సమంత, చైతూల నిశ్చితార్థం ఎప్పుడంటే..? | Naga CHaitanya and Samantha Engagement Date Fixed | Sakshi
Sakshi News home page

సమంత, చైతూల నిశ్చితార్థం ఎప్పుడంటే..?

Published Sun, Dec 25 2016 1:42 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM

సమంత, చైతూల నిశ్చితార్థం ఎప్పుడంటే..?

సమంత, చైతూల నిశ్చితార్థం ఎప్పుడంటే..?

అక్కినేని వారసుడు నాగచైతన్య.. అందాల భామ సమంతను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే తాము ప్రేమలో ఉన్నట్టుగా తెలిపిన సమంత, నాగచైతన్యలు పెళ్లి ఎప్పుడన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వచ్చే ఏడాది తప్పకుండా పెళ్లి చేసుకుంటామని హింట్ ఇచ్చినా.. ఇన్నాళ్లు డేట్ మాత్రం ప్రకటించలేదు. అయితే ఇటీవల జరిగిన అఖిల్ నిశ్చితార్థ వేడుక చూసిన తరువాత మనసు మార్చుకున్నారో ఏమో గాని నాగచైతన్య, సమంత నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ చేసేశారు.

2017 జనవరి 29న ఇద్దరు యువ జంట నిశ్చితార్థం ఘనంగా నిర్వహించేందుకు అక్కినేని కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. నిశ్చితార్థం తరువాత కాస్త గ్యాప్ తీసుకొని అఖిల్ పెళ్లి తరహాలోనే నాగచైతన్య, సమంతల వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్లా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పనుల్లో బిజీగా ఉండగా సమంత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది. ఒకటి రెండు తమిళ సినిమాలు అంగీకరించిందన్న టాక్ వినిపించినా.. షూటింగ్ లకు మాత్రం వెళ్లటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement