ఘనంగా చైతూ, సమంత ఎంగేజ్ మెంట్‌ | Naga CHaitanya and Samantha Engagement is over | Sakshi
Sakshi News home page

ఘనంగా చైతూ, సమంత ఎంగేజ్ మెంట్‌

Published Sun, Jan 29 2017 9:35 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

ఘనంగా చైతూ, సమంత ఎంగేజ్ మెంట్‌ - Sakshi

ఘనంగా చైతూ, సమంత ఎంగేజ్ మెంట్‌

హైదరాబాద్:  అక్కినేని వారింట మరో సందడి మొదలైంది. అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సుముహుర్తం రానే వచ్చింది. అక్కినేని నాగార్జున తనయుడు టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా చాలా కూల్‌గా ఈ ఎంగేజ్ మెంట్ నిర్వహించారు. తన పెద్ద కుమారుడి ఎంగేజ్ మెంట్‌పై నాగార్జున చాలా హ్యాపీగా ఉన్నారు.

నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం పొటోలను, తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. సంతోషాన్ని మాటల్లో చెప్పలేనంటూ ట్వీట్లో రాసుకొచ్చారు కింగ్ నాగార్జున. మా అమ్మ నా కూతురు అయిందని పేర్కొన్న నాగ్‌.. సమంత, చైతూకు ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడుగుతున్న ఫొటోను షేర్ చేసుకున్నారు.  #chaisam  చైస్యామ్ అనే ట్యాగ్‌తో సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ఎంగేజ్‌మెంట్‌ను ప్రకటించేశారు నాగ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement