసినోళ్లకు మూడుద్దా.. కొంచెం ఆగితే తెలిసిపోద్ది.. అప్పటివరకూ మీరు, మేమూ, ఫ్యామిలీ.. ‘జంట’ సంతోషంగా ఉండాలని ఆశిద్దాం. -
చైతూ తర్వాతే అఖిల్ పెళ్లి?
అక్కినేని అన్నదమ్ములు నాగచైతన్య, అఖిల్.. ఇద్దరిలో ముందు ఏడడుగులు వేసేది ఎవరంటే? అఖిల్ పేరు వినిపించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే... ఆల్రెడీ అఖిల్, శ్రియా భూపాల్ల నిశ్చితార్థం జరిగింది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమంతతో ప్రేమలో ఉన్నానని చెప్పిన నాగచైతన్య, వచ్చే ఏడాది ఏడడుగులు వేస్తానని చెప్పారు. కానీ, ఎప్పుడనేది స్పష్టంగా చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం... ముందు చైతూ పెళ్లి, ఆ తర్వాతే అఖిల్ పెళ్లి జరిపించాలని నాగార్జున అనుకుంటున్నారట! జనవరి 29న చైతూ, సమంతల నిశ్చితార్థ వేడుకను కూడా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వినికిడి. అక్కినేని ఫ్యామిలీ ఈ నిశ్చితార్థం వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. కొత్త కబురు ఏంటంటే... చైతూ, సమంతలు సింపుల్‌గా ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటు న్నారట. కానీ, విదేశాల్లో కుమారుడి పెళ్లి ఘనంగా జరిపించాలని నాగార్జున కోరు కుంటున్నారట! అఖిల్–శ్రియాల పెళ్లి ఇటలీలో జరగనుందనే విషయం తెలిసింది. అదే విధంగా చైతూ కూడా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటే బాగుంటుందని నాగార్జున కోరిక అని సమాచారం. ముఖ్యంగా అఖిల్ పెళ్లి కంటే ముందే చైతూ పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారట! ‘‘నా కంటే ముందు అఖిల్ పెళ్లి జరగడం హ్యాపీ. (నవ్వుతూ..) అందరి దృష్టి అఖిల్‌పై ఉంటుంది కదా! ఆ తర్వాత నేను హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. ఇండియాలోనే పెళ్లి చేసుకుంటా. అయితే.. అది చెన్నైలోనా? హైదరాబాద్‌లోనా? అనడిగితే చెప్పలేను’’ అని ‘సాహసం శ్వాసగా సాగిపో’ రిలీజ్ టైమ్‌లో నాగచైతన్య చెప్పారు. కానీ, తండ్రి నాగార్జున కోరిక తెలిసిన తర్వాత చైతూ తన పెళ్లి ప్లాన్ మార్చుకుంటున్నారేమో? -
అఖిల్ నిశ్చితార్థం
-
అక్కినేని అఖిల్ నిశ్చితార్థం
ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్, ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి (జీవీకే) మనవరాలు శ్రీయా భూపాల్ల నిశ్చితార్థ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. జీవీకే స్వగృహంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో అమల, జీవీకే, నాగార్జునలతో అఖిల్, శ్రీయా భూపాల్. -
అఖిల్ నిశ్చితార్థ వేడుక ఆహ్వానం
‘శ్రీమతి అన్నపూర్ణ మరియు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు ఆశీర్వాదాలతో... మా అబ్బాయి అఖిల్ నిశ్చితార్థ వేడుకకు మిమ్మల్ని అమితానందంతో ఆహ్వానిస్తున్నాం’ - ఇట్లు అమల అండ్ అక్కినేని నాగార్జున. సినీ ప్రముఖులకూ, సన్నిహితులకూ అక్కినేని కుటుంబం నుంచి అందిన ఆహ్వానం ఇది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలు, సోమనాద్రి భూపాల్, షాలినీ దంపతుల కుమార్తె శ్రీయా భూపాల్, అఖిల్‌ల ప్రేమను ఇరు కుటుంబ సభ్యులూ అంగీకరించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు జీవీకే ఇంట్లో నిశ్చితార్థం జరగనుంది. వచ్చే ఏడాది పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటలీ రాజధాని రోమ్‌లో పెళ్లి చేయాలనుకుం టున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్‌నగర్ టాక్