ముడి పడటంలేదా? | Real reason why Nagarjuna's son Akhil Akkineni, Shriya Bhupal called off wedding? | Sakshi
Sakshi News home page

ముడి పడటంలేదా?

Published Thu, Feb 23 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM

అఖిల్, శ్రియా భూపాల్‌ ఎంగేజ్‌మెంట్‌ ఫొటో

అఖిల్, శ్రియా భూపాల్‌ ఎంగేజ్‌మెంట్‌ ఫొటో

మనసు... మనసు కలవాలంటే ముడి పడాలిగా..
ఎంగేజ్‌మెంట్‌ తర్వాత పెళ్లి అవ్వాలంటే మూడు ముళ్లు పడాలిగా..
ఎంగేజ్‌మెంట్‌కీ, పెళ్లికీ ఇండియా నుంచి ఇటలీ అంత దూరం ఉంటే.


ఏదైనా ప్రాబ్లమ్‌ రావచ్చా?
అఖిల్‌–శ్రియా భూపాల్‌ ఎంగేజ్‌మెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. పెళ్లి మాత్రం రోమ్‌లో అనుకున్నారు.
ఇలాంటి పెళ్లిళ్లను ఇప్పుడు ‘డెస్టినేషన్‌ వెడ్డింగ్‌’ అంటున్నారు.
ఒక నాలుగైదు వందల మందిని మాత్రం పెళ్లికి ఆహ్వానిస్తున్నారు..
అటు అక్కినేనివారు.. ఇటు జీవీకేగారూ గెస్ట్‌ లిస్ట్‌ ఫైనలైజ్‌ చేశారు.

గెస్టులు విమానం టిక్కెట్స్‌ ఫైనలైజ్‌ చేశారు.
ఆహ్వానించని కొంతమందికి మేం కూడా వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. మమ్మల్ని పిలవలేదని కొంచెం బాధగా ఉంటుంది.
అసలు లిస్టులో ఉండని రూమర్‌గాళ్లకి కాలుతూ ఉంటుంది.

ఇక్కడ మొదలైంది మరి.. అసలు కహానీ..
అఖిల్‌–శ్రియ ఎయిర్‌పోర్టులో గొడవపడ్డారని, అఖిల్‌ ఇంకా చిన్నవాడు కాబట్టి నెర్వస్‌గా ఫీల్‌ అయ్యాడని, ఇప్పుడే పెళ్లయితే కెరీర్‌ ఏంటి అనే టెన్షన్‌ మొదలైందని... అటు శ్రియ ఏమో అఖిల్‌ సరిగ్గా తనతో టైమ్‌ స్పెండ్‌ చేయడంలేదని, మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నా, ఎంగేజ్‌మెంట్‌ తర్వాత ప్రేమ తగ్గిందని, చివరికి ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరూ మాటా మాటా అనుకున్నారని.. ఇటలీకి పెళ్లికి వెళ్లాల్సిన అఖిల్‌ గోవాకీ, శ్రియ అమెరికాకీ చెక్కేశారనీ ఎవరి నోటికి వచ్చినట్లు వాళ్లు పేలుతున్నారు..ఎవరైనా పెళ్లి జరగాలని, రెండు కుటుంబాలూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఫ్యాన్స్, శ్రేయోభిలాషులైతే ప్రార్థిస్తారు.

బ్రేకప్‌ అంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో.. ఎంత ఇమాజినేషన్‌ ఉందో అఖిల్‌–శ్రియాలకు తెలుసు. వీళ్లకి ‘ముడి పడుద్దా’?
రూమర్‌ రాసినోళ్లకు మూడుద్దా.. కొంచెం ఆగితే తెలిసిపోద్ది..
అప్పటివరకూ మీరు, మేమూ, ఫ్యామిలీ.. ‘జంట’ సంతోషంగా ఉండాలని ఆశిద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement